హరి శివకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జననం1942 ఏప్రిల్ 19
వరంగల్ పట్టణం, తెలంగాణా రాష్ట్రం
వృత్తిఅధ్యాపకుడు
ప్రసిద్ధిసాహిత్యకారుడు, చరిత్రకారుడు
మతంహిందూ

హరి శివకుమార్ ప్రఖ్యాత తెలుగు సాహిత్యకారుడు, చరిత్రకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1942 ఏప్రిల్ 19-న జన్మించాడు. జన్మించిన శివకుమార్ డిగ్రీ వరకు వరంగల్లో చదివి పిజి తెలుగు హైదరాబాద్ లో చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కేతన రచనలపై పరిశోధనకు పి.హెచ్.డి పట్టా అందుకున్న అతను కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేశాడు[1]. తెలుగు శాఖాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా పలు బాధ్యతలు నిర్వర్తించాడు. హరి శివకుమార్ వద్ద 13 మంది ఎంఫిల్, 7 గురు పి.హెచ్.డి చేసారు.అతని తండ్రి హరిరాధాకృష్ణమూర్తి, భద్రకాళి దేవాలయ పునరుద్ధరణలో కీలక భూమిక పోషించాడు. చిన్ననాటి నుంచే భద్రకాళి అమ్మవారిపై భక్తితో పాటు వరంగల్ చరిత్రపై ఆసక్తి కలిగిన శివకుమార్ ఆ తర్వాత కాకతీయులకు సంబంధిన మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తెచ్చాడు. అతను వేయిస్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల శతాబ్ది ఉత్సవాల ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియచేసిన చరిత్ర శోధకుడు. గద్వాల సంస్థానము- సాహిత్యసేవ[2], వ్యాసలహరి వంటి గ్రంథాలు ఆయనలోని సాహిత్యకోణాన్ని ఆవిష్కరిస్తే, కాకతీయ వైభవం, వేయిస్తంభాల దేవాలయం చరిత్ర, శ్రీ భద్రకాళి దేవాలయం చరిత్ర, శ్రీ కాశీవిశ్వేశ్వర రంగనాథుల ఆలయాలు వంటివి ఆయనలోని చరిత్రకారుడిని ఆవిష్కరించాయి. ఆయనలోని సాహిత్యకారుడు మంత్ర శాస్త్ర అర్థ విశ్లేషకుడు కూడా. మహామృత్యుంజయ పాశుపత తంత్రం, శ్రీ దుర్గా తంత్రమ్, శ్రీ సర్పతంత్రం వంటి మంత్ర శాస్త్ర గ్రంథాలు ఇందుకు నిదర్శనం. శివకుమార్ అనువాదకులు కూడా. కంచి పరమాచార్య భారతీతీర్థుల వారి ప్రబోధాత్మక సంభాషణలను ఆంగ్లం‌నుంచి తెలుగులోకి అనువాదం, మహాత్మా త్రైలింగ స్వామి జీవితము- ఉపదేశమ్ అనే గ్రంథాన్ని హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. సద్గురు కందుకూరి శివానందమూర్తికి శిష్యుడుగా ఆయనతో కలిసి చారిత్రక చర్చలు చేస్తూ భారతీయ చరిత్ర పై సునిశిత విశ్లేషణ చేసేవారు. వరంగల్ అసలు చరిత్ర భావి తరాలకు తెలియాలన్న సంకల్పంతో 2016 లో ‘ఓరుగల్లు అసలు చరిత్ర’ అనే పుస్తకం వ్రాశారు. 2013లో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాన్ని అందుకున్న హరిశివకుమార్ ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందారు . కొంతకాలం అనారోగ్యంతో బాధపడి 2017 ఆగస్టు 5న వరంగల్‌లోని స్వగృహంలో కన్నుమూశాడు.

రచనలు[మార్చు]

  • తెలుగులో కథాకావ్యాల స్వరూప స్వభావాలు[3].
  • మహామృత్యుంజయ పాశుపత తంత్రం
  • శ్రీ దుర్గా తంత్రమ్
  • శ్రీ సర్పతంత్రం
  • కేతన[4]
  • బాల ప్రౌఢ వ్యాకరణములు - విశ్లేషాత్మక అధ్యయనం[5]

పురస్కారాలు[మార్చు]

  • 2013 : పరిశోధన రంగంలో అతనికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం[6][7].

మూలాలు[మార్చు]

  1. "జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన సాలంకృత్ కృష్ణదేవరాయలు పుస్తకంలోముందుమాట" (PDF). Archived from the original (PDF) on 2018-05-08.
  2. "Gadvala samsthanamu-sahityaseva / Hari Sivakumar | Hari Sivakumar | The National Library of Israel". www.nli.org.il (in ఇంగ్లీష్). Retrieved 2020-04-07.
  3. "తెలుగులో కథాకావ్యాల స్వరూప స్వభావాలు" (PDF).{{cite web}}: CS1 maint: url-status (link)
  4. Dr.Hari Shivakumar (1973). Ketana (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  5. "బాల ప్రౌడ వ్యాకరణములు విశ్లేషణాత్మక అధ్యయనము | BalaProudaVyakaranamu". www.freegurukul.org. Retrieved 2020-04-07.[permanent dead link]
  6. "32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Sakshi. 2013-11-21. Retrieved 2020-04-07.
  7. "కీర్తి పురస్కారాల జాబితా" (PDF). Archived from the original (PDF) on 2017-09-09.

బాహ్య లంకెలు[మార్చు]