హుస్నాబాదు రెవెన్యూ డివిజను
హుస్నాబాదు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్ధిపేట |
హుస్నాబాదు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సిద్ధిపేట జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం హుస్నాబాద్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]
పరిపాలన
[మార్చు]హుస్నాబాదు డివిజనులోని మండలాలు:[5]
క్ర.సం | హుస్నాబాద్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | హుస్నాబాద్ మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
2 | అక్కన్నపేట మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
3 | కోహెడ మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
4 | బెజ్జంకి మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
5 | మద్దూరు మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
6 | నారాయణరావుపేట మండలం | 5 రెవెన్యూ గ్రామాలు |
7 | దూళిమిట్ట మండలం | 8 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-08.
- ↑ "Subdivision & Blocks | GOVERNMENT OF TELANGANA, SIDDIPET DISTRICT | India". siddipet.telangana.gov.in. Archived from the original on 2021-02-26. Retrieved 2022-08-08.
- ↑ Vemula, Prakash (2022-03-15). "List of Revenue Divisions, Mandals in Siddipet District". TeachersBadi. Archived from the original on 2020-09-25. Retrieved 2022-08-08.
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-08.