1969 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1969 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
← 1967 1969 ఆగస్టు 30 1974 →
 
Nominee గోపాల్ స్వరూప్ పాఠక్
Party స్వతంత్ర రాజకీయ నాయకుడు
Home state ఉత్తర ప్రదేశ్
Electoral vote 400

ఎన్నికలకు ముందు ఉప రాష్ట్రపతి

వి.వి.గిరి
స్వతంత్ర రాజకీయ నాయకుడు

Elected ఉప రాష్ట్రపతి

గోపాల్ స్వరూప్ పాఠక్
స్వతంత్ర రాజకీయ నాయకుడు

1969 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు 1969 ఆగస్టు 30న జరిగాయి. గోపాల్ స్వరూప్ పాఠక్ భారతదేశానికి నాల్గవ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. [1] ప్రస్తుత అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ మరణానంతరం వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరాహగిరి వెంకటగిరి రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి.

షెడ్యూలు[మార్చు]

ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 1969జూలై31న ప్రకటించింది. [2]

స.నెం. పోల్ ఈవెంట్ తేదీ
1. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 9 ఆగస్టు 1969
2. నామినేషన్ పరిశీలన తేదీ 11 ఆగస్టు 1969
3. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 14 ఆగస్టు 1969
4. పోలింగ్ తేదీ 30 ఆగస్టు 1969
5. కౌంటింగ్ తేదీ 30 ఆగస్టు 1969

ఫలితాలు[మార్చు]

ఎలక్టోరల్ కాలేజీలో 759 మంది భారత పార్లమెంటు సభ్యులు ఉన్నారు. 6 మంది అభ్యర్థులు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాలు వెల్లడయ్యాయి. 400 ఓట్లు రావడంతో గోపాల్ స్వరూప్ పాఠక్ ఉప రాష్ట్రపతి గా ఎన్నికైనట్లు ప్రకటించారు. [2]

మూలాలు[మార్చు]

  1. Background material regarding fourteenth election to the office of the Vice-President, 2012, Election Commission of India
  2. 2.0 2.1 "Background material related to Election to the office of Vice-President of India, 2017". Election Commission of India. Retrieved 26 January 2022.