2017 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
| ||||||||||||||||||||||||||
Turnout | 98.21% | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||
|
భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు 2017 ఆగస్టు 5న జరిగాయి. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభ కార్యదర్శి షుంషేర్ కె. షెరీఫ్ ఉప రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. [1]
ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ, పదవి కాలం 2017 ఆగస్టు 10న ముగిసింది. [2] వెంకయ్య నాయుడు ఎన్నికలలో గెలిచి, 2017 ఆగస్టు 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నేపథ్యం
[మార్చు]భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
2007 నుంచి 2017 వరకు భారత ఉపరాష్ట్రపతిగా మహమ్మద్ హమీద్ అన్సారీ పనిచేశాడు. 2017లో ఆయన పోటీ చేయలేదు. ఆగస్టు 5న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల ప్రక్రియ
[మార్చు]రాజ్యసభ సభ్యులు (భారత పార్లమెంటు ఎగువ సభ) లోక్‌సభ సభ్యులు (భారత పార్లమెంటు దిగువ సభ) ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి నీ ఎన్నుకుంటారు. రాజ్యసభకు పోటీ చేయకుండా నామినేట్ అయిన సభ్యులకు కూడా ఓటు వేయడానికి అర్హులు. [3] ఉపరాష్ట్రపతి ఎన్నికలలో, రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది పార్లమెంటు సభ్యులు ఓటు వేయడానికి "ప్రత్యేక పెన్"ను ఉపయోగిస్తారు. [4]
2017 ఎన్నికల కోసం, ఎలక్టోరల్ కాలేజీ వీటిని కలిగి ఉంటుంది
అభ్యర్థులు
[మార్చు]ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థికి కనీసం 20 మంది ఓటర్ల మద్దతు అవసరం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ₹15000 ($233) సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. [5]ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తరఫున వెంకయ్యనాయుడు భారత జాతీయ కాంగ్రెస్ తరపున గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ వేశారు. వెంకయ్య నాయుడు ను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గోపాలకృష్ణ గాంధీ ని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించాయి.
ఎన్డీయే అభ్యర్థి
[మార్చు]వెంకయ్య నాయుడును నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. వెంకయ్యనాయుడు అప్పటికీ భారతదేశ సమాచార ప్రసార శాఖ మంత్రి గృహనిర్మాణ పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి గా ఉన్నాడు. వెంకయ్య నాయుడు గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు ‘ఫిట్టింగ్ క్యాండిడేట్’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. [6] ఎన్డీయే పార్టీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏఐఏడీఎంకే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వెంకయ్య నాయుడుకు తమ మద్దతును ప్రకటించాయి.
పేరు | పుట్టింది | నిర్వహించిన పదవులు | రాష్ట్రం | ప్రకటించారు | మూలం |
---|---|---|---|---|---|
నెల్లూరు |
1948 జూలై 1
|
ఆంధ్రప్రదేశ్ | 18 జూలై 2017 | [7] |
యూపీఏ అభ్యర్థి
[మార్చు]యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. గోపాలకృష్ణ గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధులైన మహాత్మా గాంధీ సి. రాజగోపాలాచారి మనవడు. గోపాలకృష్ణ గాంధీ భారతదేశానికి దౌత్యవేత్త గా పనిచేశాడు, గోపాలకృష్ణ గాంధీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల లో విద్యనభ్యసించాడు. శ్రీలంక, నార్వే దక్షిణాఫ్రికా దేశాలలో భారత రాయబారిగా పనిచేశారు. గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశాడు. [8] గోపాలకృష్ణ గాంధీకి భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు మద్దతును ప్రకటించాయి. [9]
పేరు | పుట్టింది | నిర్వహించిన పదవులు | రాష్ట్రం | ప్రకటించారు | మూలం |
---|---|---|---|---|---|
ఢిల్లీ |
1945 ఏప్రిల్ 22పశ్చిమ బెంగాల్ గవర్నర్
(2004–2009) |
ఢిల్లీ | 11 జూలై 2017 | [10] |
ఫలితాలు
[మార్చు]ఎన్నికలలో వెంకయ్యనాయుడుకు 516 ఓట్లు వచ్చాయి. గోపాల్ కృష్ణ గాంధీ కి 244 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో గెలుపొందాడు. వెంకయ్య నాయుడు 2017 ఆగస్టు 11న రాష్ట్రపతి కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశాడు. [11]
మూలాలు
[మార్చు]- ↑ "Election to the Office of the Vice-President, 2017 (15th Vice-Presidential Election)". Retrieved 2017-06-29.
- ↑ "Terms of the Houses". eci.nic.in. Election Commission of India / National Informatics Centre. Retrieved May 23, 2016.
- ↑ "How the Vice-President of India is elected: Know what it will take Venkaiah Naidu or Gopalkrishna Gandhi to win". Financial Express. Retrieved 24 July 2017.
- ↑ "Election Commission issues notification for vice president polls". New Indian Express. Archived from the original on 18 జూలై 2022. Retrieved 26 July 2017.
- ↑ "What is the procedure to elect the vice president: All you need to know". Indian Express. Retrieved 26 July 2017.
- ↑ "Vice-Presidential Election 2017: Venkaiah Naidu is NDA's nominee, to take on Opposition's Gopalkrishna Gandhi". First Post. Retrieved 5 August 2017.
- ↑ "Venkaiah Naidu files his nomination for vice-president". Times of India. Retrieved 21 July 2017.
- ↑ "Indian Presidential Election 2017: Who Is Gopalkrishna Gandhi? Vice President Candidate Known For Straight Talk". NDTV. Retrieved 5 August 2017.
- ↑ "Vice-Presidential Election LIVE updates: Counting begins, 98 per cent polling recorded". Indian Express. Retrieved 5 August 2017.
- ↑ "Eye On Nitish Kumar, Opposition Picks Gopalkrishna Gandhi For Vice-President". NDTV. Retrieved 21 July 2017.
- ↑ Venkaiah Naidu To Become 13th Vice-President of India