2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు

← 2002 2007 ఆగస్టు 10 2012 →
 
Nominee ముహమ్మద్ హమీద్ అన్సారి నజ్మా హెప్తుల్లా రషీద్ మసూద్
Party భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ సమాజ్ వాదీ పార్టీ
Alliance ఐక్య ప్రగతిశీల కూటమి జాతీయ ప్రజాస్వామ్య కూటమి
Home state పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్
Electoral vote 455 222 75
Percentage 60.50% 29.52% 9.98%

ఎన్నికలకు ముందు ఉప రాష్ట్రపతి

భైరాన్ సింగ్ షెకావత్
భారతీయ జనతా పార్టీ

Elected ఉప రాష్ట్రపతి

ముహమ్మద్ హమీద్ అన్సారి
భారత జాతీయ కాంగ్రెస్

2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 2007 భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఆగస్టు పదిన జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ హమీద్ అన్సారీ ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యాడు. [1] అప్పటి ఉప రాష్ట్రపతి, భైరాన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బదులుగా భైరాన్ సింగ్ షెకావత్ 2007 ఎన్నికలలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి, ప్రతిభా పాటిల్ చేతిలో ఓడిపోయారు.

నేపథ్యం[మార్చు]

భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు, భైరోన్ సింగ్ షెకావత్ పదవీకాలం 18 ఆగస్టు 2007 ముగిసింది. [1]

ఎలక్టోరల్ కళాశాల[మార్చు]

ఎలక్టోరల్ కాలేజీలో 245 మంది రాజ్యసభ సభ్యులు 545 మంది లోక్‌సభ సభ్యులు, మొత్తం 790 మంది ఓటర్లు ఉన్నారు.

అధికారులు[మార్చు]

రిటర్నింగ్ అధికారి : డాక్టర్ యోగేంద్ర నారాయణ్, సెక్రటరీ జనరల్, రాజ్యసభ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు : NC జోషి & రవి కాంత్ చోప్రా ను ఎన్నికల సంఘం నియమించింది.

ఫలితాలు[మార్చు]

ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ హమీద్ అన్సారీకి 455 ఓట్లు వచ్చాయి.భారతీయ జనతా పార్టీ పార్టీ అభ్యర్థి అయిన నజ్మా హెప్తుల్లా కు 222 ఓట్లు వచ్చాయి.సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అయిన రషీద్ మసూద్ కు 75 ఓట్లు వచ్చాయి. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మహమ్మద్ హామీద్ అన్సారి గెలుపొందాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 BACKGROUND MATERIAL REGARDING FOURTEENTH ELECTION TO THE OFFICE OF THE VICE-PRESIDENT, 2012, ELECTION COMMISSION OF INDIA

వెలుపలి లంకెలు[మార్చు]