50వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
12వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 20–28 నవంబరు 2019 |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | పార్టీకల్స్ |
Lifetime achievement | ఇసాబెల్లె హుపెర్ట్ |
50వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2019 నవంబరు 20 నుండి నవంబరు 28 వరకు గోవాలో జరిగింది.[1][2] రష్యాకు చెందిన ఎనిమిది రష్యన్ భాషా సినిమాలు ప్రదర్శన జరిగాయి.[3]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]
జ్యూరీ
[మార్చు]- జాన్ బెయిలీ (చైర్‌పర్సన్)[7][8]
- రాబిన్ కాంపిల్లో (ఫ్రెంచ్ స్క్రీన్ రైటర్, ఎడిటర్, సినిమా దర్శకుడు)
- ఝాంగ్ యాంగ్ (చైనా సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్)
- లిన్నె రామ్సే (స్కాటిష్ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, సినిమాటోగ్రాఫర్)
- రమేష్ సిప్పీ (భారత సినీ దర్శకుడు)
విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: బ్లేజ్ హారిసన్ దర్శకత్వం వహించిన "పార్టికల్స్" సినిమా
- ఉత్తమ దర్శకుడు: "జల్లికట్టు" సినిమా దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి
- ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: "అబౌ లీలా అండ్ మారియస్ ఓల్టేను ఫర్ మాన్స్టర్స్" సినిమా దర్శకుడు అమిన్ సిడి-బౌమాడియన్
- ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: "మారిగెల్లా" సినిమాలో నటించిన "సీయు జార్జ్"
- ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఉత్తమ నటి అవార్డు: "మై ఘాట్: క్రైమ్ నెం 103/2015" సినిమాలో నటించిన "ఉషా జాదవ్"
- జీవన సాఫల్య పురస్కారం: ఇసాబెల్లె హుపెర్ట్[9]
- ఐసిఎఫ్‌టి యునెస్కో గాంధీ పతకం: రికార్డో సాల్వెట్టి (రువాండా)
- స్పెషల్ జ్యూరీ అవార్డు: "బెలూన్" సినిమా దర్శకుడు పెమా సెడెన్
- స్పెషల్ మెన్షన్ జ్యూరీ అవార్డు: అభిషేక్ షా దర్శకత్వం వహించిన "హెలారో"
- ఐసిఎఫ్‌టి యునెస్కో గాంధీ పతకం (స్పెషల్ మెన్షన్): "బహత్తర్ హురైన్"
ప్రత్యేక అవార్డులు
[మార్చు]- ఐఎఫ్ఎష్ఐ గోల్డెన్ జూబ్లీ ఐకాన్: రజినీకాంత్[9]
అధికారిక ఎంపికలు
[మార్చు]ప్రారంభ సినిమా
[మార్చు]- డెస్పెట్ ది ఫాగ్ (ఇటలీ)[10]
ముగింపు సినిమా
[మార్చు]- మార్గే అండ్ హర్ మదర్ (ఇటలీ)[11]
మూలాలు
[మార్చు]- ↑ "IFFI 2019: Amitabh Bachchan and Rajinikanth to attend opening ceremony in Goa". India Today. Ist.
- ↑ "IFFI 2019 Announces Official Films Selection for Indian Panorama 2019". 6 October 2019. Archived from the original on 1 November 2020. Retrieved 6 July 2021.
- ↑ "With Russia as Focus Country, IFFI 2019 Looks to Revive Old Ties". News18.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 6 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 6 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 6 July 2021.
- ↑ "50th International Film Festival of India International Jury" (PDF).[permanent dead link]
- ↑ "John Bailey Ex. President Academy of Motion Pictures Arts and Sciences to head the International Jury of 50th IFFI".
- ↑ 9.0 9.1 "Rajinikanth, Isabelle Huppert to Be Honoured at IFFI 2019". 2 November 2019.
- ↑ "Italian drama 'Despite the Fog' to open 50th Indian Film Festival". Business Standard India. 7 November 2019 – via Business Standard.
- ↑ ""Marghe and Her Mother" to be the closing film at50th IFFI". 7 November 2019.