Jump to content

అల్యూమినియం సల్ఫైడ్

వికీపీడియా నుండి
(Al2S3 నుండి దారిమార్పు చెందింది)
అల్యూమినియం సల్ఫైడ్
పేర్లు
ఇతర పేర్లు
డైఅల్యూమినియం ట్రై సల్ఫైడ్ [1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1302-81-4]
పబ్ కెమ్ 16684788
SMILES [Al+3].[Al+3].[S-2].[S-2].[S-2]
ధర్మములు
Al2S3
మోలార్ ద్రవ్యరాశి 150.158 g/mol[2]
స్వరూపం gray solid
సాంద్రత 2.02 g/cm3 [3]
ద్రవీభవన స్థానం 1,100 °C (2,010 °F; 1,370 K)
బాష్పీభవన స్థానం 1,500 °C (2,730 °F; 1,770 K) sublimes[4]
decomposes
ద్రావణీయత insoluble in acetone
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
trigonal
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-724 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
116.9 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 105.1 J/mol K
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము MSDS
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం సల్ఫైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం .అల్యూమినియం, సల్ఫర్ మూలకాల సమ్మేళనం వలన అల్యూమినియం సల్ఫైడ్ ఏర్పడినది. ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం Al2S3. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం. రంగులేని ఈ సంయోగ పదార్థం పలు రూపాలలో ఏర్పడును. అల్యూమినియం సల్ఫైడ్ తేమతో చాలా సెన్సిటివ్ గా ప్రవర్తించును. తేమతో hydrolyzing /జల విశ్లేషణ వలన ఆర్ద్ర /సజల అల్యూమినియం ఆక్సైడ్/హైడ్రాక్సైడ్ గా మారును.వాతావరణంలోని తేమ ప్రభావానికికు అల్యూమినియం సల్ఫైడ్ గురైనను ఈ చర్య జరుగును.[5] అల్యూమినియం సల్ఫైడ్ వలన వాయురూపహైడ్రోజన్ సల్ఫైడ్ (H2S) ను విడుదల చేయును.

భౌతిక లక్షణాలు

[మార్చు]

అల్యూమినియం సల్ఫైడ్ గ్రే రంగులో ఉండు ఘనపదార్థం. అల్యూమినియం సల్ఫైడ్ అణుభారం 150.158 గ్రాములు/మోల్.[2] 25 °C వద్ద అల్యూమినియం సల్ఫైడ్ సాంద్రత 2.02 గ్రాములు/సెం.మీ3.[3] అల్యూమినియం సల్ఫైడ్ సంయోగపదార్థం యొక్క ద్రవీభవన స్థానం 1, 100 °C (2, 010 °F;1, 370K) .ఈ సమ్మేళనపదార్థం బాష్పీభవన స్థానం 1, 500 °C (2, 730 °F; 1, 770K).[4]ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం సల్ఫైడ్ ఉత్పతనం (sublime) చెందును.నీటిలో అల్యూమినియం సల్ఫైడ్ విఘటనం చెందును. అసిటోన్ లో స్వల్పంగా కరుగును.త్రికోణాకార స్పటిక సౌష్టవం కలిగిఉన్నది. అల్యూమినియం సల్ఫైడ్ విశిష్ణఉష్ణ సామర్ద్యం105.1 జౌల్/మోల్ K. అలాగే అల్యూమినియం సల్ఫైడ్ యొక్క ప్రామాణిక అణు ఎంట్రోపి (Se298) :116.9 జౌల్/మోల్ K

స్పటిక నిర్మాణం

[మార్చు]

ఆరు రకాలకన్న ఎక్కువ స్పటిక రూపాలను కలిగి ఉన్నప్పటికీ, దిగువ పట్టికలో నాలుగు స్పటిక రూపాల వివరాలను మాత్రమే పొందుపరచడం జరిగింది.ఈ భిన్న స్పటిక రూపాల సౌష్టవం ఎక్కువగా wurtzite నిర్మాణానికి సమానంగా లేదా పోలి ఉన్నాయి.కేవలం అల్లిక ఖాలిలలో మాత్రమే వ్యత్యాసాన్ని, అదియు ఉప అల్లిక క్రమ, అక్రమ రూపాలలో ఉండును.

రూపం సౌష్టవం Space group a (A) c (A) ρ (g/cm3)
α ష ట్కోణాకారం 6.423 17.83 2.32
β ష ట్కోణాకారం P63mc 3.579 5.829 }
γ త్రికోణాకారపు 6.47 17.26 2.36
δ త్రికోణాకారపు I41/amd 7.026 29.819 2.71

బహు స్థిరమైన α అల్యూమినియం సల్ఫైడును, కొన్ని వందల అధిక సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దకు వేడి చేసి annealing (వేడిచేసి కావలసిన ఆకారం లోకి మార్చి చల్లబరచడం) చెయ్యడం వలన Β, γ స్థితి అల్యూమినియం సల్ఫైడులను పొందెదరు.అల్యూమినియం సల్ఫైడును 2-65కిలో బార్ వత్తిడి వద్ద సంకోచింప చెయ్యడం వలన δ అల్యూమినియం సల్ఫైడును ఏర్పడును.ఈస్పటిక నిర్మాణంలో ఖాళీలు త్రికోణ నిర్మాణం కలిగిన సూపర్ అల్లికతో ఏర్పడి ఉండును.

అల్యూమినియం సల్ఫైడ్ వ్యుత్పనాల గురించి తెలియనప్పటికీ, అల్యూమినియం –సల్ఫర్-క్లోరిన్ సమ్మేళపదార్థాలగురించిన సమాచారం ఉంది.

ఉత్పత్తి

[మార్చు]

అల్యూమినియం, సల్ఫర్ మూలకాలను మండించడం (ignition) వలన అల్యూమినియం సల్ఫైడు ఏర్పడును

2Al +3S → Al2S3

అల్యూమినియం, సల్ఫర్ మూలకపదార్థాల మధ్య జరుగు రసాయన చర్య ఉష్ణవిమోచక చర్య (అనగా చర్య సమయంలో ఉష్ణం విడుదల అగును) కావడం వలన, ఈ రెండు మూలకాల మధ్య రసాయన చర్య జరుగుటకై అదనంగా వీటిని వేడి చెయ్య వలసిన అవసరం లేదు. అత్యల్ప స్వల్ప ప్రమాణంలో ఉన్నచో వేడి చెయ్యవలసి వచ్చును.చర్యా ఫలితంగా కరిగిన స్థితి (fused) లో అల్యూమినియం సల్ఫైడ్ ఏర్పడును. చర్యా సమయంలో ఉష్ణోగ్రత1100°C కన్న ఎక్కువ స్థాయికి పెరగడం వలన ఉత్పత్తియగు అల్యూమినియం సల్ఫైడ్ కరిగిన స్థితిలో ఉండును. చల్లార్చిన అల్యూమినియం సల్ఫైడ్ చాలా గట్టిగా ఉండును.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "dialuminium trisulphide". webelements.com. Retrieved 2015-10-17.
  2. 2.0 2.1 "Aluminum sulfide". chemspider.com. Retrieved 2015-10-17.
  3. 3.0 3.1 "ALUMINUM SULFIDE". chemicalbook.com. Retrieved 2015-10-17.
  4. 4.0 4.1 "Aluminum Sulfide". americanelements.com. Retrieved 2015-10-17.
  5. "Aluminium Sulfide". worldofchemicals.com. Archived from the original on 2017-11-10. Retrieved 2015-10-17.