Jump to content

అల్యూమినియం నైట్రైడ్

వికీపీడియా నుండి
(AlN నుండి దారిమార్పు చెందింది)
అల్యూమినియం నైట్రైడ్[1]
Aluminium Nitride powder
పేర్లు
ఇతర పేర్లు
Aluminium nitride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [24304-00-5]
పబ్ కెమ్ 90455
యూరోపియన్ కమిషన్ సంఖ్య 246-140-8
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:50884
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BD1055000
SMILES [Al]#N
ధర్మములు
AlN
మోలార్ ద్రవ్యరాశి 40.9882 g/mol
స్వరూపం white to pale-yellow solid
సాంద్రత 3.260 g/cm3
ద్రవీభవన స్థానం 2,200 °C (3,990 °F; 2,470 K)
బాష్పీభవన స్థానం 2,517 °C (4,563 °F; 2,790 K) decomposes
reacts (powder), insoluble (monocrystalline)
ద్రావణీయత reacts in ethanol
Band gap 6.015 eV [2] (direct)
Electron mobility ~300 cm2/(V·s)
Thermal conductivity 285 W/(m·K)
వక్రీభవన గుణకం (nD) 1.9–2.2
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Wurtzite
C6v4-P63mc
కోఆర్డినేషన్ జ్యామితి
Tetrahedral
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
318 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
20.2 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 30.1 J/mol K
ప్రమాదాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం నైట్రైడ్ ఒకరసాయన సమ్మేళనపదార్థం.ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం AlN.అల్యూమినియం, నైట్రోజన్ మూలక పరమాణు సంయోగం వలన అల్యూమినియం నైట్రైడ్ ఏర్పడినది.

భౌతిక లక్షణాలు

[మార్చు]

అల్యూమినియం నైట్రైడ్ తెల్లగా లేదా పాలిపోయిన పసుపు రంగు కల్గిన ఘనపదార్థం.అల్యూమినియం నైట్రైడ్ అణుభారం 40.9882 గ్రాములు /మోల్. 25 °C వద్ద అల్యూమినియం నైట్రైడ్ సాంద్రత 3.260 గ్రాములు /సెం.మీ3. అల్యూమినియం నైట్రైడ్ సంయోగ పదార్థం ద్రవీభవన స్థానం 2,200 °C (3,990 °F;2,470 K). అలాగే అల్యూమినియం నైట్రైడ్ బాష్పీభవన స్థానం 2,517 °C (4,563 °F;2,790K), ఈ ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును. అల్యూమినియం నైట్రైడ్ మొనోక్రిస్టల్ రూపంలో నీటిలో కరుగదు.పౌడరు/పొడి రూపంలో రియాక్ట్ అగును.ఇధనాల్ లో కరుగును.అల్యూమినియం నైట్రైడ్ ఉష్ణవాహక విలువ 285 W/ (m•K).అల్యూమినియం నైట్రైడ్ వక్రీభవన సూచిక 1.9–2.2.

స్థిరత్వం-రసాయన ధర్మాలు

[మార్చు]

అల్యూమినియం నైట్రైడ్ జడమైన వాతావరణంలో, అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరత్వం కల్గిఉండును. పీడన రహితస్థితి (vacuum) లో 1800 °C వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును.గాలిలో 700 °C ఉష్ణోగ్రతకు పైగా వేడిచేసిన ఉపరితల ఆక్సిడేసన్ జరుగును. సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద కూడా 5-10 nm మందమున్న ఉపరితల ఆక్సైడ్ పొరలు ఏర్పడుట గమనించవచ్చును.ఈ విధంగా ఏర్పడిన ఆక్సైడ్ పొర1370 °C ఉష్ణోగ్రత వరకు సంయోగపదార్థం ఆక్సీకరణ చెందకుండా నిలువరించును. 1370 °C ఉష్ణోగ్రత దాటిన బల్క్ ఆక్సిడేసన్ సంభవించును. హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ వాయుయుతపరిసరాలలో/వాతావరణంలో 980 °C వరకు అల్యూమినియం నైట్రైడ్ స్థిరంగా ఉండును. ఖనిజ ఆమ్లాలలో అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్‌బౌండరి దాడివలన నెమ్మదిగా కరుగును. బలమైన క్షారాలు అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్స్ మీదదాడి చెయ్యడం వలన కరుగును.అల్యూమినియం నైట్రైడ్ నెమ్మదిగా జలవిశ్లేషణ చెందును. క్లోరైడ్, క్రయోలైట్ లతో సహ పలు కరిగిన లవణాలక్షయికరణ దాడిని నిలువరించు స్థిరత్వం అల్యూమినియం నైట్రైడ్ కల్గిఉన్నది.

చరిత్ర

[మార్చు]

అల్యూమినియం నైట్రైడ్ ను 1877 ను మొదటిసారి ఉత్పత్తి చేసారు. అల్యూమినియం నైట్రైడ్ యొక్క అత్యధిక ఉష్ణవాహకత్వాన్ని (thermal conductivity) గుర్తించిన 1980 నుండి మాత్రమే ఎలక్ట్రికల్ ఇన్సులేటింగ్ సెరామిక్‌లో ఉపయోగించడం మొదలైనది.

ఉత్పత్తి

[మార్చు]

అల్యూమినియం ఆక్సైడ్ ను కార్బోథెర్మల్ క్షయికరణ కావించడం వలన అల్యూమినియం నైట్రైడ్ ఉత్పత్తి చెయ్యబడును.లేదా నేరుగా అల్యుమినియాన్ని నైట్రిడెసన్ చెయ్యడం వలన కూడా అల్యూమినియం ఆక్సైడ్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.

ఉపయోగాలు

[మార్చు]
  • మొబైల్ పోన్‌లలో వాడు ఆరేఫ్ ఫిల్టరు (RF filter) లలో అల్యూమినియం ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. అలాగే సర్ఫేస్ అకౌస్టిక్ వేవ్ (surface acoustic wave ) సెన్సరుల తయారీలో ఉపయోగిస్తారు.
  • ఫైజోఎలక్ట్రిక్ మైక్రోమేచిండ్ అల్ట్రాసౌండ్ ట్రాన్స్‌డ్యుసర్స్ తయారీలో ఉపయోగిస్తారు.
  • ఆప్టోఎలాక్త్రానిక్స్ లోఉపయోగిస్తారు.
  • ఆప్టికల్ స్టోరేజి మీడియాలో డై ఎలక్ట్రిక్ లేయరులుగా ఉపయోగిస్తారు.
  • సైనికపరమైన పరికరాల నిర్మాణంలో
  • ఉక్కు, సెమీకండక్టరుల తయారీలో

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "Aluminium Nitride". Accuratus. Retrieved 2014-01-01.
  2. Feneberg, M.; Leute, R. A. R.; Neuschl, B.; Thonke, K.; Bickermann, M. (2010). Phys. Rev. B. 82: 075208.{{cite journal}}: CS1 maint: untitled periodical (link)