Jump to content

అల్యూమినియం ఫాస్ఫైడ్

వికీపీడియా నుండి
అల్యూమినియం ఫాస్ఫైడ్
Aluminium phosphide
పేర్లు
ఇతర పేర్లు
Aluminum phosphide
Aluminium(III) phosphide
Aluminium monophosphide
Phostoxin
Fumitoxin
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [20859-73-8]
పబ్ కెమ్ 30332
యూరోపియన్ కమిషన్ సంఖ్య 244-088-0
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BD1400000
SMILES [Al]#P
ధర్మములు
AlP
మోలార్ ద్రవ్యరాశి 57.9552 g/mol
స్వరూపం Yellow or gray crystals
వాసన garlic-like
సాంద్రత 2.85 g/cm3
ద్రవీభవన స్థానం 2,530 °C (4,590 °F; 2,800 K)
reacts
Band gap 2.5 eV (indirect)[1]
వక్రీభవన గుణకం (nD) 2.75 (IR), ~3 (Vis) [1]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Zincblende
T2d-F43m
a = 546.35 pm
కోఆర్డినేషన్ జ్యామితి
Tetrahedral
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-164.4 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
47.3 J/mol K
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
11.5 mg/kg
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం పాస్ఫైడ్ అత్యంత విష లక్షణాలు కలిగిన ఒక అకర్బన సమ్మేళన పదార్థం.అల్యూమినియం, ఫాస్పరస్ మూలకాల పరమాణు సంయోగం వలన ఈ సంయోగపదార్థం ఏర్పడినది.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం AlP.అల్యూమినియం పాస్ఫైడ్ ను ధూమకారి/పొగలా వ్యాపించే రసాయన పదార్థం (fumigant)గా, బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టరుగా ఉపయోగిస్తారు. శుద్ధమైన అల్యూమినియం పాస్ఫైడ్ రంగులేని ఘన పదార్థం.జలవిశ్లేషణ, ఆక్సీకరణ వలన చేరిన మలినాలవలన గ్రే-పచ్చ-పసుపు రంగులో కూడాఉండును.

భౌతిక ధర్మాలు

[మార్చు]

అల్యూమినియం పాస్ఫైడ్ అత్యంత విష లక్షణాలు కలిగిన రసాయన సమ్మేళనం. శుద్ధమైన అల్యూమినియం పాస్ఫైడ్ రంగులేని ఘన పదార్థం. జలవిశ్లేషణ, ఆక్సీకరణ వలన చేరిన మలినాలవలన గ్రే-పచ్చ-పసుపు రంగులో కూడా ఉండును. అల్యూమినియం పాస్ఫైడ్ అల్యూమినియం పాస్ఫైడ్ అణుభారం 57.9552 గ్రాములు/మోల్. 25 °C వద్ద అల్యూమినియం పాస్ఫైడ్ సాంద్రత 2.85 గ్రాములు/సెం.మీ3. అల్యూమినియం పాస్ఫైడ్ ద్రవీభవన స్థానం 2,530 °C (4,590 °F;2,800 K). నీటితో చర్యాశీలం .

సౌష్టవ లక్షణాలు

[మార్చు]

అల్యూమినియం పాస్ఫైడ్ జింకుబ్లెండ్ స్పటిక సౌష్టవాన్ని కలిగి ఉంది.అల్యూమినియం పాస్ఫైడ్ యొక్క స్పటికఅణుఅల్లిక స్థిరాంకం (lattice constant) 300 K. వద్ద 5.4510 Å.అల్యూమినియం పాస్ఫైడ్ స్పటికాలు థెర్మోడైనమికల్ గా 1,000 °C (1,830 °F)వరకు స్థిరమైనవి.

రసాయన చర్యలు

[మార్చు]

అల్యూమినియం పాస్ఫైడ్ నీటితో, ఆమ్లాలతో చర్య జరిపి పాస్ఫైన్/పాస్ఫిన్ (phosphine)ను విడుదల చేయును.

AlP + 3 H2O → Al(OH)3 + PH3
AlP + 3 H+ → Al3+ + PH3

సంశ్లేషణ

[మార్చు]

అల్యూమినియం, ఫాస్పరస్మూలకాలను సంయోగ పరచి అల్యూమినియం పాస్ఫైడ్ ను ఉత్పతి చేసెదరు.

4Al + P4 → 4AlP

ఉత్పత్తి జరుపు సమయంలోఏర్పడిన క్రియాజన్యమైన (product) అల్యూమినియం పాస్ఫైడ్ ను తేమతో కలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తేమతో అల్యూమినియం పాస్ఫైడ్ రసాయన చర్య వలన విషకారక పాస్ఫైన్ వాయువును విడుదల చేయును.

ఉపయోగాలు

[మార్చు]

అల్యూమినియం ఫాస్ఫైడ్ ను కీటకనాశనిగా,ధూమకారిగా,ఎలుకజాతి జంతువులసంహారక విషంగాను,, సెమీ కండక్టరుగా పలురకాలుగా ఉపయోగిస్తారు.

కీటకనాశనిగా

[మార్చు]

అల్యూమినియం పాస్ఫైడ్ ను ఎలు జాతి జంతు సంహరణ మందుగా (rodenticide),క్రిమి,కీటక నాశనిగా,, గోదాముల్లో దీర్ఘకాలం నిలువఉంచు ధాన్యం, గింజలను పురుగు బారినుండి కాపాడు ధూమకారిగా ఉపయోగిస్తారు.అడవిఎలుకలు ( moles), కొరికి తినెడి ఎలుకలవంటి (rodents)చిన్న విషమయ క్షీరాదాలను చంపుటకు అల్యూమినియం పాస్ఫైడ్ ను ఉపయోగిస్తారు. అల్యూమినియం పాస్ఫైడ్ ను ధూమకారిగా, నోటి ద్వారా ఇచ్చుపురుగు/క్రిమినాశనిగా ఉపయోగిస్తారు. ఎలుక రకపు జంతువులను చంపు మందుగా వాటి ఆహారంలో అల్యూమినియం పాస్ఫైడ్ కలుపుతారు. ఎలుక జాతి జంతువుల కడుపులోని జీర్ణవ్యవస్థలోని ఆమ్లంతో అల్యూమినియం పాస్ఫైడ్ చర్య జరపడం వలన ఫాస్ఫైన్ విషవాయువు వేలువడం వలన ఎలుకజాతి జంతువులు మరణించును. అల్యూమినియం పాస్ఫైడ్ వంటి క్రిమి.కీటక నాశనులు జింకు ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్ లు.

క్రిమి సంహరణిగా అల్యూమినియం పాస్ఫైడ్‌ ఫ్యుమిటాక్సిన్, ఫాస్టాక్సిన్, క్విక్ ఫాస్ వంటి వివిధ బ్రాండుపేర్లతో అమ్మబడుతున్నది. ఈ క్రింద సమీకరణలో పేర్కొన్నవిధంగా ఫాస్ఫైన్ వాయువు అల్యూమినియం పాస్ఫైడ్ జలవిశ్లేషణ వలన ఏర్పడును.

2 AlP + 6 H2O → Al2O3∙3 H2O + 2 PH3

సెమీ కండక్టరుగా

[మార్చు]

అల్యూమినియం పాస్ఫైడ్ ఒక సెమీ కండక్టరు.అల్యూమినియం పాస్ఫైడ్ ఒక సెమీ కండక్టరు.దీనిని ఇతర యుగ్మపదార్థాలతో (binary materials) మిశ్రమ దాతువుగా కాంతిని ప్రసరించు డైయోడ్ ఉపకరణాలు (అల్యూమినియం గాలియం ఇండియం ఫాస్ఫిడ్) తయారు చేయుటలో ఉపయోగిస్తారు.

విషప్రభావం

[మార్చు]

విషయుక్తమైన అల్యూమినియం పాస్ఫైడ్ ను ఆత్మహత్య చేసుకొనుటకు వాడెదరు. ఒక్కోసారి పదార్థాలను ఫ్యుమిగేసన్ చేయునప్పుడు, అనుకోకుండా ఉత్పత్తి అయిన ఫాస్ఫైన్ వాయువు వలన సౌదీఅరేబియా, అమెరికాలో మరణాలు సంభవించాయి. రిసైకిల్ చేసిన అల్యూమినియం ఫాస్ఫిడ్ డబ్బాలను ఉపయోగించడం వలన స్పెయిన్ లోని Alcalá de Guadaira లో మూడు కుటుంబాలలోని వారు మరణించారు. వాళ్ళు ఈ డబ్బాలను స్నానపు గదిలోని ఒక సంచిలో ఉంచేవారు, వాటితో నీరు కలియడం వలన ఫాస్ఫైన్ వాయువు వెలువడి కొన్ని గంటల్లోనే వారు మరణించారు.

అల్యూమినియం ఫాస్ఫిడ్ విష ప్రభావం వలన కలుగు నష్టం భారత ఉపఖండంలో పెద్ద సమస్యగా పరిణమిస్తున్నది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 Berger, L. I. (1996). Semiconductor Materials. CRC Press. p. 125. ISBN 0-8493-8912-7.