అల్యూమినియం హైడ్రాక్సైడ్
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Aluminium hydroxide | |
Systematic IUPAC name
Aluminium(3+) trioxidanide | |
ఇతర పేర్లు
Aluminic acid
Aluminic hydroxide | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [21645-51-2] |
పబ్ కెమ్ | 10176082 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:33130 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | BD0940000 |
ATC code | A02 , A02AB02 (algeldrate) |
SMILES | [OH-].[OH-].[OH-].[Al+3] |
| |
ధర్మములు | |
Al(OH)3 | |
మోలార్ ద్రవ్యరాశి | 78.00 g/mol |
స్వరూపం | White amorphous powder |
సాంద్రత | 2.42 g/cm3, solid |
ద్రవీభవన స్థానం | 300 °C (572 °F; 573 K) |
0.0001 g/100 mL (20 °C) | |
Solubility product, Ksp | 3×10−34[1] |
ద్రావణీయత | soluble in acids, alkalis, HCl, H2SO4 |
ఆమ్లత్వం (pKa) | >7 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−1277 kJ·mol−1[2] |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | External MSDS |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R36 R37 R38 |
S-పదబంధాలు | S26 S36 |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు
|
Sodium oxide, aluminium oxide hydroxide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఒక రసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్రకృతిలో గిబ్బసిట్ (gibbsite) అను మూలక రూపంలో లభిస్తుంది.హైడ్రార్‌గిల్లిట్ (hydrargillite) అని కుడా పిలువబడు ఈ ఖనిజం బేరైట్ ( bayerite), దోలైట్ ( doyleite), nordstrandite అను మూడు బహురూపాలలో లభిస్తున్నది. మరింత సాన్నిత్యం ఉన్న సమ్మేళ నాలు అల్యూమినియం ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ (AlO (OH),, అల్యూమినియం ఆక్సైడ్/అల్యూమిన (Al2O3).ఇవన్నియు అల్యూమినియం ఖనిజమైన బాక్సైట్ లో లభిస్తున్నాయి.
భౌతిక ధర్మాలు
[మార్చు]అల్యూమినియం హైడ్రాక్సైడ్ తెల్లని నియత రూపములేని (amorphous పొడి.అల్యూమినియం హైడ్రాక్సైడ్ రసాయనిక సంకేతపదం Al (OH) 3. అల్యూమినియం హైడ్రాక్సైడ్ అణుభారం 78.0గ్రాము లు/ మోల్ . అల్యూమినియం హైడ్రాక్సైడ్ సాంద్రత 2.42 గ్రాములు/సెం.మీ3. అల్యూమినియం హైడ్రాక్సైడ్ సంయోగపదార్థం ద్రవీభవన స్థానం 300 °C (572 °F;573K). నీటిలో ద్రావణీయత అధమం (0.0001 గ్రా/100 మి.లీ,20 °C వద్ద). ఆమ్లాలలో, క్షారాలలో కరుగును. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇత్యాదిలలో కరుగును.
పేరువెనుక చరిత్ర
[మార్చు]గిబ్బ్సైట్ అనిపిలువబడు హైడ్రార్గిల్లెట్ ఖనిజం పేరు గ్రీకు పదాలైన హైడ్రా (నీరు),, అర్గిల్లెస్ (మన్ను) అను పదాలనుండి ఏర్పడినది. మొదట అల్యూమినియం హైడ్రాక్సైడ్ గా భావించి హైడ్రార్గిల్లెట్ అని పేరుపెట్టిన సమ్మేళన పదార్థం నిజానికి అల్యుమినియం పాస్ఫేట్.అయిన్న్పటికి గిబ్బ్సైట్ (Gibbsite), హైడ్రార్గిల్లెట్ (hydrargillite) లను అల్యూమినియం హైడ్రాక్సైడ్ సంయోగ పదార్థమనే అర్థంలో వాడుచున్నారు. గిబ్బ్సైట్ పదాన్ని అమెరికాలోను, హైడ్రార్గిల్లెట్ పదాన్ని ఐరోపా లోను ఉపయోగిస్తున్నారు.
ఇతర లక్షణాలు
[మార్చు]అల్యూమినియం హైడ్రాక్సైడ్ ద్విశ్వాభావయుత (amphoteric) సమ్మేళనపదార్థం.అనగా ఆమ్లాలలో, క్షారాలలో కూడా ద్రావణీయత కలిగి యుండు సంయోగ పదార్థం.ఆమ్లాలతో హెక్సా ఆక్వాఅల్యూమినియం ([Al (H2O) 6]3+ ) లేదా వాటి జలవిశ్లేషణ క్రియాజన్యాలను ఉత్పత్తి చేయును. అలాగే క్షారాలలో కరగడం వలన టెట్రాహైడ్రాక్సిడో అల్యుమినేట్ ను ఏర్పరచును.
బహురూపకత(Polymorphism)
[మార్చు]అల్యూమినియం హైడ్రాక్సైడ్ నాలుగు బహురూపకత (polymorph) లను కలిగిఉన్నది.అన్ని రూపాలలో ఒక అల్యుమినియం పరమాణువుతో మూడు హైడ్రాక్సైడ్ అణువులు కలిసిన భిన్న స్పటికసౌష్టవాలను కలిగిఉన్నది. వాటి సౌష్టవ భిన్నత కారణంగా వాటి సమ్మేళనలక్షణాలుభిన్నంగా ఉండును.ఆనాలుగు బహురూపకాలు:[3]
- గిబ్బ్సైట్ (Gibbsite)
- బేయ్రైట్ (Bayerite)
- నార్డ్ స్త్రాన్డైట్ (Nordstrandite)
- డోలైట్ (Doyleite)
ఉత్పత్తి
[మార్చు]వాణిజ్యపరంగా అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను బేయర్ ప్రక్రియ విధానంలో ఉత్పత్తి చెయ్యుదురు[4] .ఈ ఉత్పత్తి విధానంలో బాక్సైట్ ను 270 °C (518 °F) వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కరిగించెదరు.ద్రావణంలో కరుగాకుండా మిగిన ఎర్రని మడ్డి (red mud) ని తొలగించి, మిగిన ద్రావణం నుండి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను అవక్షేపించి వేరు చేసెదరు. ఇలా ఏర్పడిన అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను వేడి చేసినచో అల్యూమిన (అల్యూమినియంఆక్సైడ్) ఏర్పడును.
పై ప్రక్రియ పద్ధతిలో శేషంగా మిగులు ఎర్రమడ్డి పరిసరాలకు విషతుల్యం. అందువలన ఈ ఎర్రమడ్డిని భారీ ప్రమాణంలో కృత్రిమ సరస్సులలో నిలువ ఉంచెదరు. 2010లో హంగేరిలో అజ్కఅల్యూమిన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించగా, 122మంది గాయాలపాలైనారు. ఎర్రమడ్డిని నిల్వ ఉంచిన డ్యాం బ్రద్దలు అవ్వడం వలన సమీపంలోని మైదానాలు, నీటి వనరులు కలుషిత మైనవి.[5] .
ఉపయోగాలు
[మార్చు]సంవత్సారానికి సుమారుగా 100 మిలియను టన్నుల అల్యూమినియ హైడ్రాక్సైడ్ ఉత్పత్తి అవుచున్నదని అంచానా.అందులో 90% వరకు, అల్యూమినియం లోహాన్ని ఉత్పత్తికి వాడు అల్యూమినియమ ఆక్సైడ్ ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తున్నారు.
అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను ఇంకా ఇతర అల్యూమినియం సంయోగ పదార్థాలను తయారుచెయ్యడంలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.ప్రత్యేకంగా కాల్చిన అల్యూమిన.అల్యూమినియం సల్ఫేట్, పాలిఅల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, జియోలైట్, సోడియం అల్యుమినేట్, చర్యాశీలత (activated) అల్యూమిన,, అల్యూమినియం నైట్రేట్ వంటి సంయోగ పదార్థాల ఉత్పత్తి ప్రక్రియలలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు.
అగ్ని వ్యాపకా నిరోధిని/ విలంబిని
[మార్చు]అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను పాలిమర్ అప్లికేసన్స్ లో అగ్ని నిరోధక పూరకంగా (fire retardant filler) హున్టైట్, హైడ్రోమాగ్నసైట్ మిశ్రమాలతో కలిపి వినియుగిస్తారు.[6][7][8][9][10] అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను అగ్ని నిరోధకముగా ఉపయోగించడం తోపాటు ధుమాన్నితగ్గించు/అణచు సాధకం (smoke suppressant) గా పలురకాల పాలిమరులలో ఉపయోగిస్తారు.ఉదాహరణకు పాలిఈస్టరులు, అక్రీలిక్స్, ఇథైలిన్ వినైల్ అసిటేట్, ఎపోక్సిస్,, పి.వి.సి రబ్బరు తయారీలో ఉపయోగిస్తారు.
ఔషధ తయారీలో
[మార్చు]అల్జేల్ డ్రేట్ (algeldrate) అనబడు సాధారణ/జనరిక్ పేరుతో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను అంటాసిడ్ ( antacid) గా ఉపయోగిస్యున్నారు. ఇది కడుపు/పొట్టలోని అధిక ఆసిడ్ తో చర్యజరిపి కడుపులోని ఆమ్ల చర్యను మందగింప చేస్తుంది. దీని వాడకం వలన కడుపులో పుళ్ళు (ulcers) ఏర్పడం, గుండె/ఛాతిమండటం, అజీర్ణవ్యాధి (dyspepsia) వంటి లక్షణాలనుండి ఉపశమనం కల్గును.అయితే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను ఏంటాసిడ్ గా వాడటం వలన మలబద్ధకం వచ్చును, అందువలనవిరేచనకారియైన ప్రభావాన్ని (laxative effects) కల్గించుటకు, దీనితోపాటు మాగ్నిషియం హైడ్రాక్సైడ్ లేదా మాగ్నిషియం కార్బోనేటును కూడా ఉపయోగిస్తారు. మూత్రపిండాల సమస్య కలిగినరోగులలో రక్తంలోని పాస్పేట్ స్థాయిని నియంత్రణలో ఉంచుటకు అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు.
కొన్ని రకాల వాక్సిన్ లలో (ఉదా:అంత్రాక్స్ వాక్సీన్) అవక్షేపిత అల్యూమినియం హైడ్రాక్సైడ్ నుసహాయకౌషధం (adjuvant) గా ఉపయోగిస్తారు.అల్యూమినియం హైడ్రాక్సైడ్ సహాయకౌషధం యొక్క బాగా పేరున్న బ్రాండ్ పేరు ఆల్ హైడ్రోజెల్ (Alhydrogel).ఈ మందు ప్రోటీన్ లను బాగా శోషించుకోనును.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-15. Retrieved 2015-10-20.
- ↑ Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. ISBN 0-618-94690-X.
- ↑ Karamalidis, AK; Dzombak DA (2010). Surface Complexation Modeling: Gibbsite. John Wiley & Sons. pp. 15–17. ISBN 0-470-58768-7.
- ↑ Hind, AR; Bhargava SK; Grocott SC (1999). "The Surface Chemistry of Bayer Process Solids: A Review". Colloids Surf Physiochem Eng Aspects. 146: 359–74.
- ↑ "Hungary Battles to Stem Torrent of Toxic Sludge". BBC News Website. 5 October 2010.
- ↑ Hollingbery, LA; Hull TR (2010). "The Fire Retardant Behaviour of Huntite and Hydromagnesite - A Review". Polymer Degradation and Stability. 95: 2213–2225. doi:10.1016/j.polymdegradstab.2010.08.019.
- ↑ Hollingbery, LA; Hull TR (2010). "The Thermal Decomposition of Huntite and Hydromagnesite - A Review". Thermochimica Acta. 509: 1–11. doi:10.1016/j.tca.2010.06.012.
- ↑ Hollingbery, LA; Hull TR (2012). "The Fire Retardant Effects of Huntite in Natural Mixtures with Hydromagnesite". Polymer Degradation and Stability. 97: 504–512. doi:10.1016/j.polymdegradstab.2012.01.024.
- ↑ Hollingbery, LA; Hull TR (2012). "The Thermal Decomposition of Natural Mixtures of Huntite and Hydromagnesite". Thermochimica Acta. 528: 45–52. doi:10.1016/j.tca.2011.11.002.
- ↑ Hull, TR; Witkowski A; Hollingbery LA (2011). "Fire Retardant Action of Mineral Fillers". Polymer Degradation and Stability. 96: 1462–1469. doi:10.1016/j.polymdegradstab.2011.05.006.