Jump to content

చర్చ:భారతదేశపు పట్టణ పరిపాలన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వికీశైలి సవరింపులు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

వాడుకరి:Pavan_santhosh.s గారు వికీశైలి గురించి హెచ్చరిక చేర్చారు. వారికి నా ధన్యవాదాలు. నాకున్న జ్ఞానం ప్రకారం అవసరంలేని చోట్ల 'మరియు' తీసివేశాను. శైలినిపుణులు ఒక సారి పరిశీలించి మెరుగు పరచమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 23:01, 1 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 00:35, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో వికీ శైలి ప్రకారం కొన్ని సవరణలు చేసాను.ఇంకా ఎవరైనా పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 05:02, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, మీ సవరణలకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:10, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందులో శైలి సవరణలు చేసినంతమాత్రాన అర్జున గారు పైన పేర్కొన్నట్లు నన్ను శైలినిపుణులుగా పరిగణించరాదని మనవి. యర్రా రామారావు (చర్చ) 07:26, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, శైలి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు అనే అర్ధంలోనే శైలి నిపుణులు అని పదం వాడాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:43, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
{{సహాయం చేయబడింది}} చేర్చాను. --అర్జున (చర్చ) 22:43, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మున్సిపల్ విధులు పట్టిక గురించి

[మార్చు]
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

మున్సిపల్ విధులు పట్టిక లోని అంశాలు సందిగ్ధంగా ఉన్నాయి. వ్యాసంలో "రాజ్యాంగం పన్నెండవ షెడ్యూలు (ఆర్టికల్ 243 w) లో పద్దెనిమిది విధులను నిర్దేశించింది." అని రాసారు. దానికి ఇచ్చిన మూలం కూడా అదే చెబుతోంది. కానీ పట్టికలో మాత్రం 25 పైచిలుకు విధులను చూపించారు. కానీ అక్కడ చూపించిన మూలానికి అంతర్జాలపు లింకు లేనందున అందులో ఏముందో తెలుసుకునే వీలు లేదు. నేను భారత ప్రభుత్వ వెబ్‌సైటులో చూస్తే అక్కడ కూడా 18 విధులే కనిపించాయి.

దీన్ని బట్టి ఈ పట్టికను మార్చాలా లేక ఆ పట్టికను బలపరచే వేరే మూలమేమైనా ఉందా అనేది పరిశీలించాలి. అర్జున గారూ వ్యాసంలో సింహభాగాన్ని రాసినది మీరే కాబట్టి, ఈ పట్టికను కూడా మీరే చేర్చారు కాబట్టి మీరైతే దీన్ని సరిగ్గా పరిష్కరించగలరని అనుకుంటున్నాను. మీ వీలును బట్టి పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 15:50, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvariగారు, నేను ఈ వ్యాసాన్ని ఆంగ్లవికీనుండి అనువదించాను, స్వంతంగా రాయలేదు. మరల చదివితే ఈ పట్టికలోని నిధులు పట్టణ స్థానిక సంస్థల నిపుణుడు మోహంతీ 1995 లో అధ్యయనం తరువాత సూచించినవిగా అర్ధమవుతుంది. ఆ మేరకు స్పష్టత మెరుగుపరచాను. ఈ వ్యాసం తెలుగు వికీ వాడుకరలకు మరింత ఉపయోగపడేటట్లు చేయాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పట్టణ స్థానిక సంస్థల చట్టాల అధ్యయనం ప్రకారం పట్టిక మెరుగు చేయటం మరింత ఉపయోగకరం. అర్జున (చర్చ) 04:00, 14 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]