అక్షాంశ రేఖాంశాలు: 22°00′N 38°00′E / 22.000°N 38.000°E / 22.000; 38.000

ఎర్ర సముద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్ర సముద్రం
అక్షాంశ,రేఖాంశాలు22°00′N 38°00′E / 22.000°N 38.000°E / 22.000; 38.000

ఎర్ర సముద్రం ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్యన ఉంది. ఇందులోకి హిందూ మహా సముద్రం యొక్క నీరు వచ్చి చేరుతుంది.
దీని విస్తీర్ణం దాదాపు 438,000 కి.మీ.². ఇది 2250 కి.మీ. పొడవు, 355 కి.మీ. వెడల్పు ఉంది. దీని గరిష్ఠ లోతు 2211 మీటర్లు.

గ్రీకు దేశానికి చెందిన హిప్పాలస్ అనే నావికుడు ఎర్ర సముద్రం నుంచి భారత దేశానికి సముద్ర మార్గం కనిపెట్టాడు.
ఆగస్టస్ రోమన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో ఎర్ర సముద్రం ద్వారా భారతదేశంతో వ్యాపారం జరిగేది (ఆ సమయంలో ఈజిప్టు, మధ్యధరా సముద్రం మొదలగు ప్రాంతాలు రోమన్ల ఆధీనంలో ఉండేవి). భారత దేశ ఓడరేవుల నంచి చైనా ఉత్పత్తులు ఎర్ర సముద్రం ద్వారా రోమన్లకు చేరేవి.

ఎర్ర సముద్రంలో చేప.


ఎర్ర సముద్రం ఎన్నో భిన్న మత్స్య జాతులకు నిలయం.
1200 జాతుల చేపలు ఇందులో లభిస్తాయి. వీటిలో 10% శాతం ప్రపంచంలో మరే ఇతర చోట లభించవు.

ఎర్ర సముద్రం మీద ఇసుక తుఫాను.


లవణీయత (ఉప్పదనం) విషయంలో ఎర్ర సముద్రం ప్రపంచ సగటు (4%) కన్నా ఎక్కువ. దీనికి ముఖ్య కారణాలు:

  1. నీరు త్వరగా ఆవిరి అవడం.
  2. ఎర్ర సముద్రంలోకి నదీ ప్రవాహాలు లేకపోవడం
  3. హిందూ మహా సముద్రంలోకి నీరు ప్రవహించే మార్గం సరిగా లేకపోవడం.


సరిహద్దు దేశాలు

తూర్ప తీరం
సౌదీ అరేబియా
యెమెన్
ఉత్తర తీరం
ఈజిప్టు
ఇస్రాయెల్
జోర్డాన్
దక్షిణ తీరం
డ్జిబౌటి
ఎరిట్రియా
సోమాలియా
పడమర తీరం
ఈజిప్టు
ఎరిట్రియా
సూడాన్

ఆగ్నేయ మధ్యధరా సముద్రం మీదుగా, ఎర్ర సముద్రం తీరప్రాంతంలో ఉన్న ఈ వీడియోను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఎక్స్‌పెడిషన్ 29 సిబ్బంది తీశారు.

మూలాలు

[మార్చు]