హిందూ మహాసముద్రం
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
హిందూ మహాసముద్రం ప్రపంచంలోకెల్లా మూడో అతి పెద్ద మహాసముద్రం. భూమి ఉపరితలంపై ఉన్న మొత్తం నీటిలో దాదాపు 20 శాతం హిందూ మహాసముద్రంలోనే ఉంది.[1] దీనికి ఉత్తరాన భారత ఉపఖండం, పశ్చిమాన తూర్పు ఆఫ్రికా, తూర్పున ఇండొనేసియా, సుండా ద్వీపాలు, ఆస్ట్రేలియా, దక్షిణాన దక్షిణ మహాసముద్రం (లేదా, నిర్వచనాన్ని బట్టి అంటార్కిటికా) ఉన్నాయి. భారతదేశం పేరు మీదుగా దీనికి హిందూ మహాసముద్రమనే పేరు వచ్చింది.[2][3][4][5] హిందూ మహాసముద్రాన్ని ప్రాచీన సంస్కృత సాహిత్యంలో రత్నాకర మని పిలిచారు. రత్నాకరమంటే వజ్రాలగని అని అర్థం. భారతీయ భాషల్లో దీన్ని హిందూ మహాసాగరం అని కూడా అన్నారు.
విషయ సూచిక
భౌగోళిక స్థితి[మార్చు]
పరస్పరం కలిసి ఉన్న అఖండ జలరాశిలో భాగమైన హిందూ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం నుంచి 20 డిగ్రీల తూర్పు పక్కగా మధ్యదరా దిశగా; కేప్ అగులాస్కు దక్షిణంగా; పసిఫిక్ నుంచి మధ్యదరా దిశగా 146 డిగ్రీల 55’ తూర్పుగా ఉంటుంది.[6] హిందూ మహాసముద్రపు అత్యంత ఉత్తర భాగం పర్షియన్ గల్ఫ్ కు 30 డిగ్రీలు ఉత్తరాన ఉంటుంది. హిందూ మహాసముద్రం రూపం అసౌష్టవంగా ఉన్న వృత్తంలా ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] ఇది దక్షిణాది అగ్రభాగాలైన ఆస్ర్టేలియా, ఆఫ్రికాల వద్ద దాదాపు 10 వేల కిలోమీటర్ల (6,200 మైళ్ల) వెడల్పుంటుంది. ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ను కూడా కలిపితే దీని వైశాల్యం దాదాపుగా 73,556,000 చదరపు కిలోమీటర్లు (28,350,000 మైళ్లు).[7]
ఇక హిందూ మహా సముద్రం పరిమాణం 292,131,000 క్యూబిక్ కిలోమీటర్లు (70,086,000 మైళ్లు) గా అంచనా వేశారు.[8] ఇందులో చిన్న చిన్న ద్వీపాలు ఖండాంతర రిమ్ లు చుక్కల్లా కన్పిస్తుంటాయి. హిందూ మహాసముద్రం పరిధిలోని ద్వీప దేశాల్లో మడగాస్కర్ ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ద్వీపదేశం. రీయూనియన్ ద్వీపం, కొమొరోస్, సీషెల్స్, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక ఇతర ద్వీపాలు. ఇండొనేసియా సరిహద్దుల్లోని ఆర్చిపెలాగో ఈ మహాసముద్రానికి తూర్పున ఉంటుంది.
ఆఫ్రికా, హిందూ, అంటార్కిటిక్ క్రస్టల్ పలకలు రోడ్రిగ్జ్ ట్రిపుల్ పాయింట్ వద్ద హిందూ మహాసముద్రంలో కలుస్తాయి. వీటి కలయికల ఫలితంగా మహాసముద్ర మధ్య రిడ్జ్ తిరగేసిన వై ఆకారంలో ఏర్పడింది. దీనికి కాండం భాగం దక్షిణం నుంచి భారతదేశంలోని ముంబై సమీపంలో ఉన్న ఖండాంతర పలక దాకా చొచ్చుకొచ్చి కన్పిస్తుంది. ఇక ఇదే విధంగా ఏర్పడ్డ తూర్పు, పశ్చిమ, దక్షిణ బేసిన్లు కూడా రిడ్జిల ద్వారా చిన్న చిన్న బేసిన్లుగా విభజితమై ఉన్నాయి.
హిందూ మహాసముద్రపు ఖండాంతర పలకలు ఇరుకుగా ఉంటాయి. వీటి సగటు వెడల్పు 200 కిలోమీటర్లు (125 మైళ్లు). ఆస్ట్రేలియా పశ్చిమ తీరం మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక్కడి పలక ఏకంగా 1,000 కిలోమీటర్ల (600 మైళ్ల) వెడల్పుంటుంది. హిందూ మహాసముద్రం సగటు లోతు. 3,890 m (12,762 ft) మహాసముద్రంలోకెల్లా అత్యంత లోతైన ప్రాంతం దియమంతినా అఖాతం 8,047 m (26,401 ft) సమీపంలోని దియమంతినా డీప్. ఇక్కడ లోతుంటుంది. దీన్ని కొన్నిసార్లు సుండా ట్రెంచ్ అని కూడా అంటారు. 7,258–7,725 m (23,812–25,344 ft) ఇక్కడ లోతుంటుంది.[9] దక్షిణ అక్షాంశానికి ఉత్తరాన 50 డిగ్రీల కోణంలో ప్రధాన బేసిన్ లో 86 శాతం సముద్ర అవక్షేపంతో కప్పబడి ఉంటుంది. ఇందులో సగానికి పైగా గ్లోబిజెర్నియా ఊటే ఉంటుంది. ఇక మిగతా 14 శాతం టెరిజెనస్ అవక్షేపాలుంటాయి. ఇక హిమానీ ప్రవాహాలు అత్యంత దక్షిణాది అక్షాంశ ప్రాంతాలపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంటాయి.
బాబ్ ఎల్ మందెబ్, హార్మూజ్ జలసంధి, లొంబాక్ జలసంధి, మలక్కా జలసంధి, పాల్క్ జలసంధి హిందూ మహాసముద్రంలోని ప్రధాన ఇరుకు ప్రదేశాలు. గల్ఫ్ ఆఫ్ ఈడెన్, అండమాన్ సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, గ్రేట్ ఆస్ర్టేలియన్ బైట్, లక్కాడివ్ సముద్రం, మన్నార్ సింధు శాఖ, మొజాంబిక్ చానల్, ఒమన్ సింధు శాఖ, పర్షియన్ సింధు శాఖ, ఎర్ర సముద్రం, ఇతర ఉప ప్రవాహపు జలరాశులు హిందూ మహాసముద్రంలో కన్పించే సముద్రాలు. సూయజ్ కాల్వ ద్వారా మధ్యదరా సముద్రంతో హిందూ మహాసముద్రాన్ని కృత్రిమంగా కలిపారు. ఇందుకు ఎర్ర సముద్ర
వాతావరణం[మార్చు]
భూమధ్య రేఖ నుంచి ఉత్తరం దిశగా వాతావరణం రుతుపవన వాతావరణంచే ప్రభావితమవుతుంది. బలమైన ఈశాన్య గాలులు అక్టోబరు నుంచి ఏప్రిల్ దాకా వీస్తుంటాయి. మే నుంచి అక్టోబరు దాకా దక్షిణ, పశ్చిమ గాలులుంటాయి. అరేబియా సముద్రంలో భయంకరమైన రుతుపవనాలు భారత ఉపఖండంలో వర్షపాతానికి కారణమవుతాయి. దక్షిణార్ధగోళంలో గాలులు సాధారణంగా మృదువుగానే ఉంటాయి. కానీ మారిషస్ సమీపంలోని వేసవి వడగాలులు మాత్రం తీవ్రంగా ఉంటాయి. రుతుపవన గాలులు మారుతున్నప్పుడు కొన్నిసార్లు తుపాన్లు కూడా అరేబియా సముద్రం, బంగాళాఖాతాల తీరాలపై వచ్చి పడతాయి. హిందూ మహాసముద్రం ప్రపంచంలోకెల్లా అత్యంత వెచ్చగా ఉండే మహాసముద్రం.
జలవాతావరణశాస్త్రం[మార్చు]
జంబేజీ, షత్ అల్ అరబ్, సింధూ, గంగ, బ్రహ్మపుత్ర, జుబ్బా, అయేయర్వాడీ వంటివి హిందూ మహాసముద్రంలోకి ప్రవహించే ప్రధాన నదులు. ఇక హిందూ మహాసముద్ర పవనాలు ప్రధానంగా రుతుపవనాల నియంత్రణలో ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో సవ్యదిశలో వీచే, భూమధ్య రేఖకు దక్షిణాన అపసవ్య దిశలో కదిలే రెండు బలమైన, విస్తారమైన వృత్తాకార ప్రవాహాలు హిందూ మహాసముద్ర పవన రీతిని ప్రధానంగా నిర్దేశిస్తుంటాయి. శీతాకాల రుతుపవణాల సమయంలో మాత్రం ఉత్తరాది పవనాలు వ్యతిరేకమవుతూ కూడా ఉంటాయి.
ఇక జలాంతర్భాగ ప్రవాహాలు ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్రం, ఎర్ర సముద్రం, అట్లాంటిక్ ప్రవాహాల ద్వారా నియంత్రించబడతాయి. దక్షిణ అక్షాంశానికి 20 డిగ్రీలు ఉత్తరాల కనీస ఉపరితర ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ (72 డిగ్రీల ఫారన్హీట్) ఉంటుంది. తూర్పున 28 డిగ్రీల సెంటీగ్రేడ్ (82 డిగ్రీల ఫారన్ హీట్) ను దాటేస్తుంది. 40 డిగ్రీల అక్షాంశానికి దక్షిణాదిన ఉష్ణోగ్రతలు అతి త్వరగా పడిపోతాయి.
ఉపరితర జలంలో లవణీయత ప్రతి 1,000కి 32 నుంచి 37 ఉంటుంది. అరేబియా సముద్రంలో దక్షిణ ఆఫ్రికా, నైరుతీ ఆస్ర్టేలియాల మధ్య అత్యధికంగా నమోదవుతుంది. దక్షిణ అక్షాంశానికి దాదాపుగా 65 డిగ్రీల దక్షిణ దిశగా ఏడాది పొడవునా మంచు, ఐస్ బర్గ్ లు కన్పిస్తాయి. ఐస్ బర్గ్ ల సగటు పరిధి దక్షిణ అక్షాంశానికి 45 డిగ్రీలు.
ఉప ఉపరితర లక్షణాలు[మార్చు]
ప్రధాన మహాసముద్రాల్లో హిందూ మహాసముద్రమే వయసులో అతి చిన్నది.[10] కాబట్టి ప్రపంచవ్యాప్త మహాసముద్ర మధ్య పలకల వ్యవస్థలో భాగమైన పలు చురుకైన రిడ్జ్ లను వ్యాప్తి చేస్తూ ఉంటుంది.
- కార్ల్స్ బర్గ్ రిడ్జ్
- నైరుతీ హిందూ రిడ్జ్
- ఆగ్నేయ హిందూ రిడ్జ్
- మధ్య హిందూ రిడ్జ్
నైంటీ తూర్పు రిడ్జ్ మధ్యదరా 90 డిగ్రీ ఈ వద్ద ఉత్తర-దక్షిణాలుగా ఉంటుంది. హిందూ మహాసముద్రాన్ని ఇది తూర్పు, పశ్చిమ భాగాలుగా విడదీస్తుంది. సముద్రాంతర్భాగంలోని మరో పర్వత పంక్తి మాల్దీవుల్లోని అటోల్స్ ఆర్చిపెలాగోలోని చాగోస్ ల మధ్య సుమారుగా ఉత్తర-దక్షిణాలుగా ఉంటుంది.
కెర్గుయెలెన్ పీఠభూమి కూడా చిన్న మునిగిన ఖండం. లేదంటే అగ్నిపర్వత జన్మస్థానం. ఇది హిందూ మహాసముద్రపు దక్షిణ భాగంలో ఉంది.
ఇక 2,000 కిలోమీటర్ల పొడవైన సముద్రాంతర్భాగ పీఠభూమి అయిన మస్కరేన్ పీఠభూమి మడగాస్కర్కు తూర్పుగా ఉంది.
సముద్ర జీవరాశులు[మార్చు]
హిందూ మహాసముద్రంలోని వెచ్చదనం ఫైటోప్లాంక్టన్ ఉత్పత్తిని ఉత్తరాది ప్రాంతం, మరికొన్ని ఇతరత్రా చిన్న ప్రాంతాల్లో మినహా తక్కువ స్థాయికే పరిమితం చేస్తుంది. అందుకే ఈ మహాసముద్రంలో జీవం పరిమిత స్థాయిలోనే ఉంటుంది. చేపల వేట కూడా కొంత వరకే పరిమితంగా ఉంది. ఎందుకంటే తీర దేశాల దేశీయ అవసరాలు, ఎగుమతుల్లో ఈ చేపలది కీలక పాత్రగా మారుతోంది. రష్యా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల నుంచి వచ్చే చేపల వేట నౌకలు కూడా హిందూ మహాసముద్రంలోని మత్స్య సంపదను కొల్లగొడుతుంటాయి. ముఖ్యంగా ష్రింప్ మరియు టూనాలను.
డూగాంగ్, సీల్స్, తాబేళ్లు, తిమింగళాల వంటివి ఈ మహాసముద్రంలో అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జీవులు.
అరేబియా సముద్రం, పర్షియా సింధు శాఖ, ఎర్ర సముద్రాలకు చమురు, నౌకా కాలుష్యం సమస్యగా మారింది.
చరిత్ర[మార్చు]
ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన నాగరికతలైన మెసొపొటేమియా (సుమేరు నాగరికతతో మొదలుకొని), ప్రాచీన ఈజిప్టు, భారత ఉపఖండం (సింధూ నదీలోయ నాగరికతతో మొదలుకొని) వంటివాటికి ఆవాసంగా హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలు పేరొందాయి. ఇవన్నీ వరుసక్రమంలో టైగ్రిస్-యూఫ్రటిస్, నైలు, సింధూ నదుల తీరాల్లో విలసిల్లాయి. ఆ త్వరలోనే పర్షియా (ఈలంతో మొదలుకొని), తర్వాత ఆగ్నేయ ఆసియా (ఫూనాన్ తో మొదలుకొని) ల్లో కూడా నాగరికతలు బయల్దేరాయి.
ఈజిప్టు తొలి రాజవంశపు ( క్రీస్తుపూర్వం 3,000) పాలనాకాలంలో హిందూ మహాసముద్ర జలాల గుండా నావికులు నేటి సోమాలియాలోని భూభాగంగా భావించే పంట్ ప్రాంతానికి వెళ్లేవారు. తిరుగు ప్రయాణంలో వారు నౌకల నిండా బంగారం, మిర్రాలతో వచ్చేవారు. మెసపుటోమియా, సింధూ నదీలోయ నాగరికతల మధ్య అతి ప్రాచీన వర్తక, వాణిజ్యాలు ( క్రీస్తుపూర్వం 2,500) హిందూ మహాసముద్రం గుండానే సాగాయి. క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్ది చివరి నాళ్లలో బహుశా ఫోనీషియన్లు ఈ ప్రాంతంలో ప్రవేశించి ఉంటారు. కానీ తత్ఫలితంగా ఆవాసాలు మాత్రం ఏర్పడలేదు.
హిందూ మహాసముద్రం మిగతా మహాసముద్రాలతో పోలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలతో పోలిస్తే దీని గుండా వర్తకం చాలా ముందుగానే మొదలైంది. శక్తివంతమంతమైన రుతుపవనాల కారణంగా నౌకలు కూడా సీజన్లలో పశ్చిమానికి వేగవంతంగా సాగేవి. కొద్ది నెలల పాటు వేచి చూస్తే తిరిగి సులభంగా తూర్పుకు సాగేవి. దీంతో ఇండొనేసియా వాసులు హిందూ మహాసముద్రాన్ని దాటుకుని, మడగాస్కర్ లో స్థిరపడ్డారు.
క్రీస్తుపూర్వం రెండో, లేదా ఒకటో శతాబ్దంలో సిజియస్ కు చెందిన ఎక్సోడస్ హిందూ మహాసముద్రాన్ని దాటి తొలి గ్రీకుగా పేరొందాడు. తర్వాత దాదాపుగా ఈ సమయంలోనే అరేబియా గుండా భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని హిప్పాలస్ కనిపెట్టినట్టు చెబుతారు. క్రీస్తుశకం ఒకటో, రెండో శతాబ్దాల్లో రోమన్ సామ్రాజ్యం; దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన చోళ, చేర, పాండ్య రాజ్యాల మధ్య విస్తృత స్థాయిలో వర్తక, వాణిజ్య సంబంధాలు సాగాయి. అలాగే పైన ఇండొనేసియావాసులు చేసినట్టే పాశ్చాత్య నావికులు కూడా మహాసముద్రాన్ని దాటేందుకు రుతుపవన కాలాన్ని వినియోగించుకునేవారు. పెరిప్లిస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ గ్రంథం రాసిన అనామక నావికుడు క్రీస్తుశకం 70, ఆ ప్రాంతాల్లో ఆఫ్రియా, భారతదేశ తీరాల గుండా వర్తకం జరిగే మార్గాన్ని, నౌకాశ్రయాలను, వర్తకం జరిగే సరుకులు తదితరాలను వర్ణించాడు.
మింగ్ సామ్రాజ్యానికి చెందిన అడ్మిరల్ జెంగ్ హీ 1,405, 1,433 మధ్య తన విస్తారమైన నౌకా బలాన్ని పశ్చిమ మహాసముద్రం (హిందూ మహాసముద్రానికి చైనా పేరు) గుండా నడిపి, తీర దేశమైన తూర్పు ఆఫ్రికాకు (రిఫరెన్సు కోసం జెంగ్ హీ చూడండి) చేరుకున్నాడు.
1497 లో పోర్చుగీసు నావికుడు వాస్కోడాగామా కూప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి భారత్‌కు, తర్వాత ఇతర తూర్పు దేశాలకు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఐరోపా నావికునిగా చరిత్ర సృష్టించాడు. భారీ ఫిరంగులతో కూడిన ఐరోపా నౌకలు అతి త్వరగా వర్తకంపై ఆధిపత్యం సాధించాయి. పోర్చుగల్ తన ఆధిపత్యాన్ని తిరిగి సాధించేందుకు బాగానే ప్రయత్నించింది. ముఖ్యమైన జలసంధులు, నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకుంది. ఆఫ్రికా, భారతదేశాల తీరాల్లో 17వ శతాబ్దం దాకా వర్తకాన్ని, నవకల్పలను వారే శాసించారు. తర్వాత ఇతర ఐరోపా శక్తులు పోర్చుగీసు వారికి సవాలు విసరడం మొదలైంది. డచ్ ఈస్టిండియా కంపెనీ (1602-1798) హిందూ మహాసముద్రానికి తూర్పున వర్తకం మొత్తాన్నీ అదుపు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఫ్రాన్స్, బ్రిటిష్ వారు కూడా ఈ ప్రాంతంలో వర్తక కంపెనీలు మొదలు పెట్టారు. స్పెయిన్ కూడా ఫిలిప్పీన్స్‌లోనూ, పసిఫిక్ మహాసముద్రం వెంబడి ప్రధాన వర్తక కేంద్రాలను స్థాపించుకుంది. 1815 కల్లా హిందూ మహాసముద్రంలో బ్రిటన్ తిరుగులేని శక్తిగా అవతరించింది.
1869లో సూయజ్ కాలువను తెరవడం తూర్పు దేశాలపై బ్రిటిష్, ఐరోపావారి ఆసక్తిని తట్టిలేపింది. కానీ వర్తక ఆధిపత్య స్థాపనలో ఏ దేశమూ పూర్తిగా విజయవంతం కాలేకపోయింది. అంతలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాని ఫలితంగా బ్రిటన్‌కు ఈ ప్రాంతం నుంచి వైదొలగక తప్పలేదు. అనంతరం ఈ ప్రాంతమంతటినీ భారతదేశం, యూఎస్‌ఎస్‌ఆర్, అమెరికా అదుపు చేయసాగాయి. యూఎస్‌ఎస్‌ఆర్, అమెరికా[ఉల్లేఖన అవసరం]ఇక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాయి. అందుకోసం ఇక్కడ నావికా దళ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ హిందూ మహాసముద్ర తీరంలోని వర్ధమాన దేశాలు మాత్రం తమ తీర ప్రాంతాలను శాంతి జోన్‌గా[ఉల్లేఖన అవసరం] మార్చేశాయి. తద్వారా తమ నౌకలకు అక్కడ స్వేచ్ఛాయుత ప్రయాణాలు వీలయేలా చూసుకున్నాయి. కానీ ఇప్పటికీ హిందూ మహాసముద్ర మద్యంలోని డీగో గార్షియా అటోల్‌వద్ద బ్రిటన్, అమెరికా నావికా దళ స్థావరాలను కొనసాగిస్తున్నాయి.
2004 డిసెంబరు 26న హిందూ మహాసముద్ర తీర దేశాల్లో చాలావరకు భయానకమైన సునామీ బారిన పడ్డాయి. హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపమే ఇందుకు కారణమైంది. రాకాసి అలల తాకిడికి తట్టుకోలేక ఏకంగా 2.26 లక్షల మంది చనిపోయారు. మరో 10 లక్షల మంది దాకా నిరాశ్రయులయ్యారు.
వాణిజ్యం[మార్చు]
మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, తూర్పు ఆసియాలను ఐరోపా, అమెరికాలతో కలిపే ప్రధాన సముద్ర మార్గాలకు హిందూ మహాసముద్రం నిలయం. ముఖ్యంగా పర్షియా సింధు శాఖ, ఇండొనేసియా ప్రాంతాల్లోని చమురు క్షేత్రాల నుంచి భారీ పరిమాణాల్లో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే ట్రాఫిక్ రద్దీ అత్యంత విపరీతంగా ఉంటుంది. ఇక సౌదీ అరేబియా, ఇరాన్, భారతదేశం, పశ్చిమ ఆస్ర్టేలియా తీరాల్లో భారీ హైడ్రోకార్బన్ నిల్వలను రవాణా చేస్తుంటారు. ప్రపంచంలోని తీరం లోపలి చమురు ఉత్పత్తుల్లో దాదాపుగా 40 శాతం ఒక్క హిందూ మహాసముద్రం నుంచే వస్తుంది. అపారమైన భార ఖనిజాల నిల్వలుండే తీర ఇసుక, తీరాంతర నిల్వలను తీర ప్రాంత దేశాలు, ముఖ్యంగా భారతదేశం, దక్షిణాఫ్రికా, ఇండొనేసియా, శ్రీలంక, థాయ్ లాండ్ బాగా సేకరిస్తున్నాయి.
పెట్రోలియం ట్యాంకర్ల విపరీతమైన రద్దీ కారణంగా సోమాలియా తీర ప్రాంతం వైపు నుంచి సముద్రపు దొంగతనాల బెడద నానాటికీ పెరుగుతోంది. 21 వ శతాబ్దంలో సోమాలియాలో రెండో దశ అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచీ అంతర్జాతీయ నౌకాయానానికి కూడా ఇది పెద్ద ప్రమాదంగా పరిణమించింది.
ప్రధాన రేవులు, నౌకాశ్రయాలు[మార్చు]
ముంబై హిందూ మహాసముద్రంలోని ప్రధాన భారతీయ వర్తక నౌకాశ్రయం. దీన్ని తరచూ గేట్‌వే ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటారు. హిందూ మహాసముద్రంలోని ఇతర ముఖ్యమైన భారత నౌకాశ్రయాల్లో కోచి, కోల్‌కతా, విశాఖపట్నం, చెన్నై వంటివి ఉన్నాయి. ఇవి సంయుక్తంగా తూర్పు దిశగా భారతీయ వస్తువుల ఎగుమతులన్నింటినీ నియంత్రిస్తుంటాయి. యమన్‌లోని ఆడెన్ కూడా హిందూ మహాసముద్రంలో ఉన్న ప్రధానమైన అరేబియన్ నౌకాశ్రయం. ఇక ఆస్ల్రేలియాలోని పెర్త్, పాకిస్థాన్‌లోని కరాచీ కూడా ముఖ్యమైన హిందూ మహాసముద్ర నౌకాశ్రయాలు.
సరిహద్దు దేశాలు, ప్రాంతాలు[మార్చు]
సవ్యదిశలో చూస్తే హిందూ మహాసముద్ర తీరమున్న దేశాలు ఇలా ఉంటాయి.
ఆఫ్రికా[మార్చు]
దక్షిణ ఆఫ్రికా,
Mozambique,
Madagascar,
French Southern and Antarctic Lands,
France (రీ యూనియన్),
Mauritius,
Mayotte,
Comoros,
Tanzania,
Seychelles,
కెన్యా,
సొమాలియా,
Djibouti,
Eritrea,
Sudan,
Egypt
ఆసియా[మార్చు]
Egypt ( (సియానీ ద్వీపకల్పం) ),
ఇజ్రాయిల్,
Jordan,
సౌదీ అరేబియా,
Yemen,
Oman,
United Arab Emirates,
{{{name}}},
Bahrain,
Kuwait,
ఇరాక్,
ఇరాన్,
పాకిస్తాన్,
భారతదేశం,
Maldives,
British Indian Ocean Territory,
Sri Lanka,
Bangladesh,
Burma, (మయన్మార్).
Malaysia,
Indonesia,
Cocos (Keeling) Islands,
Christmas Island
ఆస్ట్రేలేసియా[మార్చు]
ఆష్మోర్, కార్టియర్ ద్వీపాలు
Indonesia
Timor-Leste
ఆస్ట్రేలియా
దక్షిణ హిందూ మహాసముద్రం[మార్చు]
హెరాల్డ్ ద్వీపం, మెక్‌డొనాల్డ్ ద్వీపాలు
French Southern and Antarctic Lands
వీటిని కూడా చూడండి[మార్చు]
సూచనలు[మార్చు]
- ↑ The Indian Ocean and the Superpowers. Routledge. 1986. ISBN 0709942419, 9780709942412 Check
|isbn=
value: invalid character (help).|first=
missing|last=
(help) - ↑ Harper, Douglas. "Online Etymology Dictionary". Online Etymology Dictionary. Retrieved 18 January 2011.
- ↑ ఇండో అమెరికా సంబంధాలు: పీవీ నరసింహారావు, బిల్ క్లింటన్‌ల విదేశీ విధాన నిర్ణయాలు, దృక్పథాలు ఆనంద్ మాథుర్, 138 పేజీ ''హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కీలక పాత్ర ఆక్రమించింది. అందుకే ఈ మహాసముద్రానికి భారతదేశం మీదుగా పేరు పెట్టారు'
- ↑ హిందూ మహాసముద్ర ప్రాంత రాజకీయాలు: అధికార సమతుల్యాలు ఫరెంక్ ఆల్బర్ట్, పేజీ 25
- ↑ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం భారతదేశ భౌగోళిక చరిత్రా హుసేన్: పేజీలు 12ా251; భారతదేశం, హిందూ మహాసముద్రపు జియో పాలిటిక్స్ (16-33)
- ↑ మహాసముద్రాలు, సముద్రాల పరిధులు: అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ ఆర్జనైజేషన్ ప్రత్యేక ప్రచురణ నంబరు 23, 1953.
- ↑ http://www.enchantedlearning.com/subjects/ocean/
- ↑ Donald W. Gothold, Julia J. Gothold (1988). Indian Ocean: Bibliography. Clio Press. ISBN 1851090347.
- ↑ {0/}హిందూ మహాసముద్ర భౌగోళికత, ద వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ 1994, సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ నుంచి ఉటంకింపు
- ↑ డీఏవీ స్టౌ(2006) మహాసముద్రాలు: యాన్ ఇలస్ట్రేటెడ్ రిఫరెన్స్ షికాగో: యూనివర్సిటీ ఆఫ్ షికాగో ప్రెస్, Iూదీచీ 0226776646 -పేజీ 127. హిందూ మహాసముద్ర పటాలు, టెక్స్ట్ కోసం
బాహ్య లింకులు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో హిందూ మహాసముద్రంచూడండి. |
![]() |
Wikimedia Commons has media related to హిందూ మహాసముద్రం. |
- ఎన్ఓఏఏ ఇన్ సిటూ ఓషన్ డేటా వ్యూయర్ ప్లాట్ అండ్ డౌన్లోడ్ ఓషన్ అబ్జర్వేషన్స్
- ద ఇండియన్ ఓషన్ ఇన్ వరల్డ్ హిస్టరీ. ఎడ్యూకేషనల్ వెబ్సైట్ ఇంటరాక్టివ్ సుల్తాన్ కబూస్ సాంస్కృతిక కేంద్రం నుంచి వనరులు
- ప్రాంతీయ ట్యూనా ట్యాగింగ్ ప్రాజెక్టు: హిందూ మహౄసముద్రంలో ట్యూనా ప్రాముఖ్యతను గురించిన వివరాల యుక్తంగా హిందూ మహాసముద్రం
- హిందూ మహాసముద్రపు సవివరమైన పటాలు
- హిందూ మహాసముద్ర వరత్రకం: క్లాస్రూమ్ స్టిమ్యులేషన్