జీలాండియా
జీలాండియా శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలో న్యూజీలాండ్ కింది భాగంలో భారత ఉపఖండం పరిమాణంలో ఓ కొత్త ఖండాన్ని గుర్తించారు. 49 లక్షల కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ ఖండం ‘జీలాండియా’ కొత్త ఖండం ఎనిమిదవ ఖండం భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయి ఇకపై ఆ సంఖ్య ఎనిమిది రూపాంతరం చెందుచున్నది అంటున్నారు శాస్త్రవేత్తలు[1].
కొత్త ఖండం
[మార్చు]న్యూజిలాండ్‌లోని విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్‌స్టన్, ఆస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీనిని కనిపెట్టారు ‘జీలాండియా’ అని పేరుపెట్టారు 40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం పసిఫిక్ మహాసముద్ర గర్భంలో సంభవించిన ‘రింగ్ ఆఫ్ ఫైర్’.. అగ్నిపర్వతాల క్రీయాశీలత్వాన్ని, సముద్ర లోతును, జిలాండియా విస్తీర్ణంలో మార్పులు వచ్చేలా చేసిందని వెల్లడించారు. అప్పుడే ఆస్ట్రేలియా, అంటార్కిటికాల నుంచి జిలాండియా విడిపోయి ఉంటుందని వెల్లింగ్‌టన్ యూనివర్శిటీ పరిశోధకులు ఒకరు చెప్పారు.
సముద్ర గర్భంలోని జిలాండియాను సందర్శించడం వల్ల భూమి చరిత్ర, న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లో పర్వతాల పుట్టుక, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పులు, సముద్రాలలో సంభవించే మార్పులు, ప్రపంచ వాతావరణంలో మార్పులపై పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని యూఎస్ నేషనల్ సైన్స్ షౌండేషన్‌కు చెందిన శాస్త్రవేత్త వివరించారు..
భోగోళిక స్వరూపం
[మార్చు]జిలాండియా మొత్తం విస్తీర్ణం 49 లక్షల కిలోమీటర్ల పరిధి.న్యూజిల్యాండ్‌కు అనుకుని సముద్ర అంతర్భాగం నుంచి కొద్దిగా బయటకు కనిపిస్తున్న భూమే ఇందుకు నిదర్శనం. మనకు ప్రస్తుత ప్రపంచపటంపై కనిపిస్తున్న న్యూజిలాండ్ భూభాగం ఆ కొంచమే కాదు. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కలిసిపోయిన న్యూజిలాండ్ భూభాగం చాలానే ఉంది. ఆ భూభాగమే 'జిల్యాండియా'. ఐదు మిలియన్ల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో జిల్యాండియా వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలో మిగిలిన ఖండాల్లానే మనిషి నివసించడానికి కావల్సిన అనుకూలతలన్నీ ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు[2].
మూలాలు
[మార్చు]- ↑ http://www.andhrajyothy.com/artical?SID=371326[permanent dead link]
- ↑ https://www.sakshi.com/news/international/scientists-make-first-expedition-earths-lost-eighth-continent-941385
|
| ||||||||||||||||||||||||
ప్రపంచ ఖండాలు కూడా చూడండి |