ఎలియా కజాన్
ఎలియా కజాన్ | |
---|---|
జననం | ఎలియాస్ కజాంట్‌జోగ్లౌ 1909 సెప్టెంబరు 7 కాన్స్టాంటినోపుల్, ఇస్తాంబుల్, టర్కీ |
మరణం | 2003 సెప్టెంబరు 28 | (వయసు 94)
విద్య | విలియమ్స్ కాలేజ్ (బిఏ) యేల్ యూనివర్సిటీ |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1934–1976 |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 5, నికోలస్ కజాన్ |
బంధువులు | |
సంతకం | |
ఎలియా కజాన్ (1909, సెప్టెంబరు 7 - 2003, సెప్టెంబరు 28) అమెరికన్ నాటకరంగ, సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. "బ్రాడ్‌వే, హాలీవుడ్ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన, ప్రభావవంతమైన దర్శకులలో ఒకరు"గా ది న్యూయార్క్ టైమ్స్ అభివర్ణించింది.[1]
జననం
[మార్చు]ఎలియా కజాన్ 1909, సెప్టెంబరు 7న కాన్స్టాంటినోపుల్‌లోని కడికోయ్ జిల్లాలో (ప్రస్తుతం ఇస్తాంబుల్) లో జన్మించాడు.[2][3][4] 1913, జూలై 8న తన తల్లిదండ్రులు జార్జ్ - ఎథీనా కజాంట్‌జోగ్లౌ తో కలిసి యునైటెడ్ స్టేట్స్‌కు చేరుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కజాన్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు.[1] 1932లో నాటక రచయిత మోలీ డే థాచర్ తో మొదటి వివాహం జరిగింది. వారికి స్క్రీన్ ప్లే రచయిత నికోలస్ కజాన్‌తో సహా ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు జన్మించారు. ఆమె 1963లో మరణించింది.
1967లో నటి బార్బరా లోడెన్‌తో రెండవ వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆమె 1980లో మరణించింది.
1982లో ఫ్రాన్సెస్ రడ్జ్‌తో మూడవ వివాహం జరిగింది.
సినిమారంగం
[మార్చు]1932లో నాటకరంగ సంస్థలో చేరాడు. 1947లో యాక్టర్స్ స్టూడియోను సహ-స్థాపించాడు. రాబర్ట్ లూయిస్, చెరిల్ క్రాఫోర్డ్‌లతో కలిసి లీ స్ట్రాస్‌బర్గ్ దర్శకత్వంలో "మెథడ్ యాక్టింగ్"ని పరిచయం చేశాడు. కజాన్ సిటీ ఫర్ కాంక్వెస్ట్ (1940)తో సహా కొన్ని సినిమాలలో నటించాడు.[5]
1951లో దర్శకత్వం వహించిన ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ సినిమా 12 విభాగాలలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది, 4 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. మూడు సంవత్సరాల తర్వాత, న్యూయార్క్ హార్బర్ వాటర్‌ఫ్రంట్‌లో యూనియన్ అవినీతికి సంబంధించి ఆన్ ది వాటర్‌ఫ్రంట్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా 12 విభాగాలలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యి, 8 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 1955లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ద్వారా జేమ్స్ డీన్‌ను పరిచయమయ్యాడు.
1950లు, 1960లలో కజాన్ తన సమస్య-ఆధారిత అంశాలతో సినిమాల తీశాడు.
దర్శకత్వం వహించినవి
[మార్చు]సంవత్సరం | సినిమా | పంపిణీదారు |
---|---|---|
1945 | ఎ ట్రీ గ్రోస్ ఇన్ బ్రూక్లిన్ | 20వ సెంచరీ ఫాక్స్ |
1947 | ది సీ ఆఫ్ గ్రాస్ | మెట్రో-గోల్డ్విన్-మేయర్ |
బూమరాంగ్! | 20వ సెంచరీ ఫాక్స్ | |
జెంటిల్ మెన్స్ అగ్రిమెంట్ | ||
1949 | పింకీ | |
1950 | పానిక్ ఇన్ ది స్ట్రీట్స్ | |
1951 | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | వార్నర్ బ్రదర్స్. |
1952 | వివా జపాటా! | 20వ సెంచరీ ఫాక్స్ |
1953 | మాన్ ఆన్ ఎ టైట్రోప్ | |
1954 | ఆన్ ది వాటర్‌ఫ్రంట్ | కొలంబియా పిక్చర్స్ |
1955 | ఈస్ట్ ఆఫ్ ఈడెన్ | వార్నర్ బ్రదర్స్ |
1956 | బేబీ డాల్ | |
1957 | ఎ ఫేస్ ఇన్ ది క్రౌడ్ | |
1960 | వైల్డ్ రివర్ | 20వ సెంచరీ ఫాక్స్ |
1961 | స్ప్లెండర్ ఇన్ ది గ్రాస్ | వార్నర్ బ్రదర్స్. |
1963 | అమెరికా అమెరికా | |
1969 | ది అరెంజ్మెంట్ | వార్నర్ బ్రదర్స్. - సెవెన్ ఆర్ట్స్ |
1972 | ది విజిటర్స్ | యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
1976 | ది లాస్ట్ టైకూన్ | పారామౌంట్ పిక్చర్స్ |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | పేరు | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
1947 | అకాడమీ పురస్కారాలు | ఉత్తమ దర్శకుడు | జెంటిల్ మెన్స్ అగ్రీమెంట్ | విజేత | [6] |
1951 | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | నామినేట్ | |||
1954 | ఆన్ ది వాటర్‌ఫ్రంట్ | విజేత | |||
1955 | ఈస్ట్ ఆఫ్ ఈడెన్ | నామినేట్ | |||
1963 | ఉత్తమ చిత్రం | అమెరికా అమెరికా | నామినేట్ | ||
ఉత్తమ దర్శకుడు | నామినేట్ | ||||
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే | నామినేట్ | ||||
1998 | అకాడమీ గౌరవ పురస్కారం | లైఫ్ టైం అచీవ్మెంట్ | విజేత | ||
1947 | టోనీ అవార్డులు | ఉత్తమ దర్శకత్వం | ఆల్ మై సన్స్ | విజేత | [7] |
1949 | డెత్ ఆఫ్ ఎ సేల్స్‌మ్యాన్ | విజేత | |||
1956 | హాట్ టిన్ రూఫ్ మీద పిల్లి | నామినేట్ | |||
1958 | బెస్ట్ ప్లే | ది డార్క్ ఎట్ ది టాప్ ఆఫ్ ది స్టయిర్స్ | నామినేట్ | ||
ఉత్తమ దర్శకుడు | నామినేట్ | ||||
1959 | జెబి | విజేత | |||
1960 | యూత్ స్వీట్ బర్డ్ | నామినేట్ | |||
1948 | గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు | ఉత్తమ చలన చిత్ర దర్శకుడు | జెంటిల్ మెన్స్ అగ్రీమెంట్ | విజేత | [8] |
1954 | ఆన్ ది వాటర్‌ఫ్రంట్ | విజేత | |||
1956 | బేబీ డాల్ | విజేత | |||
1963 | అమెరికా అమెరికా | విజేత | |||
1952 | బ్రిటీష్ ఫిల్మ్ అవార్డులు | ఉత్తమ చిత్రం | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | నామినేట్ | [6] |
వివా జపాటా! | నామినేట్ | ||||
1954 | ఆన్ ది వాటర్‌ఫ్రంట్ | నామినేట్ | |||
1955 | ఈస్ట్ ఆఫ్ ఈడెన్ | నామినేట్ | |||
1956 | బేబీ డాల్ | నామినేట్ | |||
1952 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ | ఫెస్టివల్ గ్రాండ్ ప్రైజ్ | వివా జపాటా! | నామినేట్ | [6] |
1955 | బెస్ట్ డ్రామాటిక్ ఫిల్మ్ | ఈస్ట్ ఆఫ్ ఈడెన్ | విజేత | ||
పామ్ డి'ఓర్ | నామినేట్ | ||||
1972 | ది వినిటర్స్ | నామినేట్ | |||
1953 | బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ | గోల్డెన్ బేర్ | మాన్ ఆన్ ఎ టైట్రోప్ | నామినేట్ | [9] |
1960 | వైల్డ్ రివర్ | నామినేట్ | [10] | ||
1996 | గౌరవ గోల్డెన్ బేర్ | — | విజేత | [11] | |
1948 | వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ | అంతర్జాతీయ అవార్డు | జెంటిల్ మెన్స్ అగ్రీమెంట్ | నామినేట్ | [6] |
1950 | పానిక్ ఇన్ ది స్ట్రీట్స్ | నామినేట్ | |||
1950 | గోల్డెన్ లయన్ | విజేత | |||
1951 | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | నామినేట్ | |||
1951 | ప్రత్యేక జ్యూరీ బహుమతి | విజేత | |||
1954 | గోల్డెన్ లయన్ | ఆన్ ది వాటర్‌ఫ్రంట్ | నామినేట్ | ||
1954 | సిల్వర్ లయన్ | విజేత | |||
1955 | ఓసిఐసి అవార్డు | విజేత |
దర్శకత్వంలో అకాడమీ అవార్డు ప్రదర్శనలు
[మార్చు]సంవత్సరం | నటి, నటుడు | సినిమా | విజేత |
---|---|---|---|
ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు | |||
1947 | గ్రెగొరీ పెక్ | జెంటిల్ మెన్స్ అగ్రీమెంట్ | నామినేట్ |
1951 | మార్లోన్ బ్రాండో | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | నామినేట్ |
1952 | వివా జపాటా! | నామినేట్ | |
1954 | ఆన్ ది వాటర్‌ఫ్రంట్ | విజేత | |
1955 | జేమ్స్ డీన్ | ఈస్ట్ ఆఫ్ ఈడెన్ | నామినేట్ |
ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు | |||
1947 | డోరతీ మెక్‌గ్యురే | జెంటిల్ మెన్స్ అగ్రీమెంట్ | నామినేట్ |
1949 | జీన్ క్రైన్ | పింకీ | నామినేట్ |
1951 | వివియన్ లీ | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | విజేత |
1956 | కారోల్ బేకర్ | బేబీ డాల్ | నామినేట్ |
1961 | నటాలీ వుడ్ | స్ప్లెండర్ ఇన్ ది గ్రాస్ | నామినేట్ |
ఉత్తమ సహాయ నటుడిగా అకాడమీ అవార్డు | |||
1945 | జేమ్స్ డన్ | ఎ ట్రీ గ్రోస్ ఇన్ ది బ్రూక్లిన్ | విజేత |
1951 | కార్ల్ మాల్డెన్ | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | విజేత |
1952 | ఆంథోనీ క్విన్ | వివా జపాటా! | విజేత |
1954 | లీ జె. కాబ్ | ఆన్ ది వాటర్ ఫ్రంట్ | నామినేట్ |
కార్ల్ మాల్డెన్ | నామినేట్ | ||
రాడ్ స్టీగర్ | నామినేట్ | ||
ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డు | |||
1947 | సెలెస్టే హోల్మ్ | జెంటిల్ మెన్స్ అగ్రీమెంట్ | విజేత |
అన్నే రెవెరే | నామినేట్ | ||
1949 | ఎథెల్ బారీమోర్ | పింకీ | నామినేట్ |
ఎథెల్ వాటర్స్ | నామినేట్ | ||
1951 | కిమ్ హంటర్ | ఎ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్ | విజేత |
1954 | ఎవా మేరీ సెయింట్ | ఆన్ ది వాటర్‌ఫ్రంట్ | విజేత |
1955 | జో వాన్ ఫ్లీట్ | ఈస్ట్ ఆఫ్ ఈడెన్ | విజేత |
1956 | మిల్డ్రెడ్ డన్నోక్ | బేబీ డాల్ | నామినేట్ |
మరణం
[మార్చు]కజాన్ తన 94వ వయస్సులో 2003 సెప్టెంబరు 28న న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్‌లో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Rothstein, Mervyn (September 28, 2003). "Elia Kazan, Influential Director, Dies at 94". The New York Times. Retrieved 2023-06-15.
- ↑ "Elia Kazan". www.britannica.com. Retrieved September 10, 2010.
Elia Kazan, original name Elia Kazanjoglous (b. September 7, 1909, Istanbul, Ottoman Empire—d. September 28, 2003, New York City), Turkish-born American director and author, noted for his successes on the stage, especially with plays by Tennessee Williams and Arthur Miller, and for his critically acclaimed films. At age four, Kazan was brought to the United States with his immigrant Greek family.
- ↑ Young, Jeff (2001). Kazan: the master director discusses his films: interviews with Elia Kazan. Newmarket Press. p. 9. ISBN 978-1-55704-446-4.
He was born on September 7, 1909 to Greek parents living in Istanbul. His father, Giorgos Kazantzoglou, had fled Kayseri, a small village in Anatolia where for five hundred years the Turks had oppressed and brutalized the Armenian and Greek minorities who had lived there even longer.
- ↑ Sennett, Ted (1986). Great movie directors. Abrams. pp. 128–129. ISBN 978-0-8109-0718-8.
Elia Kazan (born 1909) ... Born in Istanbul, Kazan immigrated to America with his Greek parents at the age of four
- ↑ "Robert Osborne on Method Acting". Turner Classic Movies. Retrieved 2023-06-15.
- ↑ 6.0 6.1 6.2 6.3 "Elia Kazan - Awards". Internet Movie Database. Retrieved 2023-06-15.
- ↑ "Elia Kazan". Playbill.com. Retrieved 2023-06-15.
- ↑ "Winners & Nominees - Elia Kazan". goldenglobes.com. Retrieved 2023-06-15.
- ↑ "1st Berlin International Film Festival: In Competition". berlinale.de. Archived from the original on February 2, 2010. Retrieved 2023-06-15.
- ↑ "IMDB.com: Awards for Wild River". imdb.com. Retrieved 2023-06-15.
- ↑ "Berlinale: 1996 Prize Winners". berlinale.de. Archived from the original on June 30, 2018. Retrieved 2023-06-15.
బయటి లింకులు
[మార్చు]- ఎలియా కజాన్ at the Internet Broadway Database
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎలియా కజాన్ పేజీ
- Method Man: Elia Kazan's Singular Career by John Lahr in The New Yorker (A Critic at Large)
- Assessing Kazan: His Life and Choice (NYT Books of the Times)
- Some notes on Kazan, HCUAh, and the aftermath of his testimony including his April 13, 1952 statement in The New York Times
- Literature on Elia Kazan