Jump to content

కేతిరి సాయిరెడ్డి

వికీపీడియా నుండి
కేతిరి సాయి రెడ్డి
కేతిరి సాయిరెడ్డి


మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 – 1994
ముందు దుగ్గిరాల వెంకట్ రావు
తరువాత ఏనుగుల పెద్ది రెడ్డి
నియోజకవర్గం హుజురాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 15 జనవరి 1945
జూపాక, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
మరణం 23 ఏప్రిల్ 2021
హైదరాబాదు
జీవిత భాగస్వామి పుష్పమల
సంతానం రాజప్రతాపరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి(కుమారులు), కుమార్తె చైతన్య రెడ్డి
నివాసం హైదరాబాదు

కేతిరి సాయిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం & విద్యాభ్యాసం

[మార్చు]

కేతిరి సాయిరెడ్డి 1945 జనవరి 15న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం, జూపాక గ్రామంలో కేతిరి నర్సింహా రెడ్డి, మణికమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన హుజూరాబాదు​ మండలం, చెల్పూర్ గ్రామంలో 4వ తరగతి వరకు, 5 నుండి 10వ తరగతి వరకు హన్మకొండలో చదివాడు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (పొలిటికల్ సైన్స్) చదివాడు. వరంగల్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూడీసీగా, ఏజీ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, హజురాబాద్ లో అడ్వకేట్ గా ప్రాక్టిస్ ప్రారంబించాడు. సాయిరెడ్డి కొంతకాలం రిజర్వు బ్యాంకులో ఉద్యోగం చేశాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

1969లో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిలో చేరి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించి ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపాడు. 1972లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి జూపాక సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1974, 1981లో హుజురాబాద్ సమితి అధ్యక్షునిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించాడు. 1982లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1989లో జరిగిన ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి వొడితల రాజేశ్వర్‌రావు పై ఎమ్మెల్యేగా గెలిచాడు. అనంతరం 1994లో కమలాపూర్,1999లో హుజురాబాద్ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. సాయిరెడ్డి 2018లో శాలపల్లిలో కె చంద్రశేఖర్ రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[1][2]

మరణం

[మార్చు]

కేతిరి సాయిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2021, ఏప్రిల్ 23న గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు. ఆయనకు భార్య పుష్పమాల, కుమారులు రాజప్రతాపరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కుమార్తె చైతన్య రెడ్డి ఉన్నారు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. HMTV (23 April 2021). "MLA Kethiri Sai Reddy: హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయి రెడ్డి కన్నుమూత". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  2. Disha daily (దిశ) (23 April 2021). "కేతిరి సాయిరెడ్డి హఠాన్మరణం". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  3. The New Indian Express (24 April 2021). "Ex-Huzurabad MLA Kethiri Sai Reddy passes away". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  4. Namasthe Telangana (23 April 2021). "హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి క‌న్నుమూత". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  5. Mana Telangana (23 April 2021). "మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి ఇకలేరు..." Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  6. Andhra Jyothy (23 April 2021). "మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి". Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.