ఖైరతాబాదు వినాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైరతాబాదు వినాయకుడు
ఖైరతాబాదు గణేషుడు
2018లో ఖైరతాబాదు వినాయకుడు
ప్రదేశంఖైరతాబాదు, హైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
ప్రారంభించినది1954
వ్యవస్థాపకుడుసింగరి శంకరయ్య
మునుపటి2019
తరువాతి2020
నిర్వహణఖైరతాబాదు గణేష్ ఉత్సవ కమిటీ
వెబ్‌సైటు
http://www.ganapathideva.org

ఖైరతాబాదు వినాయకుడు (ఖైరతాబాదు గణేషుడు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయకుడు.[1][2] 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.[3]

చరిత్ర

[మార్చు]

1954లో ఖైరతాబాదు కౌన్సిలరుగా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60ఏళ్ళు వరకు ఒక్కో అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్‌ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలీలు పూజలు నిర్వహిస్తారు. 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాధునికి సమర్పిస్తారు.[4]

విశేషాలు

[మార్చు]
  • తొలినాళ్ళో హైదరాబాదు నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు.
  • 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
  • 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
  • 1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.
  • 1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
  • ఇక్కడ మొదటి నుంచి లడ్డు ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.
  • ఓసారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో నెలరోజులపాటు ట్యాంక్‌బండ్ పై ఉంచారు.
  • టెలివిజన్ లోనే కాకుండా 1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు కనిపించాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఎన్టీఆర్, శోభన్‌బాబు లు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.
  • తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడునెలలపాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి 2021

విగ్రహ వివరాలు

[మార్చు]
సంవత్సరం అవతారం ఎత్తు (అడుగులు) మూలాలు
2014 సకుటుంబ సపరివార సమేత - శివ పరివారం 60 [5]
2015 త్రిశక్తిమయ మోక్ష గణపతి 59 [6]
2016 శ్రీ శక్తి పీఠ శివ నాగేంద్ర మహా గణపతి 58
2017 శ్రీ చండి కుమార అనంత మహా గణపతి 57
2018 శ్రీ సప్త ముఖ గణపతి 56

[7]

2019 శ్రీ ద్వదాషాదిత్య మహా గణపతి. (విగ్రహం యొక్క ముఖం 12 తలలు, 24 చేతులతో, 12 సర్పాలతో అలంకరించబడి, ఏడు గుర్రాలతో రథం నడుపుతూ సూర్యుడిలా ఉన్నాడు. కుడి వైపున శ్రీ మహావిష్ణు, ఏకాదశ దేవి విగ్రహాలను ప్రత్యేక చిన్న మంటపంలో... ఎడమ వైపున దుర్గాదేవి విగ్రహాలతో పాటు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు.) 55 [8][9]
2020 ధన్వంతరి నారాయణుడు (వినాయకుడు ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో కనిపించాడు. కుడివైపు మహాలక్ష్మి దేవి, ఎడమవైపు సరస్వతి కొలువుదీరారు) 9 [10]
2021 శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి - కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన మహాగణపతి 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పు [11][12]
2022 పంచముఖ మహాలక్ష్మీ గణపతి - కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి 50 అడుగుల ఎత్తు [13]
2023 దశ మహావిద్యాగణపతి - సరస్వతి, వారాహి అమ్మవార్లు (కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీనరసింహ స్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి)

కుడివైపు చేతుల్లో అంకుశం, త్రిశూలం, ధాన్యం, రుద్రాక్ష, ఆశీర్వాదం, ఎడమవైపు చేతుల్లో పాశం, ఖడ్గం, దారం, గ్రంథం, లడ్డూ, తొండంలో కలశం ఉన్నాయి. స్వామి వారి వెనుక వైపు దశ మహాగ్రంథం, పాదాల వద్ద మూషికం ఉన్నాయి.

63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు [14][15]

ఇతర వివరాలు

[మార్చు]
  1. 2013లో 59 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు తయారుచేసిన 4200 కిలోల లడ్డును అరచేతిలో ఉంచారు.[16]
  2. 2015లో 6000 కిలోల బరువున్న లడ్డును పెట్టారు.
  3. 2018 నుండి పర్యావరణ అనుకూలమైన బంకమట్టి విగ్రహానికి తయారుచేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ అంగీకరించింది.[17][18]
  4. హైదరాబాద్ మేయర్ అభ్యర్థన మేరకు 2022లో మట్టితో చేసిన 70 అడుగుల పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాన్ని నిర్మించనున్నట్టు నిర్వాహక కమిటీ ప్రకటించింది. విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ సరస్సు వద్దకు తీసుకెళ్ళే బదులు ఆ స్థలంలోనే నిమజ్జనం చేయాలనే ఆలోచనను పరిశీలిస్తామని కూడా కమిటీ పేర్కొంది.[19] అందుకోసం ప్రత్యేక మట్టితో 2022లో తొలిసారిగా 50 అడుగుల 'పంచముఖ మహాలక్ష్మీ గణపతి' విగ్రహాన్ని తయారు చేశారు[20]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 12 సెప్టెంబరు 2013. Retrieved 12 సెప్టెంబరు 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "60,500 Ganesh idols to bless Hyderabad this year".[permanent dead link]
  3. "Archived copy". Archived from the original on 12 సెప్టెంబరు 2013. Retrieved 12 సెప్టెంబరు 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Khairatabad Ganesh 2022 : పూజకు కొలువుదీరిన ఖైరతాబాద్‌ గణేశ్‌". ETV Bharat News. 2022-08-31. Archived from the original on 2022-08-31. Retrieved 2022-08-31.
  5. "Importance of Khairatabad Ganesh Laddu". youtube.
  6. "khairatabad Ganesh 2015 Makes Telangana State Next Level". TSO. Hyderabad, India. 4 July 2015. Archived from the original on 25 ఏప్రిల్ 2016. Retrieved 12 September 2019.
  7. "Ganesh fest: Tight security in Khairatabad". The Hans India. 13 September 2018.[permanent dead link]
  8. "kurnool Ganesh Statue 2019 | Maha Ganapathi | Jordar News | hmtv - Andhra/Telangana News తెలుగు వార్తలు - Video". www.aplatestnews.com. 2019.
  9. India, The Hans (26 June 2019). "Khairatabad Ganesha to appear as Ganapathi". www.thehansindia.com.
  10. ఈనాడు (23 August 2020). "ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  11. Sakshi (18 July 2021). "36–40 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్‌ మహాగణపతి". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  12. TNews Telugu (19 September 2021). "గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ గణనాథుడు". Archived from the original on 23 సెప్టెంబరు 2021. Retrieved 23 September 2021.
  13. telugu, NT News (2022-08-31). "ఖైరతాబాద్‌లో 50 అడుగుల మట్టి విగ్రహం". Namasthe Telangana. Archived from the original on 2022-08-31. Retrieved 2022-08-31.
  14. Sakshi (16 September 2023). "ఈసారి ఖైరతాబాద్‌ మహా గణపతి సమ్‌థింగ్‌ స్పెషల్‌". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  15. ETV Bharat News (18 August 2023). "శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు.. ఈ ఏడాది ఎత్తు ఎంతో తెలుసా..?". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  16. "Ganesh festival celebrated in Andhra Pradesh".
  17. "Hyderabad's tallest Ganesha to be a centre of attraction as always".
  18. "Khairatabad Ganesha idol caught in clay, PoP mess".
  19. "Hyderabad: Khairatabad Ganesh idol to be made of clay next year". The New Indian Express. 2021-09-15.
  20. "Telangana: At Rs 1 crore, this year's Khairatabad Ganesh costliest".