గరికపాటి రాజారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరికపాటి రాజారావు
గరికపాటి రాజారావు
జననంగరికపాటి రాజారావు
(1915-02-05)1915 ఫిబ్రవరి 5
రాజమండ్రి
మరణం1963 సెప్టెంబరు 8(1963-09-08) (వయసు 48)
మద్రాసు
మరణ కారణంమానసిక వేదన
నివాస ప్రాంతంరాజమండ్రి
వృత్తిలాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తా
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకుడు,
నాటకరంగ ప్రముఖుడు,
ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు.
భార్య / భర్తనాగేశ్వరమ్మ
తండ్రికోటయ్య,
తల్లిదేవరా రామలింగమ్మ

గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5, 1915 - సెప్టెంబరు 8, 1963) తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు.

ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్, టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు.[1]

రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాసు హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు. తరువాత విజయనగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన సికిందరాబాదు లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసు చేరాడు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులు. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు[2]

మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది. షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు.[3]

వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు. కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు.[4]

రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు.

ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు.[5]

మరణం[మార్చు]

జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. అదే సమయంలో దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. మానసికంగా కుంగిపోయిన రాజారావు 1963 సెప్టెంబరు 8న మద్రాసులో మరణించారు.[6]

మూలాలు[మార్చు]

  1. http://www.idlebrain.com/research/anal/anal-tc4.html
  2. ప్రజాకళాకారుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు - ప్రజాశక్తి కర్నూలు సంచిక 2009, సెప్టెంబరు 8[permanent dead link]
  3. నాటక వైద్యుడు గరికిపాటి రాజారావు - ఆంధ్రభూమి 2010, ఆగష్టు 4[permanent dead link]
  4. కళారాధన వైద్యసేవలకు గరికపాటి రాజారావు - ఆంధ్రప్రభ 2012, ఫిబ్రవరి 2[permanent dead link]
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-04. Retrieved 2007-08-09.
  6. "విశాలాంధ్ర, తేది:29.09.1963,పేజి సంఖ్య:6".[permanent dead link]

బయటి లింకులు[మార్చు]