Jump to content

గొల్లపల్లి (నూజివీడు)

అక్షాంశ రేఖాంశాలు: 16°42′N 80°57′E / 16.700°N 80.950°E / 16.700; 80.950
వికీపీడియా నుండి
గొల్లపల్లి (నూజివీడు)
పటం
గొల్లపల్లి (నూజివీడు) is located in ఆంధ్రప్రదేశ్
గొల్లపల్లి (నూజివీడు)
గొల్లపల్లి (నూజివీడు)
అక్షాంశ రేఖాంశాలు: 16°42′N 80°57′E / 16.700°N 80.950°E / 16.700; 80.950
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంనూజివీడు
విస్తీర్ణం5.04 కి.మీ2 (1.95 చ. మై)
జనాభా
 (2011)
5,196
 • జనసాంద్రత1,000/కి.మీ2 (2,700/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,676
 • స్త్రీలు2,520
 • లింగ నిష్పత్తి942
 • నివాసాలు1,344
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521111
2011 జనగణన కోడ్589066

గొల్లపల్లి, ఏలూరు జిల్లా, నూజివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజివీడు నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1344 ఇళ్లతో, 5196 జనాభాతో 504 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2676, ఆడవారి సంఖ్య 2520. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1409 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 72. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589066[2].ఇది సముద్రమట్టానికి 28 మీ.ఎత్తులో ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[3]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నూజివీడు మండలం

[మార్చు]

నూజివీడు మండలంలోని అన్నవరం, ఎనమడాల, గొల్లపల్లె, జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, నూజివీడు, పల్లెర్లమూడి, పొలసనపల్లె, పోతురెడ్డిపల్లె, బాతులవారిగూడెం, బూరవంచ, మర్రిబందం, మీర్జాపురం, ముక్కొల్లుపాడు, మొర్సపూడి, మోక్షనరసన్న పాలెం, రామన్నగూడెం, రావిచెర్ల, వెంకాయపాలెం, వేంపాడు, సంకొల్లు, సీతారాంపురం, హనుమంతుని గూడెం గ్రామాలు ఉన్నాయి.

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మోర్సపూడి, దేవరగుంట, వట్టిగుడిపాడు, రామన్నగూడెం, జంగంగూడెం గ్రామాలు ఉన్నాయి.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

గొల్లపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. నూజివీడు, హనుమాన్ జంక్షన్,ఏలూరుడి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 43కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి నూజివీడులో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నూజివీడులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నూజివీడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

అన్నే రామకృష్ణయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాలలో ఒక నూతన భవనాన్ని 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇంకా ప్రారంభించలేదు. [9]

గ్రామంలోని మౌలిక వసతులు

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]

ఇండియన్ బ్యాంక్.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

గొల్లపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

సాగునీటి చెరువు:- నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2017,మే-29న ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. ఈ విధంగా చెరువులో త్రవ్విన మట్టిని, రైతులు తమ పొలాలకు తరలించుకొనడమేగాక, పేదల ఇళ్ళు మెరక చేసుకొనడానికీ, పంచాయతీ పనులకూ ఉపయోగించుకొనడం విశేషం. [9]

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గోగినేని శ్రీనివాసకుమార్ సర్పంచిగా గెలుపొందారు. [3]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రఘునాధస్వామి ఆలయం

[మార్చు]

శ్రీ రఘునాధ స్వామి దేవస్థానం

ఆగమము: పాంచరాత్ర ఆగమము.

క్షేత్ర పాలకుడు: హనుమంతుడు.

సంక్షిప్త స్థల పురాణం.

ఇది సుమారు 600 సంవత్సరము క్రింది మాట. శ్రీ రఘునాధ స్వామి వారు సీత, లక్ష్మణ సమేతముగా గొల్లపల్లికి విగ్రహ రూపములో ప్రత్తి బస్తాలు తెస్తున్న బండిలో ప్రకాశము జిల్లా చదలవాడ గ్రామం నుండి వచ్చారని, బండ్లు ఇంకనూ పడమర దిశగా గోదావరి తీరానికి పోతుండగా శ్రీ స్వామి వారు గొల్లపల్లిలో బండి ఆపించి దిగిపోయారని ఒక గాథ. శ్రీ స్వామి వారు ఆగిన చోట ఊరు లేదు. అది అరణ్యము అగుటచే నీటి వసతి లేనందున శ్రీ రాములవారు ఒక బాణము వేసారని, ఆ బాణము ద్వారా నీరు వచ్చిందని ఆ ప్రదేశమే ఇప్పుడున్న రామిలేరుగా పిలవబడుచున్నది. దేవాలయమునకు ఆగ్నేయ దిశగా ఉన్న బావిలో నేటికి కుడా ఒక బాణము వంటిది ఉంది. దానిని కూడా        శ్రీరాముల వారు వేసారని పెద్దలు చెపుతారు. ఇద్దరు గొల్లలు స్వామి వారి విగ్రహములు మొదట అర్చకులుగా వారి పద్ధతిలో పూజలు నిర్వహించారని పెద్దలు చెపుతారు.

 ఆ తరువాత మల్లవల్లి గ్రామ నివాసి జంపన్న వెంకన్న బట్టు, పల్లెర్లమూడి గ్రామ నివాసి అయిన  ఒక సాధారణ వైశ్యునకు స్వామి వారు కలలో కనిపించి గుడి కట్టవలసినదిగా ఆదేశించగా వారి శక్తి మేరకు ఒక చిన్న గుడి నిర్మించినట్లు పెద్దలు చెపుతారు. అప్పటి నుండి “నండూరి” వారు అర్చనాది కార్యక్రమము చేసినారని కథనము. దేవాలయ నిర్వహణకు వారు ఎ.1100.00 లు వేంపాడు భూమి దాన పట్టా యిచ్చియున్నారు.తదుపరి గొల్లపల్లి జమిందారులు మేకా వంశీయులు దేవాలయ నిర్వహణ బాధ్యతలు స్వీకరించి దేవాలయమును అభివృద్ధి పరిచినారని తెలియచున్నది. మేకా వంశీయుల గురువులు శ్రీ వానమామలై జియ్యంగారిచే ప్రత్యేక హోమములు నిర్వహించి దేవాలయమును పాంచరాత్ర ఆగమము ప్రకారము దివ్య స్థలముగా చేసారు. నాటి నుండి ఈ దేవాలయములో పవిత్రోత్సవములు, తిరు నక్షత్రములు, బ్రహ్మోత్సవాలు జరుపుచున్నారు. పాంచరాత్ర ఆగమము ప్రకారము పూజాది కార్యక్రమముల నిర్వహణకు దేవాలయమునకు య.2200.00 లు వేంపాడు భూమిని దాన పట్టా ఇచ్చినట్లు తెలియచున్నది.

ఈ దేవాలయములో “చైత్ర శుద్ద ద్వాదశి” నాడు “శ్రీ స్వామి వారి కళ్యాణము”  జరుగును. దానికి కారణము ఆ కాలములో భద్రాచలములో శ్రీరామ నవమికి స్వామి వారి కళ్యాణము తిలకించి అచట నుండి అప్పటికి గల రవాణా సౌకర్యము ద్వారా ఇక్కడికి ద్వాదశి రోజు మధ్యాహ్నము అగుట వలన ద్వాదశి రోజు రాత్రి కళ్యాణము జరిపే వారు.నేటికి భద్రాచలం నుండి తలంబ్రాలు తీసుకొని వచ్చి ద్వాదశి రోజున స్వామి వారికీ కళ్యాణము జరిపించుట జరుగుచున్నది.  

  1. ఈ ఆలయం బాగా ప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో 2014, అక్టోబరు-20 సోమవారం నాడు, శ్రీ జయనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని వేదపండితులు నయన మనోహరంగా నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నవకలశస్నపనం, నదీజలాలతో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అగ్నిప్రతిష్ఠాపన, సుదర్శన శాంతిహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.
  2. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-28వ తేదీ శనివారం నుండి ఏప్రిల్-5వ తేదీ ఆదివారం వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించెదరు. 28వ తేదీన స్వామివారిని పెళ్ళికుమారుని చేయుట, 30వ తేదీనాడు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, 31వ తేదీనాడు మంగళవాయిద్యాలతో తీర్ధపు బిందె, ధ్వజారోహణ, ఏప్రిల్-1వ తేదీనాడు నిత్యహోమం, సంక్లేపరామాయణ పారాయణం, ఛావమౌళి భజన, రాత్రికి గజవాహనపై ఎదుర్కోలు ఉత్సవం, రఘునాథస్వామివారి కళ్యాణోతసవం, అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహించెదరు. దీనికి ముందు అన్నసమారాధన నిర్వహించెదరు. ఏప్రిల్-3వ తేదీనాడు రథోత్సవం, 4వ తేదీనాడు గరుడ వాహనంపై గ్రామోత్సవం, 5వ తేదీనాడు స్వామివారికి పవళింపుసేవతో కార్యక్రమాలు పరిసమాప్తమవుతవి.
  3. ఈ ఆలయానికి వేంపాడు గ్రామంలో 3,356 ఎకరాల మాన్యం భూమి ఉంది. గొల్లపల్లి గ్రామంలో 52.77 ఎకరాల మాన్యం భూమి ఉంది. వీటిలో మొత్తం సాగుభూమి 2,798 ఎకరాలు. కానీ స్వామివారికి వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రమే.

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]
  1. ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,నవంబర్-9, ఆదివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు.
  2. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు.

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం

[మార్చు]
  1. ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,నవంబర్-9, ఆదివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు.
  2. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • జస్టిస్ గోగినేని రాధాకృష్ణ - ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.
  • ఎన్. ఎస్. ప్రసాద్ - భారతీయ శాస్త్రవేత్త, తత్వవేత్త, రచయిత.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామంలో పుట్టిపెరిగిన . అవిరినేని స్నేహిత 2011 లో బి.టెక్. 86%తో ఉత్తీర్ణురాలయినది. తరువాత ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిటూట్, డిల్లీలో ఎం.బి.ఏ చదివింది. ఈమె మేక్-ఏ-డిఫరెన్స్ పోటీ నిర్వహించే హెచ్.సీ.ఎల్ ఫార్మ్ ఎక్విప్మెన్ట్ & రెంటల్ సర్వీసెస్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హెచ్.సీ.ఎల్ వారికి వివరించింది. దీని సారాంశం ఏమిటంటే: గ్రామంలో ఒక పెద్ద రైతు వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలను కొని సంస్థను ప్రారంభిస్తాడు. సంస్థలో చిన్న రైతులు తలా కొంచం పెట్టుబడులు పెట్టి భాగస్వాములవుతారు. పెద్ద రైతు రాయితీతో పరికరాలను చిన్నరైతులకు అద్దెకిస్తాడు. దీనివలన రైతులకు భారం ఉండదు. కూలీలు దొరకకపోయినా ఇబ్బందిఉండదు. ఈ వివరాలను పంపి, ఆరువేల మందికి జరిపిన ఇంటర్వ్యూలో సెలెక్టయిన 12 మందిలో ఈమె ఒకరు. తరువాత జరిగిన గ్రాండ్ ఫినాలేలో సెలక్టు అయి 5లక్షల రూపాయలు నగదు గెల్చుకొన్నది. [2]

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

గొల్లపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 240 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 40 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 223 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 36 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 187 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

గొల్లపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 34 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 8 హెక్టార్లు
  • చెరువులు: 144 హెక్టార్లు

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మామిడి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయంం వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4994. ఇందులో పురుషుల సంఖ్య 2552, స్త్రీల సంఖ్య 2442, గ్రామంలో నివాసగృహాలు 1082 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 504 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-21.

వెలుపలి లింకులు

[మార్చు]