చాముండి
చాముండి | |
దేవనాగరి: | चामुण्डा |
తెలుగు: | చాముండేశ్వరి |
నివాసం: | శ్మశానం |
మంత్రం: | ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్ఛే |
ఆయుధం: | త్రిశూలం, ఖడ్గం |
వాహనం: | గుడ్లగూబ లేదా శవం |
చాముండి, చాముండ లేదా చాముండేశ్వరి, హిందూ దేవత పార్వతీ దేవి ఉగ్ర అవతారం. ఈమె సప్తమాతృకలు లో ఒకరు. దుర్గాదేవి సైన్యంలోని 81-మంది తాంత్రిక దేవతలలో ఒక ముఖ్యమైన యోగిని. [1] చాముండ పేరు ఆమె సంహరించిన చండ, ముండ అనే ఇద్దరు రాక్షసుల కలయికతో ఏర్పడింది. ఈమెను కాళికాదేవి కి దగ్గరగా పోలుస్తారు.[2] ఈమెను కొన్నిసార్లు పార్వతి దేవిగా కొలుస్తారు. కొంతమంది జంతుబలిని ఇచ్చి, మద్యంతో సహా రావి/మర్రి చెట్టు మూలంలో పూజిస్తారు. ఈమె ప్రాథమికంగా ఆదిమవాసుల దేవతగా ప్రాచీనకాలం నుండి భక్తుల పూజలందుకుంటుంది. చాముండి మధ్య భారతదేశంలోని వింధ్య పర్వతాలలో నివసించే ముండ ప్రజల ఆరాధ్య దేవత.
సప్తమాతృకలు
[మార్చు]సప్తమాతృకలు లేదా ఏడుగురు తల్లులు లో ఒకరుగా మహాభారతం (వన పర్వం), దేవీ పురాణం, విష్ణుధర్మోత్తర పురాణం మొదలైన హిందూ గ్రంథాలలో ప్రస్థావించబడింది. సప్తమాతృకల శిల్పాలలో ఈమెను ఎల్లోరా, ఎలిఫెంటా గుహలలో చూడవచ్చును. ఈమెను ఏడుగురికి అధిపతిగా కుడివైపు చివరగా ఉంటుంది.[3] మాతృకలలో మిగిలిన వారిని వారివారి భర్తల శక్తి స్వరూపాలుగా కొలువగా ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు.[4] దేవీ పురాణంలో మాతృకలు రాక్షస సంహారంలో వినాయకునికి సహాయం చేసినట్లు పేర్కొంది.[5] మాండవ్య మహాముని పంచమాతృకలో ఒకరిగా చాముండిని పూజించాడు. వీరిని బ్రహ్మ హరిశ్చంద్రుడు పడుతున్న కష్టాలను చూచి వాటినుండి అతనిని రక్షించడానికి సృష్టించాడని చెబుతారు.[6]
దేవాలయాలు
[మార్చు]- మధ్యప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో పాలంపూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దేవి రుద్ర చాముండగా కొలువబడుతుంది.
- కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చాముండేశ్వరి కొండ మీద చాముండేశ్వరి దేవాలయం ప్రసిద్ధిచెందింది. ఇది మైసూర్ రాజ్యం వంశీకుల కులదేవతగా పూజలందుకుంది.
- తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లో జోగిపేట వైపు నుండి 5 కిలోమీటర్ల దూరంలోను, మెదక్ వైపు నుండి 30 కిలోమీటర్ల దూరంలోను చిటుకుల అనే గ్రామంలో ఉంది. ఇక్కడ చాముండేశ్వరి దేవిగా కొలువబడుతుంది.
గ్యాలరీ
[మార్చు]-
చాముండి ప్రాచీన విగ్రహం, వైఎస్ఆర్ రాష్ట్ర పురావస్తు మ్యూజియం
-
చాముండా విగ్రహం, బ్రిటిష్ మ్యూజియం. ఒరిస్సా, (సా.శ. 8వ - సా.శ. 9వ శతాబ్దం నాటిది) భారతదేశం.
-
శ్రీ చాముండా-కాంగ్రా జీ ఆలయం
-
శ్రీ చాముండా-కాంగ్రా జీ ఆలయ ప్రధన ద్వారం
-
శ్రీ చాముండా దేవీ
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Organization promoting Chamunda Mantras
- Chamunda-Devi: An Eastern Teacher to the West by Dr. Chandra Alexandre
- Shri Sachchiyay Mataji (Shri Osiya Mataji) A form (avatar) of Chamunda Devi Archived 2015-04-26 at the Wayback Machine
- Chamunda Devi Temple (Chamunda Nandikeshwar Dham), Himachal Pradesh
- http://chamundi.org/