జయం రవి
జయం రవి | |
---|---|
జననం | రవి మోహన్ 1980 జనవరి 10 తిరుమంగళం, మదురై |
వృత్తి | నటుడు |
తల్లిదండ్రులు |
|
రవి మోహన్ (జననం: 1980 జనవరి 10), తమిళ సినిమా నటుడు. తెరపేరైన జయం రవిగా ప్రసిద్ధుడు. సినిమాల్లో సంపాదకుడుగా పనిచేసి, నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించిన ఎడిటర్ మోహన్ కుమారుడు. తన అన్నయ్య మోహన్ రాజా దర్శకత్వం వహించగా, తండ్రి నిర్మించిన రొమాంటిక్ డ్రామా చిత్రం జయం (2003) తో రవి నటుడిగా చలన చిత్రరంగంలో అడుగుపెట్టాడు.
నేపథ్యం
[మార్చు]ఎడిటర్ మోహన్, వరలక్ష్మి మోహన్‌ల కుమారుడు రవి. మదురైలోని తిరుమంగళంలో జన్మించాడు.[1] అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. అన్నయ్య మోహన్ రాజా చిత్ర దర్శకుడు. అతని చిత్రాలలో చాలావరకు రవి ప్రధాన పాత్రలో నటించాడు. అతని సోదరి రోజా దంతవైద్యురాలు. రవి, చెన్నైలోని అశోక్ నగర్ లోని జవహర్ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేశాడు. భరతనాట్యం నర్తకి నళిని బాలకృష్ణన్ వద్ద నాట్యం అభ్యసించిన రవి, 12 ఏళ్ళ వయసులో తన తొలి నాట్య ప్రదర్శన చేసాడు. చెన్నైలోని లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత చిత్ర పరిశ్రమలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ సంస్థలో నటనలో శిక్షణ పొందాడు.[2] [3]
సినీ కెరీర్
[మార్చు]2003-2008: తొలి విజయం
[మార్చు]బాల్యంలో రవి, తండ్రి నిర్మించిన రెండు తెలుగు చిత్రాలు బావ బావమరిది, పలనాటి పౌరుషం లలో బాలనటుడిగా నటించాడు.[4] సోదరుడు మోహన్ రాజా దర్శకత్వం వహించగా, తన తండ్రి నిర్మించిన యాక్షన్ మసాలా చిత్రం జయంలో నటించాడు. ఇది అదే పేరుతో 2002 లో విడుదలైన తెలుగు చిత్రానికి రీమేక్. ఆ తరువాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తమిళ రీమేక్‌లో నటించాడు. ఈ సినిమాలో రవి పనితీరును సిఫీ వెబ్‌సైటులో విశ్లేషిస్తూ ఒక విమర్శకుడు, "మీరు అతనిని మరింత చూడాలనుకునేలా చేస్తాడు" అని రాసాడు.[5] ది హిందూలో మాలతీ రంగరాజన్ అతను తన పాత్రను ఆద్యంతం చక్కగా పోషించాడు అని రాసింది.[6] ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పరిగణించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ స్పెషల్ అవార్డును అందుకుంది. ఉత్తమ నటుడిగా రవి తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నాడు. [7]
అతని తదుపరి సినిమా, దాస్ (2005). అది మరొక యాక్షన్-మసాలా చిత్రం.[8] రెండు రీమేక్‌ల తరువాత అతని మొదటి ఒరిజినల్ చిత్రం అది. [9] అందులో అతడు ఫుట్‌బాల్ క్రీడాకారుడి పాత్ర పోషించాడు. [10] ఈ చిత్రం అతని మునుపటి చిత్రాల కంటే కూడా పెద్ద ఎత్తున విజయవంతమైంది. [11] సిఫీ సమీక్షకుడు అతని నటన "ఆకట్టుకునే" లా ఉందని అభివర్ణించాడు. "రవి వంద శాతం యాక్షన్ హీరో" అని పేర్కొన్నాడు. [12] ఆ సంవత్సరం విడుదలైన మరొక సినిమా మజాయ్, తెలుగు చిత్రం వర్షం యొక్క రీమేక్. ఇది ఒక మోస్తరుగా ఆడింది. [13] 2006 లో, శరణ్ దర్శకత్వంలో వచ్చిన ఇధాయ తిరుడాన్ లో నటించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. [14] [15] తరువాత, మరోసారి తన సోదరుడి దర్శకత్వంలో, మరో తెలుగు చిత్రం రీమేక్ అయిన ఉనక్కుం ఎనక్కుం లో నటించాడు. లండన్‌లో జక్సాగా జీవించే యువ ఎన్ఆర్ఐ భారతదేశంలో గ్రామీణ పరిసరాలలో భయంకరమైన పరిస్థితులలో తన ప్రేమ కోసం జీవించి పోరాడవలసి వచ్చిన పాత్రలో నటించాడు. ఇది ఘన విజయం సాధించింది.
2009 - ప్రస్తుతం: యాక్షన్, కామెడీ పాత్ర
[మార్చు]2009 లో అతను పెరన్మై అనే యాక్షన్-అడ్వెంచర్ చిత్రం లో నటించాడు. 2013 లో అమీరిన్ ఆధీ-భగవాన్ అనే యాక్షన్ చిత్రంలో నటించాడు. 2014 లో, నిమిర్ధు నిల్ అనే యాక్షన్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో జండా పై కపిరాజుగా నాని కథానాయకుడిగా, ఏకకాలంలో నిర్మించారు.
2015లో రొమాంటిక్ కామెడీ రోమియో జూలియట్, యాక్షన్-కామెడీ సకలకళా వల్లవన్, యాక్షన్-థ్రిల్లర్ తని ఒరువన్ (అతని సోదరుడు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు). స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం భూలోహం, జెండాపై కపిరాజు[16] -ఐదు చిత్రాలలో నటించాడు.
2018 లో, అతను సైన్స్ యాక్షన్ చిత్రం టిక్ టిక్ టిక్ [17], యాక్షన్-థ్రిల్లర్ అడాంగా మారులో నటించాడు.
2019 లో వచ్చిన కోమలి వినోదాత్మకమైన సినిమా[18], అది 2020లో కోమలి తెలుగులోకి అనువాదమైంది.
2021లో తాను నటించిన భూమి సినిమా విమర్శకుల ప్రశంశలు పొందింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర(లు) | గమనికలు |
---|---|---|---|
1989 | ఓరు తొట్టిల్ సభామ్ | — | బాల కళాకారుడు |
1993 | బావ బావమరిది | యువ రాజు | తెలుగు సినిమా, చైల్డ్ ఆర్టిస్ట్ |
1994 | పల్నాటి పౌరుషం | యువకుడు భీమినేని బ్రహ్మన్న | తెలుగు సినిమా, చైల్డ్ ఆర్టిస్ట్ |
2003 | జయం | రవి | |
2004 | ఎం. కుమరన్ మహాలక్ష్మి కుమారుడు | ఎం. కుమరన్ | |
2005 | దాస్ | ఆంటోనీ దాస్ | |
మజ్హై | అర్జున్ | ||
2006 | ఇధయ తిరుడన్ | మహేష్ ఆళ్వార్ | |
ఉనక్కుమ్ ఎనక్కుమ్ | సంతోష్ | ||
2007 | దీపావళి | బిల్లు ముదలియార్ | |
2008 | వెల్లి తిరై | అతనే | అతిథి పాత్ర |
సంతోష్ సుబ్రమణ్యం | సంతోష్ సుబ్రమణ్యం | ||
ధామ్ ధూమ్ | గౌతం సుబ్రమణ్యం | ||
2009 | పేరన్మై | ధురువన్ | |
2010 | తిల్లలంగడి | కృష్ణుడు | |
2011 | కో | అతనే | అతిథి పాత్ర |
ఎంగేయుమ్ కాదల్ | కమల్ | ||
2013 | ఆది భగవాన్ |
|
|
2014 | నినైతతు యారో | అతనే | అతిథి పాత్ర |
నిమిరందు నిల్ |
|
||
2015 | జెండాపై కపిరాజు | అతనే | అతిథి పాత్ర |
రోమియో జూలియట్ | కార్తీక్ | ||
సకలకళ వల్లవన్ | శక్తి | ||
థాని ఒరువన్ | ASP మిత్రన్ IPS | ||
భూలోహం | భూలోహం | ||
2016 | మిరుతన్ | ఎస్‌ఐ కార్తీక్ | |
2017 | బోగన్ | ఏసీపీ విక్రమ్ ఐపీఎస్ | |
వనమగన్ | జర (వాసి) | ||
2018 | టిక్ టిక్ టిక్ | ఎం. వాసుదేవన్ (వాసు) | |
అడంగ మారు | ఎస్‌ఐ సుభాష్ | ||
2019 | తుంబా | జాన్ | అతిధి పాత్ర |
కోమలి | రవి | ||
2021 | భూమి | భూమినాథన్ | |
2022 | పొన్నియన్ సెల్వన్: I | అరుల్మొళి వర్మన్ | |
2023 | అగిలాన్ | అగిలన్, నందా | |
పొన్నియిన్ సెల్వన్: II | అరుల్మొళి వర్మన్ | ||
ఇరైవన్ | ఏసీపీ అర్జున్ ఐపీఎస్ | తెలుగులో గాడ్ | |
2024 | సైరన్ | తిలగన్ | |
బ్రదర్† | TBA | చిత్రీకరణ | |
జెనీ † | TBA | చిత్రీకరణ | |
థగ్ లైఫ్† | TBA |
మూలాలు
[మార్చు]- ↑ "Lovable Madurai People". Ananda Vikatan. Chennai, India. 14 September 2011.
- ↑ "Jayam Ravi talks to his fans". 9 September 2008.
- ↑ "`Jayam` Ravi meets fans on".
- ↑ Ragalahari. "Jenda pai Kapiraju Audio Release Photos – Music: GV Prakash Kumar". Retrieved 10 October 2018.
- ↑ "Movie Review:M.Kumaran son of Mahalakshmi". Sify. Retrieved 18 October 2011.
- ↑ "Entertainment / Film Review : M. Kumaran Son of". Archived from the original on 12 ఫిబ్రవరి 2012. Retrieved 18 October 2011.
- ↑ cinesouth. "Dailynews – Tamilnadu State Film Awards – awards for Vikram, Jyotika". Cinesouth.com. Archived from the original on 18 ఫిబ్రవరి 2006. Retrieved 18 October 2011.
- ↑ "Daas Tamil Movie Review". IndiaGlitz. 30 July 2005. Retrieved 18 October 2011.
- ↑ "Jeyam Ravi on a hat-trick". Rediff. Retrieved 18 October 2011.
- ↑ "Interview : 'Jayam' Ravi". Behindwoods. Retrieved 18 October 2011.
- ↑ "Welcome to". Sify. 20 January 2007. Archived from the original on 20 అక్టోబరు 2012. Retrieved 18 October 2011.
- ↑ "Movie Review:Dass". Sify. Retrieved 18 October 2011.
- ↑ "Ravi's big white hope!". Sify. 5 February 2006. Retrieved 18 October 2011.
- ↑ "Arya with Saran – Tamil Movie News". IndiaGlitz. Retrieved 18 October 2011.
- ↑ "Ravi in a fix!". Sify. 17 February 2006. Retrieved 18 October 2011.
- ↑ "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
- ↑ "Tik Tik Tik: Breaking down the visual effects in India's first space film". 22 June 2018.
- ↑ "Jayam Ravi Telugu Dubbed Movies List Till 2021". cinelist.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-20.[permanent dead link]