జువ్వాడి రమాపతిరావు
జువ్వాడి రమాపతిరావు | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు | |
In office 1962 - 1967, 1967-1971 | |
అంతకు ముందు వారు | ఎం. శ్రీరంగారావు |
తరువాత వారు | ఎం. సత్యనారాయణరావు |
నియోజకవర్గం | కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం |
In office = | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1916, సెప్టెంబరు 10 సర్వారెడ్డిపల్లి, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | కౌశల్వ |
సంతానం | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తల్లిదండ్రులు | కొండల్ రావు |
జువ్వాడి రమాపతిరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు (1962-1967, 1967-1971) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
జననం, విద్య
[మార్చు]రమాపతిరావు 1916, సెప్టెంబరు 10న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, సర్వారెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు కొండల్ రావు. రమాపతిరావు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తిచేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రమాపతిరావుకు కౌశల్వతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1962-1967 మధ్యకాలంలో 3వ లోక్‌సభకు,[4] 1967-1971 మధ్యకాలంలో 4వ లోక్‌సభకు[5] పార్లమెంట్ సభ్యుడిగా పాత్రినిధ్యం వహించాడు.
నిర్వర్తించిన పదవులు
[మార్చు]రమాపతిరావు అనేక పదవులు నిర్వర్తించాడు. వాటిలో కొన్ని:[6]
- 1956-1959: ప్రైవేట్ ఉన్నత పాఠశాల (కరీంనగర్) వ్యవస్థాపకుడు, కార్యదర్శి
- ఎస్.ఆర్.ఆర్. కళాశాల (కరీంనగర్) పాలకమండలి సభ్యుడు
- హైదరాబాద్ స్టేట్ కోఆపరేటివ్ అడ్వైజరీ బాడీ సభ్యుడు
- 1956-1959: కరీంనగర్ జిల్లా ప్రణాళిక అభివృద్ధి కమిటీ సభ్యుడు
- కరీంనగర్ అద్దె కమిషన్ సభ్యుడు
- 1949-1954: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు
- గోవా విమోచన సమితి (కరీంనగర్) కార్యదర్శి
- కరీంనగర్ కోఆపరేటివ్ హౌసిర్ సొసైటీ కార్యదర్శి
- 1950: జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి
- 1958-1959: బ్లాక్ డెవలప్‌మెంట్ కమిటీ (గంగాధర, కరీంనగర్) ఉపాధ్యక్షుడు
- 1949-1950: తాలూక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
- 1960-1963: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
- 1964-1966: కరీంనగర్ జిల్లా పి&టి యూనియన్ అధ్యక్షుడు
- కరీంనగర్ ఆల్ పార్టీస్ డిఫెన్స్ కమిటీ అధ్యక్షుడు
- 1965-1966: అంచనాల కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ "Members of Third Lok Sabha". 164.100.47.193. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
- ↑ "Members of Fourth Lok Sabha". 164.100.47.193. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
- ↑ "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-24. Retrieved 2021-11-26.
- ↑ "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-26.
- ↑ "Shri Juvvadi Ramapathy Rao political profile | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.