డీజే టిల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డీజే టిల్లు
దర్శకత్వంవిమల్‌కృష్ణ
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
తారాగణంసిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ
ఛాయాగ్రహణంసాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
కూర్పునవీన్ నూలి
సంగీతంశ్రీ చరణ్‌ పాకాల
నిర్మాణ
సంస్థ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 11
దేశం భారతదేశం
భాషతెలుగు

డీజే టిల్లు (ఆంగ్లం: DJ Tillu) 2022లో తెలుగులో విడుదలయిన ప్రేమకథ సినిమా.[1] పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు విమల్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న[2],[3] [4] విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడి[5]ఫిబ్రవరి 11న విడుదలైంది.[6] డీజే టిల్లు మార్చి 4 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.[7]

బాల గంగాధర్ తిలక్ ( సిద్దు జొన్నలగడ్డ) అలియాస్ డీజే టిల్లు మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టి చివరికి డీజే అవతారమెత్తి చుట్టూ పక్కల జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ లో డీజే వాయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకసారి అనుకోకుండా క్లబ్‌లో రాధిక(నేహా శెట్టి)తో ప్రేమలో పడతాడు. అప్పటిదాకా సరదాగా, సాఫీగా సాగిపోయిన టిల్లు జీవితం రాధిక రాకతో ఊహించని మలుపులు తిరిగి ఒక హత్య కేసులో రాధికతో పాటు టిల్లు ఇరుక్కుంటాడు. ఆ హత్య చేయబడిన వ్యక్తి ఎవరు? అతనికి, రాధికకి మధ్య సంబంధం ఏంటి? ఈ హత్య కేసు నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా సినిమా కథ.[8][9]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • టిల్లు అన్నా డీ జే పెడితే , రామ్ మిరియాల , రచన: కాసర్ల శ్యామ్.
  • పటాసు పిల్లా , అనిరుద్ రవిచందర్ , రచన: కిట్టు విస్సా ప్రగడ.
  • నువ్వలా ,(మేల్ వాయిస్) సిద్దూ , రచన: రవికాంత్ పేరేపు .
  • నువ్వలా (లేడీ వాయిస్) యామిని ఘంటసాల, రచన: రవికాంత్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
  • కథ: విమల్‌కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విమల్‌కృష్ణ
  • సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల
  • నేపథ్య సంగీతం: తమన్
  • సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
  • మాటలు: సిద్ధు జొన్నలగడ్డ
  • ఎడిటర్: నవీన్ నూలి
  • సహా నిర్మాత: ధీరజ్ మొగిలినేని
  • ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కోళ్ల

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (1 January 2022). "డీజే టిల్లు ప్రేమకథ". Archived from the original on 2 జనవరి 2022. Retrieved 4 January 2022.
  2. NTV (1 January 2022). "'భీమ్లా నాయక్' కాదు వస్తోంది 'డిజె టిల్లు'!". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  3. Sakshi (2 January 2022). "సంక్రాంతి బరిలో 'డిజె టిల్లు'". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  4. Andhrajyothy (10 January 2022). "సంక్రాంతి బరి నుండి తప్పుకున్న మరో చిత్రం". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  5. NTV (10 January 2022). "కరోనాతో వెనక్కి తగ్గిన 'డిజె టిల్లు'!". Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.
  6. Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 11 February 2022. Retrieved 13 February 2022.
  7. Eenadu (27 February 2022). "ఓటీటీలో'డీజే టిల్లు'.. స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే". EENADU. Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  8. Eenadu (12 February 2022). "రివ్యూ: డీజే టిల్లు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  9. V6 Velugu (12 February 2022). "రివ్యూ: డిజె టిల్లు" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)