తిలోత్తమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిలోత్తమ
తిలోత్తమ
రవివర్మ వేసిన తిలోత్తమ చిత్రపటం
దేవనాగరిतिलोत्तमा
సంస్కృత అనువాదంతిలోత్తమ
నివాసంస్వర్గం

తిలోత్తమ ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు.[1] తిల అనగా నువ్వుల విత్తనం, ఉత్తమ అనగా మంచి లేదా అంతకంటే ఎక్కువ అని అర్థం. బ్రహ్మ కోరిక మేరకు దైవ వాస్తుశిల్పి విశ్వకర్మ ప్రతిదానిలోనూ ఉత్తమమైనది తీసుకొని తిలోత్తమను సృష్టించినట్లుగా హిందూ ఇతిహాసం మహాభారతంలో వర్ణించబడింది.[2] అసురులు (రాక్షసులు) అయిన సుందోపసుందులు మధ్య యుద్ధానికి కారణమయింది. ఇంద్రుడు వంటి దేవతలు కూడా తిలోత్తమ పట్ల ఆకర్షితులయ్యారు.[3]

జననం

[మార్చు]

మహాభారతం యొక్క ఆది పర్వంలో దైవర్షి నారదుడు, పాండవులకు అప్సరస తిలోత్తమ కారణంగా సుంద ఉపసుంద అనే రాక్షస సోదరులు మరణించిన కథను చెబుతాడు. పాండవుల మధ్య గొడవలకు ద్రౌపది కూడా ఒక కారణం కావచ్చని హెచ్చరించాడు. సుంద, ఉపసుంద ఇద్దరూ హిరణ్యకశిపుని వంశ రాక్షసుడు నికుంభ కుమారులు. రాజ్యం, మంచం, ఆహారం, ఇల్లు, సింహాసనం మొదలైనవి అన్ని వారు ప్రతిదీ పంచుకుంటూ విడదీయరాని బంధంగా కలిసివున్నారు. ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కోరికతో ఆ సోదరులు వింధ్య పర్వతాలపై తపస్సు చేసి, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు. 'తాము ఏ రూపం కోరుకుంటే ఆ రూపంలోకి మారిపోవడం, ఏ మాయ చేయాలన్నా ఆ మాయను చేయగలగడం, అన్యుల చేతుల్లో చావకుండా ఉండడం' వంటి వరాలు కోరారు. బ్రహ్మ వాటిని ప్రసాదించాడు.

పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.

బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందులు స్వర్గంపై దాడి చేసి దేవతలను తరిమికొట్టడంతోపాటు మునులను, మనుషులను వేధిస్తూ విశ్వాన్ని వినాశనం చేయడం ప్రారంభించారు.[4] దేవతలు, మునులు బ్రహ్రను ఆశ్రయించగా, బ్రహ్మ విశ్వకర్మను ఒక అందమైన స్త్రీని సృష్టించమని ఆదేశించాడు. మూడు లోకాలలో ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు.[5][6]

సందోపసుందులు వింధ్యా పర్వతాలలో ఒక నది ఒడ్డున మధువు సేవిస్తుండగా పువ్వులు తెంపుతున్న తిలోత్తమ కనిపించింది. ఆమె అందానికి మంత్రముగ్ధులైన ఆ సోదరులు వెళ్ళి తిలోత్తమ కుడి, ఎడమ చేతులను పట్టుకున్నారు. సందోపసుందులు తనకోసం పోటీపడి ఎవరు గెలిస్తే తాను వారి సొంతమని తిలోత్తమ చెప్పగా, సందోపసుందులు పోటిపడి ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అదిచూసి దేవతలు ఆమెను అభినందించారు. బ్రహ్మ ఆమెకు విశ్వంలో స్వేచ్ఛగా తిరిగేలా వరం ఇచ్చాడు. ఆమెకున్న మెరుపు కారణంగా ఎవరూ ఆమెను ఎక్కువసేపు చూడలేరని బ్రహ్మ ఆదేశించాడు.[4]

ఇతర జన్మలు

[మార్చు]

తిలోత్తమ తన మునుపటి జన్మలో కుబ్జా అనే అందవిహీనమైన వితంతువు అని పద్మ పురాణం వివరిస్తుంది. కుబ్జా ఎనిమిదేళ్లుగా పూజలు చేసిగా మరుసటి జన్మతో తిలోత్తమగా జన్మించి, స్వర్గానికి అప్సరస అయింది.[7] బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ చంద్రుని దగ్గరకు వెళ్తున్నప్పుడు బలి చక్రవర్తి మనవడు సాహసికుడు ఆపినపుడు, వారి ప్రేమవల్ల కలిగిన అల్లరితో తపోభంగమైన దుర్వాసుడు, సాహసికుడిని గాడిదగా మార్చి తిలోత్తమకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల బాణాసురుడి కూతురుగా ఉష (రాక్షసి)గా పుట్టిన తిలోత్తమ శ్రీకృష్ణుని మనవడు అనిరుద్దుడిని వివాహం చేసుకొని శాప విముక్తి పొందింది.[8]

మూలాలు

[మార్చు]
  1. తిలోత్తమ, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 80.
  2. O'Flaherty, Wendy Doniger (1981). Śiva, the erotic ascetic. Oxford University Press US. pp. 84–6, 294–5.
  3. The Iconography and Ritual of Siva at Elephanta, by Charles Dillard Collins, at pg. 86 at https://books.google.com/books?id=pQNi6kAGJQ4C&pg=PA86&dq=shiva+Tilottama&cd=5#v=onepage&q&f=false
  4. 4.0 4.1 Buitenen, Johannes Adrianus Bernardus (1978). The Mahābhārata. vol 1 University of Chicago Press Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8
  5. Of The Saivism, Volume 1 By Swami P. Anand, Swami Parmeshwaranand p. 116
  6. The Mahabharata Book 13: Anusasana Parva SECTION CXLI by Kisari Mohan Ganguli, tr.(1883-1896)
  7. Williams, George Mason (2003). Handbook of Hindu mythology. ABC-CLIO. p. 282.
  8. Wilson, H H (September–December 1833). "Analysis of the Puranas: Brahma Vaiverita". The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia. XII: 232.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తిలోత్తమ&oldid=4354458" నుండి వెలికితీశారు