Jump to content

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల

వికీపీడియా నుండి
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల
రకంక్రీడా పాఠశాల
స్థాపితం1993
డైరక్టరుకె. నర్సయ్య
విద్యాసంబంధ సిబ్బంది
23 శిక్షకులు, 29 అకాడమీలు
విద్యార్థులు409 (223 బాలురు, 186 బాలికలు)
చిరునామరాజీవ్ గాంధీ రహదారి, హకీంపేట్, తెలంగాణ, 500078, భారతదేశం
17°33′22″N 78°32′41″E / 17.556021°N 78.5448606°E / 17.556021; 78.5448606
కాంపస్నగర శివారు ప్రాంతం, 206 ఎకరాలు (83.4 హెక్టార్లు)
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల is located in Telangana
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల
Location in Telangana
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల is located in India
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల (India)

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల తెలంగాణ ప్రభుత్వంకు చెందిన క్రీడా పాఠశాల. హైదరాబాదు సమీపంలో మెదక్ జిల్లా, ఎల్దుర్తి మండలం హకీంపేట్లో ఉన్న ఈ పాఠశాలలో క్రీడల శిక్షణతో పాటు పాఠాలు కూడా బోధిస్తారు. ఎస్.ఎఫ్.ఎ. హైదరాబాద్ ఛాంపియన్‌షిప్‌లో 2017లో భారతదేశంలోనే ఉత్తమ క్రీడా పాఠశాలగా గుర్తింపుపొందింది.[1][2][3] ఈ పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయంగా 100 పతకాలు, జాతీయ స్థాయి పోటీలలో 1800కి పైగా పతకాలు సాధించారు.[4] 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి క్రీడల విభాగంలో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకుంది.[5]

ప్రాంగణం

[మార్చు]

1993లో హకీంపేట వైమానిక దళం స్టేషన్ సమీపంలో ఉన్న తూముకుంట వద్ద 206 ఎకరాలలో ఈ పాఠశాల ప్రారంభమైంది.[6] కబడీ, విలువిద్య, జిమ్నాస్టిక్స్, జూడో, వాలీబాల్, ఫుట్‌బాల్, రోయింగ్, సెయిలింగ్, కయాకింగ్, కానోయింగ్, సెపాక్ తక్రావ్, ట్రాక్, ఫీల్డ్ అథ్లెటిక్స్ మొదలైన క్రీడలలో శిక్షణ ఇస్తారు.[7][8]

ఈ పాఠశాలలో జిమ్నాస్టిక్స్ కోసం ఇండోర్ స్టేడియం, 400 మీటర్ల ట్రాక్, ఆర్చరీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, వాలీబాల్ కోర్టులు, వెయిట్ లిఫ్టింగ్ హాల్, కండిషనింగ్ హాల్ ఉన్నాయి.

అడ్మిషన్స్

[మార్చు]

ప్రతి సంవత్సరం మే నెలలో 40మంది విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఈ పాఠశాలలో 144 గదులతో హాస్టల్ సౌకర్యం ఉంది. 8 సంవత్సరాల వయస్సు విద్యార్థులను 4వ తరగతికి ఎంపిక చేస్తారు. వివిధ క్రీడలలో మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పరీక్షల ద్వారా ఎంపికలు జరుగుతాయి.[9] వారివారి ప్రతిభను బట్టి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పాఠశాలలో 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుకోవచ్చు.

పతకాలు

[మార్చు]

ఈ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు వివిధ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించారు.

  1. 2014-15 విద్యా సంవత్సరానికిగాను 17 మంది విద్యార్థులు పాల్గొని రెండు స్వర్ణం, మూడు రజితం, రెండు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలు సాధించారు.
  2. 2015-16కు గాను 14 మంది విద్యార్థులు పాల్గొని 11 స్వర్ణం, 4 రజితంతో 14 పతకాలు సాధించారు.
  3. 2016-17కు గాను 11 మంది పాల్గొని ఒక స్వర్ణం, ఐదు రజితం, రెండు కాంస్యాలతో 8 పతకాలు సాధించారు.
  4. 2017-18లో 23 మంది పాల్గొని 12 స్వర్ణం, రెండు రజితం, రెండు కాంస్య పతకాలతో 16 పతకాలు సాధించారు
  5. 2018-19 సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు పాల్గొని ఒక రజితం, ఒక కాంస్య పతకం సాధించారు.

పూర్వ విద్యార్థులు

[మార్చు]
  1. జి. సట్టి గీతం - 4x400 మీటర్లు (2004 & 2008 ఒలింపిక్స్)
  2. మనోజ్ - విలువిద్య
  3. డి. సాయి రాజ్ - థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన 2017 ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత
  4. రాగాల వెంకట రాహుల్ - 85 కిలోల వెయిట్ లిఫ్టింగ్, బంగారు పతక విజేత, కామన్వెల్త్‌ క్రీడలు - 2018
  5. వరుణ్ రాగాల - 78 కిలోల వెయిట్ లిఫ్టింగ్, బంగారు పతక విజేత, కామన్వెల్త్‌ క్రీడలు - 2018
  6. ఎర్ర దీక్షిత - కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017, గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా[3]
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల

గుర్తింపు

[మార్చు]

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ స్పోర్ట్స్‌ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది.

మూలాలు

[మార్చు]
  1. "TS Sports School sweeps SFA Hyderabad Championship". The Hans India. Retrieved 30 January 2020.
  2. AuthorTelanganaToday (18 November 2017). "Telangana Sports School bags two titles in Reliance football tourney". Telanganatoday.com. Retrieved 30 January 2020.
  3. 3.0 3.1 AuthorShiva Krishna Gundra (8 September 2017). "Deexitha delighted with surprise gold in Australia". Telanganatoday.com. Retrieved 30 January 2020.
  4. ఆంధ్రభూమి, హైదరాబాదు (8 July 2018). "క్రీడా పాఠశాలలో ముగిసిన ప్రవేశ ఎంపిక పోటీలు". andhrabhoomi.net. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.
  5. సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
  6. AuthorTelanganaToday (16 October 2020). "Physical education institute sought for Hyderabad". Telanganatoday.com. Retrieved 30 January 2020.
  7. "Telangana Sports School jr boys win". The Hans India. Retrieved 30 January 2020.
  8. AuthorShiva Krishna Gundra (25 March 2018). "Talent nurturing centres at Hyderabad". Telanganatoday.com. Retrieved 30 January 2020.
  9. ఆంధ్రజ్యోతి, నిజామాబాదు (18 June 2019). "క్రీడా పాఠశాలలో ప్రవేశానికి పోటీలు." www.andhrajyothy.com. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.