తోట త్రిమూర్తులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోట త్రిమూర్తులు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
19 నవంబర్ 2021 – ప్రస్తుతం
నియోజకవర్గం గవర్నర్‌ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 22 ఏప్రిల్ 1961
వెంకటాయపాలెం గ్రామం, రామచంద్రపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పుండరీకక్షులు, సూర్యకాంతం
జీవిత భాగస్వామి సూర్య కుమారి

తోట త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తోట త్రిమూర్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం, వెంకటాయపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించాడు. 7వ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

తోట త్రిమూర్తులు యువకుడిగా ఉన్న సమయంలోనే రాజకీయాలు పట్ల ఆసక్తి పెంచుకొని గ్రామ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తరువాత 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదుగుతూ వచ్చాడు.

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం1995 లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2004లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి 2008లో నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం వల్ల కాంగ్రెస్ లో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

2014 రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరి 2014లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014-19 వరకు జిల్లా మెట్ట సీమలో వివిధ రూపాల్లో తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా జిల్లా కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడుగా ఏదీగాడు.

తోట త్రిమూర్తులు 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు. తోట త్రిమూర్తులు 2019 సెప్టెంబరు 14లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి,[3] 2019 సెప్టెంబరు 15న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4] ఆయన 2021 జూన్ 14లో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడయ్యాడు.[5][6] ఆయన 2021 జూన్ 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7]

శాసనసభకు పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1994 రామచంద్రపురం జనరల్ గుట్టల శ్రీ సూర్యనారాయణ బాబు తెలుగుదేశం పార్టీ 34027 తోట త్రిమూర్తులు స్వతంత్ర 30923 3104 గెలుపు
1999 రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ 46417 తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 27242 19,175 గెలుపు
2004 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 45604 పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర 53160 7,556 ఓటమి
2009 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం పార్టీ 52558 పిల్లి సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ 56589 4,031 ఓటమి
2012 (ఉప ఎన్నిక) రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 77292 తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 65373 11,919 గెలుపు
2014 రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 85254 తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 68332 16,922 గెలుపు
2019 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 70,197 చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 75,365 5,168 ఓటమి
2023 మండపేట జనరల్

వివాదాలు

[మార్చు]

1996 డిసెంబరు 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నాడు. విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టులో 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడిన అనంతరం 2024 ఏప్రిల్ 16న ఈ కేసులో తోట త్రిమూర్తులుకు 18నెల‌ల జైలుశిక్ష‌తో పాటు రూ.2ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. తోట త్రిమూర్తులుతో పాటు ఈ కేసులో 9మంది నిందితులున్నారు.[8][9][10][11][12]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (14 June 2021). "AP Governor Quota MLC: గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆమోదం.. ప్రకటన విడుదల చేసిన రాజ్ భవన్ - AP governor approves nominated governor quota mlc four names". TV9 Telugu. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhrajyothy (15 June 2021). "ఎమ్మెల్సీల ఫైలుకు ఆమోదం". www.andhrajyothy.com. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  3. Sakshi (14 September 2019). "బాబూ.. గుడ్‌బై." Sakshi. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  4. The Hindu (15 September 2019). "Thota Trimurthulu joins YSRCP". The Hindu (in Indian English). Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  5. Eenadu. "నలుగురి పేర్లకు ఆమోదం". EENADU. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  6. Andhrajyothy (15 June 2021). "తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ". www.andhrajyothy.com. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  7. Sakshi (21 June 2021). "ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు". Sakshi. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
  8. A. B. P. Desam (16 April 2024). "అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  9. "శిరోముండనం కేసుపై నేడు విశాఖ కోర్టు తీర్పు.. ఉత్కంఠ". EENADU. Retrieved 2024-04-16.
  10. Andhrajyothy (16 April 2024). "28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  11. ETV Bharat News (16 April 2024). "వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలుశిక్ష". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  12. Eenadu (17 April 2024). "త్రిమూర్తులుపై వేటా.. సీటా..?". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.