దీపికారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపికారెడ్డి
దీపికారెడ్డి
తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌
In office
2022 జూలై 25 – 07 డిసెంబర్ 2023[1]
వ్యక్తిగత వివరాలు
జననం (1965-09-15) 1965 సెప్టెంబరు 15 (వయసు 58)
హైదరాబాదు, తెలంగాణ
వృత్తికూచిపూడి నృత్య కళాకారిణి, నాట్య గురువు
క్రియాశీల సంవత్సరాలు1976–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్యామ్‌గోపాల్‌ రెడ్డి
పిల్లలు(అభినవ్ రెడ్డి), (శ్లోకా రెడ్డి)
తల్లిదండ్రులువి.ఆర్‌.రెడ్డి (తండ్రి)
రాధికారెడ్డి (తల్లి)
పురస్కారాలుజాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు (2017)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం (2016)

దీపికారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి, నాట్య గరువు, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.[2] 50 సంవత్సరాల తన నృత్యజీవితంలో అనేక ప్రదన్శనలు ఇచ్చింది. కల్చరల్ అంబాసిడర్‌గా విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ అవార్డులు తెచ్చింది. గురువుగా ఔత్సాహిక కళాకారులకు శిక్షణను అందిస్తోంది. 2022, జూలై 25న తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా నియమించబడింది.[3][4][5]

జననం, విద్య[మార్చు]

దీపికారెడ్డి 1965, సెప్టెంబ‌రు 15న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జ‌న్మించింది. తండ్రి వి.ఆర్‌.రెడ్డి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. తల్లి రాధికారెడ్డి కూచిపూడి నృత్యకారిణి[6], రవీంద్ర భారతి ప్రారంభోత్సవ వేడుకలో ‘చిత్రాంగద’ కూచిపూడి బ్యాలేలో ప్రధాన పాత్ర ధరించింది. దీపికారెడ్డి తాత నూకల రామచంద్రా రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, నాలుగుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశాడు.[7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

దీపికారెడ్డికి శ్యామ్‌గోపాల్‌ రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (అభినవ్ రెడ్డి), ఒక కుమార్తె (శ్లోకా రెడ్డి) కవల పిల్లలు. కుమార్తె శ్లోక నాట్యం నేర్చుకొని, దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తోంది. కుమారుడు అభినవ్‌ టెన్నిస్‌ ఆటగాడు. ఇద్దరూ కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు.[8]

కళారంగం[మార్చు]

దీపికారెడ్డి తన 6 ఏళ్ళ వయసులోనే నృత్యరంగప్రవేశం చేసింది. 1976లో రవీంద్రభారతిలో అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. ప్రఖ్యాత నాట్యగురువు సుమతీ కౌశల్‌ దగ్గర కొంతకాలంపాటు శిక్షణ తీసుకుంది. వివాహమైన తర్వాత చెన్నై వెళ్ళి వెంపటి చినసత్యం మాస్టారు వద్ద నాట్యకళను అభ్యసించింది.[9] నృత్యరంగంలో రాణించి అక్కినేని నాగేశ్వరరావు చేతులతోనే ‘స్వర్ణకంకణం’ తొడిగించుకున్నది.

నృత్య దర్శకురాలిగా కోవిడ్, ప్రకృతి రక్షతి రక్షితః, రాంగ్, శివ సత్యం, శాంతి జీవనం, జయోస్తు కూచిపూడి, స్త్రీ త్రయం, త్యాగరాజ భక్తి వైభవం, ఆంధ్రము, గృహకల్పం, తెలంగాణ వైభవం, రీతు సంహార, నమస్కార్, షణ్మతం, ఓడ్ టు ఘంటసాల, వందన, స్వాగతంజలి, తేజస, వైద్యో నారాయణో హరిహి, దర్శనీయ హైదరాబాద్, తెలంగాణ సాహితీ సౌరభం, ప్రతిసంధి రామాయణం, రుక్మిణి కృష్ణ వంటి నృత్యరూపాలను రూపొందించి ప్రదర్శించింది. నాట్య ఇళవరసి, నాట్య విశారద, పంచరత్న మహిళా పురస్కారం, కళాతరంగ్, రాష్ట్రీయ వికాస్ శిరోమణి, నాట్య మణి వంటి బిరుదులు కూడా పొందింది.

ఢిల్లీలో ‘ద్రౌపది’ ప్రదర్శన ఇచ్చింది. ఖజురహో, కోణార్క్, హంపీ, చిదంబరం, మహాబలిపురం, ముద్ర, చాళుక్య వంటి ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి నాట్యోత్సవాల్లో ప్రదర్శనలతోపాటు సాంస్కృతిక రాయబారిగా ప్రభుత్వం తరఫున మాస్కో, ఫ్రాన్స్‌, అమెరికా, దక్షిణ కొరియా, బ్యాంకాక్‌ దేశాల్లో శిష్యులతో కలిసి స్వీయ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది.

కొవిడ్‌ సమయంలో తన కూతురుతో కలిసి, ఇంట్లోనే రికార్డు చేసి కొద్దిపాటి నిడివితో ‘ట్రైబ్యూట్‌ టు హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌’ బ్యాలే చేసింది. ఆ వీడియోను పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతోపాటు, తెలుగు, ఇంగ్లిష్‌ చానల్స్‌ కూడా ప్రసారం చేశాయి. ఒక కాన్ఫరెన్స్‌లో ‘నమస్కార్‌ ఇండియా’ పేరుతో భారతీయ సంప్రదాయ నృత్యరీతులన్నీ ప్రదర్శించింది.[10]

డ్యాన్స్ ఇన్స్టిట్యూట్[మార్చు]

కూచిపూడి నృత్యాన్ని తదుపరి తరానికి అందించాలనే ఉద్దేశంతో దీపికారెడ్డి 2000లో దీపాంజలి అనే సంస్థను స్థాపించింది.[11] కేంత్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. పలువురు విద్యార్థులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. దీపికారెడ్డి దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు సిసిఆర్టీ స్కాలర్‌షిప్‌లు, దూరదర్శన్ ద్వారా గ్రేడ్‌లు కూడా పొందారు.[12]

సంగీత నాటక అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా గా[మార్చు]

కుచిపూడి నాట్య‌కారిణిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా కొన‌సాగుతున్న దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత‌, నాట‌క అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా నియామిస్తూ 2022 జూలై 25న తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబరు 165 ద్వారా ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2022, ఆగస్టు 4న చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్యతలు స్వీకరించిన దీపికారెడ్డి, రెండేళ్ళపాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగనుంది.[13][14]

దీపికారెడ్డి ఆధ్వర్యంలో 2023 ఏప్రిల్ 6,7,8 తేదీలలో రవీంధ్రభారతి వేదికగా 'యవనిక-2023' పేరుతో మూడు రోజులపాటు నాటకోత్సవం నిర్వహించబడింది.[15]

పురస్కారాలు[మార్చు]

నృత్యరంగంలో దీపికారెడ్డి అనేక అవార్డులను అందుకున్నది. వాటిలో కొన్ని:

  • 2017లో నాటి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డు
  • 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం
  • 2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర కళారత్న అవార్డు
  • 2011లో అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణ కంకణం
  • 1995లో ఢిల్లీ తెలుగు అకాడమీ ద్వారా రాష్ట్రీయ వికాస్ శిరోమణి
  • 2011 రోటరీ ఉమెన్స్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు
  • 2016లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం
  • 2016లో వంశీ ఆర్ట్స్ తెలంగాణ కళారత్న పురస్కారం
  • 2021లో డిఐసిసిఐ తెలంగాణ మహిళా దినోత్సవ అవార్డు - 2021
  • 2000లో కూచిపూడి ఆర్ట్ అకాడమీ ద్వారా నాట్య విశారద
  • దూరదర్శన్ ద్వారా ధ్రువీకరించబడిన "ఎ-టాప్ గ్రేడ్" ఆర్టిస్ట్

నిర్వర్తించిన పదవులు[మార్చు]

  • ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఎంపిక కమిటీ సభ్యురాలు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి సభ్యురాలు
  • ప్రాంతీయ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలు
  • రాష్ట్ర నంది సినిమా అవార్డుల సభ్యురాలు
  • కల్చరల్ కమిటీ మాజీ చైర్‌పర్సన్
  • అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సభ్యురాలు
  • తెలంగాణ రాష్ట్ర అవార్డుల ఎంపిక కమిటీ సభ్యురాలు
  • దూరదర్శన్ గ్రేడేషన్ కమిటీ సభ్యురాలు

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Correspondent, Special (2019-02-07). "Deepika Reddy receives Sangeet Natak Akademi award". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Archived from the original on 2019-02-07. Retrieved 2023-02-03.
  3. correspondent, dc (2022-07-26). "Kuchipudi dancer Deepika Reddy appointed chairperson of Sangeeta Nataka Academy". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-03. Retrieved 2023-02-03.
  4. telugu, NT News (2022-07-25). "రాష్ట్ర సంగీత‌, నాట‌క అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా దీపికా రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
  5. Namasthe Telangana (5 August 2022). "భావితరాలకు మన కళలను అందిద్దాం". Archived from the original on 7 August 2022. Retrieved 7 August 2022.
  6. "Want to give youth the chance to showcase their talent: Deepika Reddy". The New Indian Express. Archived from the original on 2022-07-26. Retrieved 2023-02-03.
  7. అయినంపూడి, శ్రీలక్ష్మి (2023-01-13). "సకలజన బాంధవుడు నూకల". www.ntnews.com. Archived from the original on 2023-01-13. Retrieved 2023-02-03.
  8. Velugu, V6 (2022-07-25). "రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్గా దీపికారెడ్డి". V6 Velugu. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Nadadhur, Srivathsan (2018-06-21). "'I couldn't have done it on my own', says Deepika Reddy on winning Sangeet Natak Akademi award". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2018-06-25. Retrieved 2022-07-25.
  10. telugu, NT News (2022-07-28). "తాతయ్య స్ఫూర్తితోనే ఈ స్థాయికి వ‌చ్చా.. నా స‌క్సెస్‌కి ఆయ‌నే కార‌ణమంటున్న దీపికా రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-07-28. Retrieved 2022-07-28.
  11. Sakshi (11 February 2019). "విదేశీ వేదికపై తెలుగు సంస్కృతీ వారధి". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  12. Jun 25, Suhas Yellapantula / TNN /; 2018; Ist, 06:00 (2018-06-25). "There's so much to give and share through classical dance and that's what makes it fulfilling: Deepika Reddy | Hyderabad News - Times of India". The Times of India. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  13. telugu, NT News (2022-08-05). "భావితరాలకు మన కళలను అందిద్దాం". Namasthe Telangana. Archived from the original on 2022-08-05. Retrieved 2022-08-05.
  14. Velugu, V6 (2022-08-04). "నాట్యాన్ని జిల్లాల్లో ఉండే పిల్లల వరకూ తీసుకెళ్తా". V6 Velugu. Archived from the original on 2022-08-04. Retrieved 2022-08-04.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  15. telugu, NT News (2023-04-07). "సమాజాన్ని ప్రశ్నించేది నాటకం". www.ntnews.com. Archived from the original on 2023-04-07. Retrieved 2023-04-15.