నర్సంపేట రెవెన్యూ డివిజను
నర్సంపేట రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
నర్సంపేట రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. వరంగల్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నర్సంపేట పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం, నర్సంపేట శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]నర్సంపేట డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | నర్సంపేట రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | నర్సంపేట మండలం | 16 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
2 | చెన్నారావుపేట మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
3 | నల్లబెల్లి మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
4 | దుగ్గొండి మండలం | 17 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
5 | ఖానాపూర్ మండలం | 10 రెవెన్యూ గ్రామాలు |
6 | నెక్కొండ మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-19.
- ↑ "List of Revenue Divisions, Mandals in Warangal District". TeachersBadi. 2022-03-01. Archived from the original on 2021-05-15. Retrieved 2022-05-19.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-05-19.