పంపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక చేతి పంపు
మీటరింగ్ పంప్ హెడ్ లోపల ఇది ఎలా పనిచేస్తుందో చూపించే రేఖాచిత్రం. పంపు హెడ్ లోపల పిస్టన్ ముందుకు వెనుకకు కదిలే విధానం.

పంపు అనగా యంత్రం, ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ద్రవాలను లేక వాయువులను తరలిస్తాయి. పంపులు తరుచుగా ద్రవాలను ఊర్థ్వముఖంగా తరలిస్తాయి. పంపులు అనేక రకాలు ఉన్నాయి. పంపు పనిచేయడానికి ఒక రకమైన శక్తి అవసరం. కొన్నిసార్లు వాటికి కావలసిన శక్తి వ్యక్తి నుండి వస్తుంది. కొన్నిసార్లు విద్యుత్ మోటారు నుండి వస్తుంది[1].

వివిధ రకాల పంపులు

[మార్చు]

ఆర్కిమెడిస్ మర పంపు

[మార్చు]

ప్రధాన వ్యాసం ఆర్కిమెడిస్ మర పంపు

ఆర్కిమెడిస్ మరచుట్టు చేతితో నడుపబడుతుంది, సమర్ధంగా నీటిని పైకి తెస్తుంది

మర పంపు దీనిని ఆర్కిమెడిస్ స్క్రూ అని కూడా అంటారు, ఇది ఒక యంత్రం. పల్లములో నున్న నీటిని మిట్టనున్న సాగునీటి కాలువలలోకి తరలించేందుకు ఈ మర పంపు యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మర గొట్టం లోపల పూర్తిగా గట్టిగా బిగించబడి ఉంటుంది. మర పంపు అడుగు భాగం నీటిలో మునిగి ఉంటుంది, ఈ మరను తిప్పినప్పుడు మర మీద నీరు పైకి ప్రవహిస్తూ బయటకు చిమ్ముతుంది. ఈ మర చేతితో, లేదా గాలి మరతో, లేదా ఇంజిన్‌తో తిప్పబడుతుంది. ఈ మరను తరచుగా సాగునీటి కాలువలను నింపేందుకు ఉపయోగిస్తారు.

ఇండియా మార్క్ II

[మార్చు]

ప్రధాన వ్యాసం ఇండియా మార్క్ II
ఇండియా మార్క్ II అనగా మానవ శక్తితో నడిచే పంపు, దీనిని 50 మీటర్లు లేదా అంతకు తక్కువ లోతుల నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. మార్క్ II ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి చేతి పంపు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలోని గ్రామాలలో నీటి అవసరాలను తీర్చడానికి 1970 లో ఈ పంపును రూపొందించారు. ఈ పంపును బోరు బావి మీద బిగిస్తారు. ఈ పంపు యొక్క హ్యాండిల్ ను పదేపదే పైకి కిందకి కదిలించడం ద్వారా బావిలో దిగువన ఉన్న నీరు పైకి వస్తుంది.

కాయిల్ పంపు

[మార్చు]

ప్రధాన వ్యాసం కాయిల్ పంపు

కాయిల్ పంపు నమూనా

కాయిల్ పంపు అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది కాయిల్ (చుట్ట) ఆకారంలో ట్యూబ్ (గొట్టం) ను కలిగి ఉంటుంది, ఇది ఇరుసుతో పాటుగా తిరుగునట్లు ఇరుసుకు అమర్చబడి ఉంటుంది. ఈ కాయిల్ పంపును ఇంజను శక్తితో లేదా జంతువు శక్తితో పనిచేయిస్తారు. ఇరుసు వేగంగా తిరిగినపుడు కాయిల్ పంపు కూడా వేగంగా తిరిగి సమర్ధంగా పనిచేస్తుంది. ఇది తిరుగుతున్నప్పుడు ట్యూబ్ ద్వారా నీటిని తీసుకొని నీటిని పైకి చేర్చేందుకు అమర్చబడిన మరొక పైపుకి పంపిస్తుంది, ఈ పైపులో నుంచి నీరు పైకి వస్తుంది.

గొలుసు పంపు

[మార్చు]

ప్రధాన వ్యాసం గొలుసు పంపు

గొలుసు పంపు

గొలుసు పంపు అనగా ఒక రకమైన నీటి పంపు, ఇది ఒక అంతులేని గొలుసు, దీనికి దబర వంటి అనేక వృత్తాకార పాత్రలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఉంటాయి. గొలుసు యొక్క ఒక భాగం నీటిలోకి మునిగి ఉంటుంది, ఈ గొలుసు ఒక చక్రం ద్వారా లేదా రెండు చక్రాల ద్వారా నీళ్ళలోంచి గట్టు వద్దకు నడిపించబడుతుంది. ఈ గొలుసుకు అమర్చబడిన పాత్రలు గొలుసుతో పాటు తిరుగుతుంటాయి, ఈ పాత్రలు నీటిలోకి మునిగినప్పుడు నీటిని నింపుకునే విధంగా, గట్టు వద్దకు వచ్చినప్పుడు పారబోసే విధంగా అమర్చబడి ఉంటాయి. అందువలన ఈ గొలుసు తిరిగినపుడు దీనికున్న పాత్రలు పల్లంలోనున్న నీటివనరు లోపలికి మునిగి నీటిని నింపుకొని గట్టునున్న కాలువలకు చేరవేస్తాయి. ఈ చైన్ పంపులను ప్రాచీన మధ్య ప్రాచ్యం, ఐరోపా, చైనా, ప్రాచీన ఈజిప్ట్ లలో శతాబ్దాలుగా ఉపయోగించారు.[2]

చుట్ట పంపు

[మార్చు]

ప్రధాన వ్యాసం చుట్ట పంపు

చుట్ట పంపు అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది రింగులు, రింగులుగా చుట్టబడిన పైపుతో చక్రం వలె ఉంటుంది. దీనిని ఆంగ్లంలో స్పైరల్ పంప్ అంటారు. ఈ చుట్ట పంపు చక్రం వలె తిరుగుతున్నపుడు మొదలు నీటిలో మునుగుతూ కొంత నీటిని తీసుకొని పై వైపుకి చేరినపుడు ఆ నీరు మరొక రింగులోకి చేరుతుంది, ఈ విధంగా చుట్ట పంపు తిరుగుతున్నపుడు మొదలు నుంచి మరొక రింగ్ లోకి, ఆ రింగ్ లో నుంచి మరొక రింగ్ లోకి అలా అలా అన్ని రింగ్ లలోకి నీరు చేరుతూ చుట్ట పంపు మధ్యగా నున్న పైపు చివరి నుంచి నీరు బయటికి వస్తుంది. ఈ స్పైరల్ పంపు ప్రవేశద్వారం నీటిని తీసుకునేందుకు ఆ నీటిని మధ్య నున్న బాహ్య కుహరం ద్వారా పై భాగానున్న నీటి సరఫరా గొట్టానికి అందించేందుకు ఈ పంపు మధ్య భాగం నీటివనరుకు ఎత్తుగా ఉండేటట్లు ప్రవేశ కుహరంలో నీరు చేరేందుకు కొంత భాగం నీటివనరులో మునిగేట్లు నిలువుచక్రంగా బిగించబడివుంటుంది.

చేతి పంపు

[మార్చు]

ప్రధాన వ్యాసం చేతి పంపు

చేతి పంపులు అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి, యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో, విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం, నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.

జలరాట్నం

[మార్చు]

ప్రధాన వ్యాసం జలరాట్నం

జలరాట్నం అనగా నీటిని పైకి తోడే రాట్నం ఆకారం కలిగిన ఒక యంత్రం, ఇది నీటిపై తిరుగుతూ నీటిపై కృత్రిమంగా నిర్మించబడిన కాలువలోకి నీరును సరఫరా చేస్తుంది, ఈ కాలువను ఆంగ్లంలో ఆక్విడెక్ట్ అంటారు. జలరాట్నాన్ని ఆంగ్లంలో నోరియా అంటారు, దీనిని సాగునీటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ట్రెడల్ పంపు

[మార్చు]

ప్రధాన వ్యాసం ట్రెడల్ పంపు
ట్రెడల్ పంపు అనగా మానవ శక్తితో నడిచే చూషణ పంపు, ఇది బావి యొక్క పైభాగాన ఉంటుంది. ట్రెడల్ అనగా కాలితో తొక్కుటవల్ల పని చేయు యంత్ర భాగం. ట్రెడల్‌ను కాలుతో తొక్కుతూ ఈ పంపును పనిచేయిస్తారు. ట్రెడల్ పంపు నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు. దీనిని ఏడు మీటర్లు లేదా అంతకు తక్కువ లోతు నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. ట్రెడల్ ను పైకి క్రిందికి తొక్కడం ద్వారా ఈ పంపు పనిచేస్తుంది, తద్వారా దీనిలోని మీటలు, డ్రైవ్ పిస్టన్లు భూగర్భజలాన్ని చూషణ పద్ధతిలో ఉపరితలానికి లాగుతాయి.

తాడు పంపు

[మార్చు]

ప్రధాన వ్యాసం తాడు పంపు

తాడు పంపు అనగా పంపు యొక్క ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక తాడు ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి గుండా పైకి వచ్చి మొదలు, చివరలు లేకుండా ఒక తాడు గానే కలిసి ఉంటుంది. దీనికి అమర్చే గిలక చక్రం తాడును సులభంగా సౌకర్యంగా తిప్పేందుకు పైపు వ్యాసానికి మధ్యగా ఉండేలా, మరొక వైపు ఏవి తగలకుండా సాఫీగా లోపలి వెళ్లేలా అమర్చుకోవాలి. తాడు పంపులు తరచుగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు, వీటి రూపకల్పనలో సాధారణంగా PVC పైపులను, అదృఢ లేదా దృఢమైన కవాటాలు కలిగిన ఒక తాడులను ఉపయోగిస్తారు [3].

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Pump classifications. Fao.org. Retrieved on 2011-05-25.
  2. Tanzania water Archived 2012-03-31 at the Wayback Machine blog - example of grass roots researcher telling about his study and work with the rope pump in Africa.
  3. Welcome to the Hydraulic Institute Archived 2011-07-27 at the Wayback Machine. Pumps.org. Retrieved on 2011-05-25.

ఇతర పఠనాలు

[మార్చు]
  • Australian Pump Manufacturers' Association. Australian Pump Technical Handbook, 3rd edition. Canberra: Australian Pump Manufacturers' Association, 1987. ISBN 0-7316-7043-4.
  • Hicks, Tyler G. and Theodore W. Edwards. Pump Application Engineering. McGraw-Hill Book Company.1971. ISBN 07-028741-4
  • Karassik, Igor, ed. (2007). Pump Handbook (4 ed.). McGraw Hill. ISBN 9780071460446.
  • Robbins, L. B. "Homemade Water Pressure Systems". Popular Science, February 1919, pages 83–84. Article about how a homeowner can easily build a pressurized home water system that does not use electricity.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పంపు&oldid=2924163" నుండి వెలికితీశారు