పలాస 1978

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పలాస 1978
పలాస 1978 సినిమా పోస్టర్
దర్శకత్వంకరుణ కుమార్
రచనకరుణ కుమార్
నిర్మాతధ్యాన్ అట్లూరి, మీడియా 9 మనోజ్ (సహ నిర్మాత)
తారాగణంరక్షిత్ అట్లూరి, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్ మీసాల, శృతి, జగదీష్
ఛాయాగ్రహణంఅరుల్ విన్సెంట్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంరఘు కుంచె
నిర్మాణ
సంస్థ
సుధాస్ మీడియా
పంపిణీదార్లుసురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2020 మార్చి 6 (2020-03-06)[1]
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పలాస 1978 అనేది 2020, మార్చి 6న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధాస్ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మాణ సారథ్యంలో కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్ మీసాల, శృతి, జగదీష్ నటించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించాడు.[3]

కథా నేపథ్యం[మార్చు]

పలాసలో ఓ కళాకారుల కుటుంబానికి చెందిన రంగారావు (తిరువీర్‌), మోహన్‌రావు (రక్షిత్‌) తండ్రి నేర్పిన కళను జీవనంగా చేసుకొని జీవితం సాగిస్తుంటారు. ఇదే కులానికి చెందిన భైరాగి అదే ఊళ్లో పెద్ద షావుకారు (జనార్దన్‌) దగ్గర పనిచేస్తుంటాడు. భైరాగి అండతో పెద్ద షావుకారు, తన తమ్ముడు చిన్న షావుకారు (రఘు కుంచె)తో వైరం పెంచుకుంటాడు. ఒకసారి థియేటర్‌కి వెళ్లిన ఆడవాళ్లతో పెద్ద షావుకారు కొడుకు అసభ్యంగా ప్రవర్తించడంతో మాటామాటా పెరిగి, కొట్లాటగా మారి షావుకారు కొడుకు రంగారావు మీద చేయి చేసుకుంటాడు. దాంతో రంగారావు, మోహన్‌రావు ఇద్దరూ కలిసి కాపుగాసి షావుకారు కొడుకును కొడతారు. తమని చంపడానికి ప్రయత్నించిన భైరాగిని కూడా చంపేస్తారు. అప్పటినుంచి వీరిని చిన్న షావుకారు చేరదీస్తాడు. అతను రాజకీయంగా ఎదగడానికి ఈ అన్నదమ్ములు సాయం చేస్తుంటారు. కొన్నిరోజుల తరువాత చిన్న షావుకారుకి, రంగారావుకీ వచ్చిన గొడవతో రంగారావు, మోహన్‌రావులు విడిపోతారు. రంగారావు పెద్ద షావుకారు దగ్గర, మోహన్‌రావు చిన్న షావుకారు దగ్గర చేరుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాల మధ్య ఒకానొక సందర్భంలో ఇద్దరు అన్నదమ్ములూ ఒకటవుతారు, షావుకారు కుటుంబం కూడా ఒకటవుతుంది. షావుకారు కుటుంబానికి, అన్నదమ్ములకు మధ్య జరిగిన గొడవలో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.[4][5]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఏ ఊరు ఏ ఊరే (విజయలక్ష్మి & రాజు జముకు అసిరయ్య)
  2. నక్కిలీసు గొలుసు (రఘు కుంచె)
  3. ఓ సొగసరి (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పసల బేబి)
  4. బావొచ్చాడు ఓ లప్ప (అదితి భావరాజు)
  5. కళావతి కళావతి (రమ్య బెహరా & రఘు కుంచె)
  6. చింతచెట్టు కింద (సంధ్య కొయ్యాడ)
  7. నవనీలోత్పల పద్యం (గోవిందరాజులు)

విడుదల - స్పందన[మార్చు]

ఈ చిత్రం 2020, మార్చి 6న విడుదలయింది. విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.[6]

రేటింగ్

మూలాలు[మార్చు]

  1. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
  3. సాక్షి, సినిమా (6 March 2020). "'పలాస 1978' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
  4. The Hindu, Entertainment (6 March 2020). "'Palasa 1978' movie review: The strong script makes it a compelling watch". Y. Sunita Chowdhary. Archived from the original on 7 March 2020. Retrieved 13 March 2020.
  5. ఎన్ టివి, రివ్యూలు (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
  6. నమస్తే తెలంగాణ, సినిమా (6 March 2020). "'పలాస 1978' రివ్యూ." Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
  7. Times of India, Entertainment (6 March 2020). "Palasa 1978 Movie Review: Not your run-of-the-mill crime drama". Paturi Rajasekhar. Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
  8. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (6 March 2020). "'ప‌లాస 1978' మూవీ రివ్యూ". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పలాస_1978&oldid=3996943" నుండి వెలికితీశారు