Jump to content

పాలకొండ

అక్షాంశ రేఖాంశాలు: 18°36′N 83°45′E / 18.6°N 83.75°E / 18.6; 83.75
వికీపీడియా నుండి
పట్టణం
పటం
Coordinates: 18°36′N 83°45′E / 18.6°N 83.75°E / 18.6; 83.75
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం జిల్లా
మండలంపాలకొండ మండలం
విస్తీర్ణం
 • మొత్తం6.50 కి.మీ2 (2.51 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం20,760
 • జనసాంద్రత3,200/కి.మీ2 (8,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1062
ప్రాంతపు కోడ్+91 ( 08941 Edit this on Wikidata )
పిన్(PIN)Edit this at Wikidata
WebsiteEdit this at Wikidata

పాలకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.

చరిత్ర

[మార్చు]
పాలకొండ వద్ద తూర్పు కనుమలు

పాలకొండ సంస్థాన చరిత్ర

[మార్చు]

మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం జిల్లాలో సిక్కోలు ప్రాంతమునందు కొండజమీందారులతో పాలకొండ సంస్థానము వుండేది. 108 జిరాయితీ గ్రామములు, 68 వ్యవసాయ గ్రామములు,49 అగ్రహారములు విస్తీర్ణము కలిగినది. వీరు విజయనగర సంస్థానమునకు లోబడి యుండి యుద్ధ సమయంలో సహకరించుటయే కాకుండా సంవత్సరానికి 52 వేల రూపాయలు కప్పము కూడా చెల్లించేవారు.

పాలకొండ సంస్థాన పాలకులు కోదు లేక జాతాపు అను కొండజాతి వారు. జయపుర సంస్థాన పాలకుడు రాజా విశ్వంభరదేవు ( 1672 -1676 ) ఈ కుటుంబము వారి మూలపురుషుడు అయిన 'దన్నాయి' కుమారుడిని నరేంద్రనాయుడు అను బిరుదుతొ పాలకొండ, వీరఘట్టములకు జమీందారుగా నియమించాడు. విజయరామరాజు (-1796), సీతారామరాజు (1796-1798), వెంకటపతిరాజు (1798-1828 ) సంస్థాన భాద్యతలను నిర్వహించారు. మైనరగు కూర్మరాజనరేంద్రరావుని వారసునిగా 1829 లొ కంపెనీ వారు గుర్తించి రాజాగారి వితంతు భార్యయగు చామలయ్యను ఎష్టేటు మేనేజర్ గా నియమించి ప్రభుత్వ పర్యవేక్షణలోనికి వచ్చినది. తదుపరి పద్మనాభాచార్యులను సంరక్షకునిగా నియమించారు. నిర్వహణ సరిగా లేక 1831లొ కూర్మరాజు మేజరు అయ్యేసరికి 93 వేల రూపాయలు కప్పము బకాయిలు ఉన్నాయి. 1837 లొ కూర్మరాజును జమీందారీ నుండి తప్పించి 1846 వరకూ కలెక్టర్ అజమాయిషీలొ జమీందారీ పాలన సాగింది. తదుపరి జమీందారీని అర్భత్ నాట్ కంపెనీకి కవులునకు ఇచ్చారు మరికొంతకాలానికి ప్రభుత్వ పరమైనది. బ్రిటిష్ కంపెనీ వారు పాలకొండ జమీందారీ కుటుంబమునందు ముఖ్యపరివారమును ఖైదుచేసి రాయవేలూరు కొటయందు నిర్భందించారు. కూర్మరాజు నకు మరణశిక్ష నిర్ణయించి తదుపరి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 1843 లొ కూర్మరాజు గుత్తి కోటయందు మరణించాడు. 1869 లొ మద్రాసు గవర్నర్ రాయవేలూరు సందర్శించినపుడు పాలకొండ కుటుంబ సభ్యులను పరామర్శించి  విజయరామరాజును విడుదల చేసి కృష్ణానదీ తీరమునందు నివాసం చేయవచ్చునని ఉత్తర్వులు జారీ చేశాడు. కంపెనీ వారు భత్యాన్ని నెలకు 17 రూపాయలనుండి 250 రూపాయలు వరకూ పెంచారు. పాలకొండ వంశస్థులు 20వశతాబ్దానికి ముందే రాయవేలూరు కోటయందు మరణించారు.[2]

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రమైన పార్వతీపురానికి ఆగ్నేయంగా 48 కి.మీ. దూరంలో వుంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 74,972 - పురుషులు 36,871 - స్త్రీలు 38,101 [3]

పరిపాలన

[మార్చు]

పాలకొండ నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.. దీనికి 2014 ఎన్నికలలో జరిగిన ఎన్నికలలో YSRCP విజయం సాధించింది.

రవాణా సదుపాయాలు

[మార్చు]

శ్రీకాకుళం - పార్వతీపురం రహదారి పై పట్టణం వుంది. సమీప రైల్వే స్టేషన్లు 28 కి.మీ దూరంలో గల ఆముదాలవలస.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. తూమాటి, దొణప్ప. ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము. ఆంధ్ర విశ్వవిద్యాలయం.
  3. "District Census Handbook-Srikakulam" (PDF). Census of India. pp. 26–28, 54. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పాలకొండ&oldid=4004459" నుండి వెలికితీశారు