Jump to content

పురిటిగడ్డ

అక్షాంశ రేఖాంశాలు: 16°7′26.616″N 80°53′25.296″E / 16.12406000°N 80.89036000°E / 16.12406000; 80.89036000
వికీపీడియా నుండి
పురిటిగడ్డ
పటం
పురిటిగడ్డ is located in ఆంధ్రప్రదేశ్
పురిటిగడ్డ
పురిటిగడ్డ
అక్షాంశ రేఖాంశాలు: 16°7′26.616″N 80°53′25.296″E / 16.12406000°N 80.89036000°E / 16.12406000; 80.89036000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంచల్లపల్లి
విస్తీర్ణం3.47 కి.మీ2 (1.34 చ. మై)
జనాభా
 (2011)
2,034
 • జనసాంద్రత590/కి.మీ2 (1,500/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,009
 • స్త్రీలు1,025
 • లింగ నిష్పత్తి1,016
 • నివాసాలు646
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521126
2011 జనగణన కోడ్589746

పురిటిగడ్డ, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చల్లపల్లి నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 646 ఇళ్లతో, 2034 జనాభాతో 347 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1009, ఆడవారి సంఖ్య 1025. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 554 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 54. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589746.[2]

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నడకుదురు, రాముడుపాలెం, నాదెళ్ళవారి పాలెం, మేకావారిపాలెం, నిమ్మగడ్డ, వక్కలగడ్డ, యార్లగడ్డ, వెలివోలు గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి చల్లపల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చల్లపల్లిలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  1. ఈ పాఠశాలలో 2013,ఏప్రిల్-22, సోమవారం నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, తెలుగు పండితులు అయిన దాత శ్రీరామకవచం శ్యామసుందరం, తన భార్య బాలాత్రిపురసుందరి ఙాపకార్ధం, ఈ విగ్రహం ఏర్పాటుచేశారు.
  2. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న 11 మంది విదార్ధినీ విద్యార్థులు, 2013-14 వ సంవత్సరానికి, జాతీయ ప్రభుత్వ ఉపకారవేతనాలకు అర్హత సంపాదించారు.
  3. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి అయిన పెరిక యుగంధరబాబు, 2014-మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలలో, 9.5 గ్రేడ్ మార్కులు సాధించి, ఐ.ఐ.ఐ.టి.లో సీటు సంపాదించాడు. ఇతడు ఇంటరు నుండి బి.టెక్. వరకు ఇక్కడ ఉచితంగా విద్యనభ్యసించగలడు.
  4. ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన రాజులపాటి లీలాంబిక, లుక్కా నాగజ్యోతి, జంపాన వంశీ కృష్ణశ్రీ అను ముగ్గురు విద్యార్థినులు, నూజివీడు ఐ.ఐ.ఐ.టి.లో సీట్లు సంపాదించారు. వీరు ఇంటరు నుండి బి.టెక్. వరకు అక్కడ ఉచితంగా విద్యనభ్యసించగలరు.
  5. ఈ పాఠశాలో ప్రవాస భారతీయులైన దాతల ఆర్థిక సహకారంతో, 2015, ఆగస్టు-11వ తేదీనాడు, డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పురిటిగడ్డలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పురిటిగడ్డలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పురిటిగడ్డలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 293 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 40 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 11 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 12 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పురిటిగడ్డలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.కె.యి.బి.కెనాల్. (కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కెనాల్) = కృష్ణా తూర్పు కరకట్ట కాలువ. దీనిని స్థానికంగా ప్రజలు, "కరువు కాలువ" అని పిలుస్తారు.  

  • కాలువలు: 12 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పురిటిగడ్డలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అరటి, మినుము

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[3]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలం

[మార్చు]

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

తపాలా సౌకర్యం

[మార్చు]

ఈ వూరికి పోస్టాఫీస్ నడకుదురులో ఉంది.

రెవెన్యూ కార్యాలయం

[మార్చు]

పురిటిగడ్డ గ్రామ ప్రధాన కూడలిలో 2013,మార్చి-14న రెవెన్యూ కార్యాలయం ప్రారంభించారు. స్థానికంగా ఉన్న భూసమస్యలు, పొలాలకు సంబంధించిన శిస్తులు చెల్లించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రెవెన్యూపరంగా తెలియజేసే అవకాశం గ్రామస్తులకు కలుగుతుంది.

బ్యాంకులు

[మార్చు]

ఈ గ్రామంలో ఇండియన్ బ్యాంకు శాఖ ఉంది..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

[మార్చు]

ఈ గ్రామంలో నూతనంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నిర్మాణం పూర్తి అయినది. 2015,ఆగస్టు-26న ప్రారంభోత్సవం నిర్వహించెదరు. ఇంకనూ ఈ కేంద్రానికి రహదారి అభివృద్ధి, త్రాగునీరు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటుచేయవలసియున్నది. చల్లపల్లి మండలంలో మంజూరైన ఏకైక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇది. ఈ కేంద్రానికి 80 సెంట్ల స్థలాన్ని, శ్రీమతి నాదెళ్ళ తులసీరత్నం అను ఒక దాత సమకూర్చారు. 2005లో ఈ కేంద్రం మంజూరవగా, అప్పటికి భవనం లేకపోవడంతో, దాత ఇంటినే ప్రస్తుతం ఆరోగ్యకేంద్రంగా ఉపయోగించుకొనడానికి దాత అంగీకరించారు. భవన నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రు. 80 లక్షలకు అనుమతి మంజూరుకాగా, 2009,ఫిబ్రవరి-27న శంకుస్థాపన చేశారు.ఈ ఆరోగ్యకేంద్రాన్ని, 2015,ఆగస్టు-26వ తేదీనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాదుతో కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణాజిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి గద్దె అనూరాధ, నిడుమోలు మాజీ శాసనసభ్యులు శ్రీ పాటూరి రామయ్య, శ్రీమతి గోవాడ మరియకుమారి తదితరులు పాల్గొన్నారు. [20] ఈ ఆరోగ్యకేంద్రంలో పనిచేయుచున్న డాక్టర్ కె.రత్నగిరి, డాక్టర్ వెంకటపద్మావతి దంపతులు, 2016,జనవరి-26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ వైద్యాధికారులుగా పురస్కారం అందుకున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. నిమ్మగడ్డ, పురిటిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. పురిటిగడ్డ గ్రామ పంచాయతీ 1959లో ఏర్పడింది. గ్రామ ప్రస్తుత జనాభా = 2,656. ఓటర్లు=2,012. అయినా, నేటికీ పంచాయతీకి కార్యాలయభవనం లేదు. గ్రామానికి చెందిన రామాలయం పెంకుటింట్లోనే పంచాయతీ కార్యక్రమాలు, అధికారుల విధులు కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందు, భవననిర్మాణానికి రు 5లక్షలు మంజూరవగా, 2009లో శంకుస్థాపన జరిగినా నిధులు సరిపోక, నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పుడు, ఈ గ్రామానికి చెందిన, వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన, శ్రీ నాదెళ్ళ రామకృష్ణ, జన్మభూమిపై మమకారంతో, పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రు. 10 లక్షలు వితరణ చేయగా, నిర్మాణ పనులు త్వరితగతిన సాగుచున్నవి. [9]&[14]
  3. ఈ పంచాయతీ పరిధిలో నిమ్మగడ్డ ఇసుక క్వారీ ఉంది.
  4. 2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పరుచూరి సురేష్, 170 ఓట్ల ఆధిక్యంతో ఎన్నికైనారు. ఉపసర్పంచిగా మేడేపల్లి శ్రీనివాసరావు ఎన్నికైనారు.
  5. ఈ గ్రామ సర్పంచి పరుచూరి సురేష్, డిసెంబరు-5, 2013 నాడు, చల్లపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
  6. 2021, ఫిబ్రవరి-17 న పురిటిగడ్డ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మాతంగి రమ్య, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ గిరీశ్వరస్వామిస్వామివారి ఆలయం

[మార్చు]

శివాలయం చాలా పురాతనమయినది. ఇక్కడ శివలింగాన్ని శ్రీశైలం నుండి తెచ్చి ప్రతిష్ఠించారని పెద్దలు చెపుతుంటారు. 1898 లో ఒకసారి ఈ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. తరువాత జూన్ 18, 2011 నాడు మరియొక సారి ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది.

శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం

[మార్చు]

పురిటిగడ్డ గ్రామంలో ఒక కోటి రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయంలో, 2013,అక్టోబరు-18, శుక్రవారం నాడు ఉదయం 11-42 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో 2014,ఏప్రిల్-8న, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని, సద్గురు శ్రీ సాయినాధుని ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివార్ల నూతన విగ్రహాలను, ఆలయంలో ఏర్పాటుచేయించి, శ్రీరామనవమి వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, జూలై-12, శనివారం నాడు గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, అక్టోబరు-9 న, ప్రథమవార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదువేల మందికి అన్నసంతర్పణ నిర్వహించారు.

ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

పరుచూరి లింగయ్య

వీరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. ఆ రోజులలో వీరు మహాత్మా గాంధీగారి స్ఫూర్తిగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

మన దేశంలో 1928-29 లో స్వదేశీ దుస్తులు ధరించాలనే నినాదాలు దేశవ్యాప్తంగా పెల్లుబికినవి. ఖద్దరు దుస్తులు నేసి, వాటినే ధరించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. ఊరూరా ఖద్దరు దుస్తులు నేయించాలనే సంకల్పంతో గాంధీజీ పురిటిగడ్డ గ్రామానికి విచ్చేసి, గ్రామంలోని పరుచూరి వెంకటప్పయ్య గారి ఇంటిలో బస చేసినారట. ఆ ఇంటినే భారీ దుస్తుల కేంద్రంగా ఉపయోగించినారట. ఖాదీ దుస్తుల కేంద్రంగా పురిటిగడ్డ గ్రామం ఉండగా, దానికి అధ్యక్షులిగా శ్రీ పరుచూరి లింగయ్యగారు వ్యవహరించినారట. ఆ సమయంలో ఘంటసాల తదితర ప్రాంతాల నుండి, ఖాదీ ఉత్పత్తులను పురిటిగడ్డ గ్రామానికి తీసుకొని వచ్చేవారట. ఈ విషయాలను, ప్రస్తుతం ఆ గ్రామంలోనే నివసించుచున్న శ్రీ లింగయ్యగారి కుమారుడు శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు ఈనాడు దినపత్రికకు తెలిపినారు. [22]

గ్రామ విశేషాలు

స్వచ్ఛందసేవాసంస్థ

[మార్చు]

ఈ గ్రామంలో ఇండియా విలేజ్ మిని స్ట్రీస్ (I.V.M) అను ఒక స్వచ్ఛంద సేవాసంస్థ ఉంది. దీనిని స్థాపించినది, ఈ గ్రామస్థులైన Dr. వేములపల్లి సురేశ్. ఈ సంస్థకు ప్రస్తుత డైరెక్టరైన వీరు, సివిల్ ఇంజనీరింగ్ చదివి, బ్రిటనులో డాక్టరేటు పొందారు. వీరు చేస్తున్న సేవలు:- (1) అనాథ పిల్లల హోం (2) ఎడ్యు కేషనల్ హెల్ప్ (3) కుట్టు శిక్షణా కేంద్రం (4) వృద్ధులకు, వితంతువులకు సాయం (5) రిలీఫ్ ఎయిడ్

గ్రామంలో జరిగిన దుర్ఘటన

[మార్చు]

పురిటిగడ్డ గ్రామంలోని రజక పేటలో, 2012,జూన్-1వ తేదీన, ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 30 ఇళ్ళు దగ్ధంకాగా, రు. 20 లక్షల పైగా ఆస్తి నష్టం జరిగింది.. 55 కుటుంబాల వారు నిరాశ్రయులైనారు. . ఈ ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్కూట్ కారణంగా భావిస్తున్నారు.

Veeriki gruhalanu, government vaarthi patu IVM samstah (Dr. Vemulapalli Suresh ) vaari arthika sahayamutho tirigi gruhaalanu nirmincharu.

దత్తత గ్రామo

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ గ్రామాల (స్మార్ట్ విలేజ్) కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు డి.జి.పి.గా పనిచేయుచున్న శ్రీ ఆర్.పి.ఠాకూర్, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలంలోని పురిటిగడ్డ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్.పి.గా పనిచేసినప్పుడు ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం రీత్యా "పురిటిగడ్డ" గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపినారు. [16]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2062.ఇందులో పురుషుల సంఖ్య 1043, స్త్రీల సంఖ్య 1019, గ్రామంలో నివాస గృహాలు 591 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 347 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.

వెలుపలి లంకెలు

[మార్చు]