ప్రజ్వల్ రేవణ్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజ్వల్ రేవణ్ణ
ప్రజ్వల్ రేవణ్ణ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 23
ముందు హెచ్.డి.దేవెగౌడ
నియోజకవర్గం హసన్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1990-08-05) 1990 ఆగస్టు 5 (వయసు 34)
హసన్, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
తల్లిదండ్రులు హెచ్. డి. రేవన్న
భవానీ రేవన్న
బంధువులు హెచ్.డి.దేవెగౌడ (తాతయ్య)
హెచ్. డి. కుమారస్వామి
అనితా కుమారస్వామి
నిఖిల్ కుమార్ (కజిన్)
నివాసం హసన్, కర్ణాటక[1]
పూర్వ విద్యార్థి బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రజ్వల్ రేవన్న (ఆంగ్లం: Prajwal Revanna; జననం 1990 ఆగస్టు 5) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభ సభ్యుడు.[2] ఆయన భారతదేశంలోని మూడవ అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు.[3]

నేపథ్యం

[మార్చు]

ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటక ప్రజాపనుల శాఖ మాజీ మంత్రి, శాసనసభ్యుడు హెచ్‌డి రేవన్న కుమారుడు. ఆయన భారత మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి సోదరుడి కుమారుడు.

2014లో, ఆయన బెంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.[4] ఆయన ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరాడు, కానీ రాజకీయాలపై ఆసక్తితో దానిని మధ్యలోనే నిలిపివేశాడు. 2019లో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీ(ఎస్)) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

2014లో, ఆయన 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో హసన్ నుండి హెచ్‌డి దేవెగౌడ ప్రచారంలో పాల్గొన్నాడు.[6] 2015లో, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, యూకె ద్వారా బ్రిటీష్ పాలనా విధానాన్ని బహిర్గతం చేయడానికి ఎంపిక చేసిన భారతదేశంలోని 10 మంది యువ ఔత్సాహిక రాజకీయ నాయకులలో అతను కూడా ఉన్నాడు. జేడీ(ఎస్) సభ్యుడు అయినప్పటికీ, 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన రాజకీయాల్లోకి రావడం ఆలస్యమైంది.

2019లో, దేవెగౌడ ప్రజ్వల్‌ను హసన్ నుండి లోక్‌సభకు పోటీ చేయడానికి అనుమతించాడు, అంతేకాకుండా ఆయన స్వయంగా తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీలో నిలిచాడు. ప్రజ్వల్ హసన్ నుండి గెలుపొందాడు. దీంతో, ఈ ఎన్నికలలో పోటీ చేసిన (జేడీ(ఎస్) పార్టీ ఆరుగురు అభ్యర్థుల నుండి ఏకైక విజేతగా నిలిచాడు. అయితే, అనూహ్యంగా ఓటమి చెందిన వారిలో దేవెగౌడ కూడా ఉన్నాడు.[7][8]

సెప్టెంబరు 2019లో, అసంపూర్తిగా ఉన్న ఎన్నికల అఫిడవిట్‌పై కర్ణాటక హైకోర్టు ఆయనకు సమన్లు ​​జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ప్రజ్వల్ తన నామినేషన్ పత్రాలతో తప్పుడు, అసంపూర్తిగా అఫిడవిట్ దాఖలు చేసాడని సమన్ల పిటిషనర్లు ఆరోపించారు.[9] జనవరి 2020లో, జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా (John Michael D'Cunha) మొదటి పిటిషన్‌ను పిటిషనర్ ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 81(3) ప్రకారం చట్టబద్ధమైన విధానాన్ని పాటించలేదని, రెండవది సాంకేతిక కారణాలతో తోసిపుచ్చారు.[10]

2024 లైంగిక వేధింపుల ఆరోపణలు

[మార్చు]

2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు ప్రజ్వల్ మళ్లీ హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసాడు.[11] ఎన్నికల రోజు 2024 ఏప్రిల్ 26న హసన్ జిల్లాలో ప్రజ్వల్‌కు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని ఆరోపిస్తూ అతని పోలింగ్ ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.[12] నిందితులు ఇంటింటికీ వెళ్లి ఈ అశ్లీల ఫోటోలు, వీడియోలు చూపిస్తున్నారని, ప్రజ్వల్‌కు ఓటు వేయవద్దని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఏజెంట్ ఆరోపించాడు.[13] ఎన్నికలకు రెండు రోజుల ముందు నియోజకవర్గంలో ఈ ప్రచారం జరిగింది. దీనిపై దృష్టి పెట్టిన కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏప్రిల్ 27న ఏర్పాటు చేసింది.[14][15] ఈ వీడియోలతో కూడిన అనేక పెన్ డ్రైవ్‌లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. వాటిని హసన్‌లోని పార్కులు, బస్టాప్‌లు, స్టేడియం వంటి బహిరంగ ప్రదేశాలలో కూడా విసిరినట్లు నివేదించబడింది.[16][17] ఏప్రిల్ 30న, ప్రజ్వల్‌ను పార్టీ సస్పెండ్ చేసింది, అతనిపై ప్రారంభించిన సిట్ విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది.[18]

లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణలకు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేయగా, 2024 మే 3న కిడ్నాప్‌, అత్యాచారం కేసులు నమోదయ్యాయి.

ఆయన అధికారుల నుండి తప్పించుకోవడం కొనసాగించడంతో, సిట్ అతనిని గుర్తించడానికి ఇంటర్‌పోల్ నుండి సహాయం కోరింది. అతనిపై మే 5న బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయబడింది.[19][20]

2024 మే 31న, మ్యూనిచ్ నుండి లుఫ్తాన్స విమానంలో వచ్చిన తర్వాత బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవణ్ణని అరెస్టు చేశారు. మ్యూనిచ్ నుంచి విమానంలో ప్రజ్వల్ చెక్-ఇన్ చేసి ఎక్కినట్లు ఇంటర్‌పోల్ సిట్‌కు సమాచారం అందించింది. అతన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విమానాశ్రయం వద్ద అధికారులకు అప్పగించారు.[21]

మూలాలు

[మార్చు]
  1. "Prajwal R(JD(S)):Constituency- HASSAN(KARNATAKA) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 8 March 2020.
  2. "Hassan(Karnataka) Lok Sabha Election Results 2019 -Hassan Parliamentary Constituency, Winning MP and Party Name". www.elections.in. Retrieved 7 March 2020.
  3. Rao, Mohit M. (29 May 2019). "Karnataka's representation in 17th Lok Sabha is the youngest in recent years". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 7 March 2020.
  4. "Deve Gowda's grandson joins politics". The Times of India (in ఇంగ్లీష్). 2 February 2015. Retrieved 7 March 2020.
  5. "Prajwal Revanna is general secretary of JD(S)". The Hindu (in Indian English). 27 November 2017. ISSN 0971-751X. Retrieved 18 March 2020.
  6. "Prajwal Revanna: The rebellious one". The Week (in ఇంగ్లీష్). Retrieved 7 March 2020.
  7. "Deve Gowda ends suspense, will contest from Tumkur". Deccan Herald (in ఇంగ్లీష్). 23 March 2019. Retrieved 7 March 2020.
  8. "17th Lok Sabha", Wikipedia (in ఇంగ్లీష్), 6 March 2020, retrieved 7 March 2020
  9. "Karnataka HC summons Hassan MP Prajwal Revanna over incomplete election affidavit". The New Indian Express. Retrieved 7 March 2020.
  10. "Karnataka HC dismisses petition against Hassan MP Prajwal Revanna". The New Indian Express. 1 February 2020. Retrieved 11 December 2020.
  11. "Incumbent MPs D K Suresh & Prajwal Revanna file nominations in Karnataka". The Economic Times. 28 March 2024. Retrieved 28 April 2024.
  12. "Prajwal Revanna Responds On Hasan Video Controversy First Time, Says Truth Will Prevail Soon | Sakshi". web.archive.org. 2024-05-03. Archived from the original on 2024-05-03. Retrieved 2024-05-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. Desk, South First (25 April 2024). "'Morphed videos, photos of JD(S) MP Prajwal Revanna being circulated,' alleges his polling agent". The South First (in ఇంగ్లీష్). Retrieved 28 April 2024.
  14. "SIT To Probe 'Obscene Video Scandal' Involving JDS MP Prajwal Revanna; CM Siddaramaiah Reacts". News18 (in ఇంగ్లీష్). 28 April 2024. Retrieved 28 April 2024.
  15. Staff, T. N. M. (28 April 2024). "Prajwal Revanna leaves country as CM orders SIT probe into sex abuse allegations". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 28 April 2024.
  16. Bureau, The Hindu (28 April 2024). "Prajwal Revanna 'sex scandal' | Karnataka govt. announces SIT probe". The Hindu (in Indian English). Retrieved 28 April 2024.
  17. Joshi, Bharath. "Hassan sex scandal: CM Siddaramaiah orders special probe, Prajwal Revanna to flee?". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 28 April 2024.
  18. "Prajwal Revanna suspended from JD(S), but what was the compulsion to give him a ticket from Hassan?". CNBCTV18 (in ఇంగ్లీష్). 30 April 2024. Retrieved 3 May 2024.
  19. "Blue corner notice issued against Prajwal Revanna, Interpol help sought". Mint (in ఇంగ్లీష్). 5 May 2024. Retrieved 6 May 2024.
  20. "Explained | What is an Interpol 'Blue Corner' notice, and how will it speed probe against Prajwal Revanna". The Hindu (in Indian English). 6 May 2024. Retrieved 6 May 2024.
  21. "Prajwal Revanna: అర్ధరాత్రి ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్..నెక్ట్స్ ఏంటి? | Prajwal Revanna was arrested by sit in the middle of the night in bengaluru sri". web.archive.org. 2024-05-31. Archived from the original on 2024-05-31. Retrieved 2024-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)