కొటికలపూడి సీతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 16: పంక్తి 16:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

{{Authority control}}


[[వర్గం:1874 జననాలు]]
[[వర్గం:1874 జననాలు]]

18:19, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

కొటికలపూడి సీతమ్మ (1874 - 1936) ప్రముఖ రచయిత్రి. సంఘ సంస్కర్త.

ఈమె అబ్బూరి సుబ్బారావు గారి కుమార్తె; కొటికలపూడి రామారావు గారి భార్య. భర్త ఉద్యోగరీత్యా రాజమండ్రిలో చాలాకాలం నివసించారు. ఆకాలంలో కందుకూరి వీరేశలింగం గార్కి శుశ్రూషచేసి, వారినుండి తెలుగు భాషలోని మెళకువలు తెలుసుకొని మంచి కవయిత్రిగా పరిణమించారు. వీరేశలింగం గార్కి స్త్రీవిద్య విషయంలో తోడ్పడ్డారు. ఈమె సావిత్రి అనే పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఈమె కుమార్తె కానుకొల్లు చంద్రమతి కూడా మంచి రచయిత్రి. ఆమె 1961లో గృహలక్ష్మి స్వర్ణకంకణం గైకొంది.కొల్లిపర మండలం జెముడుపాడు ఈమె స్వగ్రామం.

1913లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ యందలి మహిళా శాఖకు అధ్యక్షత వహించారు.[1] అందులొ పాల్గొన్నవారి ఉపన్యాసములన్నింటిని వచన గ్రంథముగా సంపుటీకరించారు. చివరిదశలో పిఠాపురం మహారాణి గారికి విద్యనేర్చే గురువుగా పనిచేశారు. ఈమె వీరేశలింగం గారి జీవితచరిత్రను రచించారు. "ఒక మహమ్మదీయ వనిత" అనే కరుణరసమైన పద్యములు, లేడీ జేన్ గ్రే మొదలైన చిన్న కావ్యములు రచించారు.

రచనలు

  • అహల్యాబాయి చరిత్ర
  • సాధురక్షక శతకము
  • గీతాసారము (పద్యకావ్యము)
  • సతీధర్మములు
  • ఉపన్యాసమాలిక
  • ఉన్నత స్త్రీవిద్య
  • కందుకూరి వీరేశలింగం చరిత్ర

మూలాలు

  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ. 560.