బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72: పంక్తి 72:


==విశేషాలు==
==విశేషాలు==
ఒక(?)ఇంగ్లీషు చిత్రం ఆధారంగా ముళ్ళపూడి,బాపులు ఈ చిత్రకథ మూలం తయారుచేసుకున్నారు.సాక్షి చిత్రంచూసి బాపు రమణ పట్ల ఆసక్తితో అక్కినేని ఈ చిత్రంలో నటించారు.గోపాలం పాత్రకు దుస్తులు ,జగపతి సంస్థ లో అంతకు ముందు అక్కినేని వాడిన దుస్తుల్ని కొద్ది మార్పులతో ఉపయోగించారు.


==మూలాలు==
==మూలాలు==

13:01, 9 జూలై 2011 నాటి కూర్పు

బుద్ధిమంతుడు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం ఎన్.ఎస్. మూర్తి
కథ ముళ్ళపూడి వెంకటరమణ
చిత్రానువాదం ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (మాధవయ్య మరియు గోపాలం),
శోభన్ బాబు (శ్రీకృష్ణుడు),
విజయనిర్మల (రాధ),
నాగభూషణం (శేషయ్య),
అల్లు రామలింగయ్య,
జి. వరలక్ష్మి,
సూర్యకాంతం ,
కృష్ణంరాజు (కృష్ణ),
పద్మనాభం,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
(సహాయకుడు: పుహళేంది)
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
నిర్మాణ సంస్థ చిత్ర కల్పన
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


బుద్ధిమంతుడు , 1969లో విడుదలైన తెలుగు సినిమా. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో వూరిలో జరిగే కుతంత్రాలు కూడా కధలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే సామాన్యమైన కధాంశమే ఇది. అయితే సాక్షాత్తు భగవంతుడు ఒక సామాన్యమైన వ్యక్తివలే ఒకరికి కనుపిస్తూ మాట్లాడుతూ, అతను నివేదన చేసిన భోజనం స్వీకరిస్తూ, ఇతరులకు తెలియకుండా , చాలా సహజంగా మరొక పాత్రలాగా ఈ కధలో ఇమిడిపోవడం వలన ఈ సినిమా కధ స్వరూపమే మారిపోయింది.


అక్కినేని మరియు బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అక్కినేని ద్విపాత్రాభినయం ఆస్తికునిగా(భక్తునిగా) మరియు నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం ముత్యాలముగ్గు లో ఇదే పంధా నడుస్తుంది.(దాసరి దేవుడే దిగివస్తె, రాజాచంద్ర, మావూళ్ళో మహాశివుడు దీనికి కొనసాగింపు)

సంక్షిప్త కధ

మాధవయ్య ఒక పల్లెటూరిలో సనాతన భావాలు కలిగిన, భగవంతునిపట్ల అచంచలమైన విశ్వాసం మరియు భక్తి కలిగిన పూజారి. అతను తను అర్చించే ఆలయంలో స్వామితో యధాలాపంగా మాట్లాడుతూ, నైవేద్యాన్ని అందిస్తూ ఒక మిత్రుడు మరియు గురువుతో మెలగినట్లే మెలగుతుంటాడు. మాధవయ్య తమ్ముడు గోపాలం కాలేజీ విద్యార్ధి. స్నేహితులతో కలిసి త్రాగుతూ, తిరుగుతూ జీవితాన్ని అనుభవిస్తుంటాడు. భూమిమీద సుఖపడితే తప్పిలేదురా అనేది అతని తత్వం.


తమ్ముని దుడుకు చేష్టలూ, వ్యసనాలూ మాధవయ్యకు ఆవేదన కలిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆ వూరి కామందుల కుట్రలకు మాధవయ్య గురవుతాడు. వఅరి అసలైన దుష్టగుణాలను మాధవయ్య తెలిసికోలేడు. వారి పన్నాగాల వలన అన్నదమ్ములిద్దరూ వేరవుతారు.


పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
గుట్టమీద గువ్వ కూసింది - కట్టమీద కౌజు పలికింది ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
టాటా వీడుకోలూ గుడ్ బై ఇంక శెలవు - తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల
నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా దాశరథి కె.వి.మహదేవన్ ఘంటసాల
భూమ్మీద సుఖపడితె తప్పులేదురా బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల
పచ్చి మిరప కాయలాంటి పడుచుపిల్లరో దాని పరువానికి గర్వానికి పగ్గమేయరో ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ పి.సుశీల

విశేషాలు

ఒక(?)ఇంగ్లీషు చిత్రం ఆధారంగా ముళ్ళపూడి,బాపులు ఈ చిత్రకథ మూలం తయారుచేసుకున్నారు.సాక్షి చిత్రంచూసి బాపు రమణ పట్ల ఆసక్తితో అక్కినేని ఈ చిత్రంలో నటించారు.గోపాలం పాత్రకు దుస్తులు ,జగపతి సంస్థ లో అంతకు ముందు అక్కినేని వాడిన దుస్తుల్ని కొద్ది మార్పులతో ఉపయోగించారు.

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.