Jump to content

బండి సంజయ్ కుమార్

వికీపీడియా నుండి
జననం
జూలై 11, 1971
జాతీయతభారతీయుడు
వృత్తిపార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్‌
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిఅపర్ణ
పిల్లలుభగీరథ్, సుముఖ్‌
తల్లిదండ్రులుశకుంతల, నర్సయ్య

బండి సంజయ్ కుమార్ ( జననం: 1971 జూలై 11) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.. కరీంనగర్ నియోజకవర్గం నుండి 17,18వ లోక్ సభ సభ్యుడు. బండి సంజయ్ కుమార్ జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.[1] జూన్ 10న సంజయ్ ని హోం శాఖ సహాయ మంత్రిగా ప్రభుత్వం నియమించింది..

బాల్యం

[మార్చు]

ఈయన 1971 జులై 11న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించాడు. బండి సంజయ్ నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసేవాడు. సంజయ్ ను తన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశుమందిర్‌ లో చేర్పించాడు, అప్పటినుండే అయన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బండి సంజయ్ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశాడు.

ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సహాయక్‌గా నియమించారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP)లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 1994-2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పనిచేశాడు. భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పని చేశాడు. అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు ఇంచార్జి‌గా బాధ్యతలు నిర్వహించాడు.

2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థ‌కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశాడు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 14,000 పైగా ఓట్ల తేడాతో తో ఓడిపోయాడు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బి.వినోద్‌ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[2]

బండి సంజయ్ 2020 మార్చి 11[3] నుండి 2023 జులై 4 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన జులై 08న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[4] బండి సంజయ్‌ని 2023 జులై 29న బీజేపీ పార్టీ అధిష్ఠానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.[5] బండి సంజయ్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా బండి సంజయ్ ను 2024 జనవరి 03న బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించాడు.[6]

2024లో 18వ. లోక్ సభ కరీంనగర్ లోక్ సభ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజేందర్ రావు పై 2,25,209 మెజారిటీ ఓట్ల తో గెలుపొందాడు.[7]

బండి సంజయ్ కుమార్ జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[8][1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Andhrajyothy (10 June 2024). "కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  2. Sakshi (24 May 2019). "'కమల' వికాసం". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
  3. సాక్షి, హోం .. పాలిటిక్స్ (12 March 2020). "బీజేపీ బండికి.. సంజయుడే సారథి". Sakshi. Archived from the original on 12 మార్చి 2020. Retrieved 12 March 2020.
  4. Eenadu (8 July 2023). "భాజపా జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా బండి సంజయ్‌, సోము వీర్రాజు". Archived from the original on 8 జూలై 2023. Retrieved 8 July 2023.
  5. Eenadu (30 July 2023). "భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌". EENADU. Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
  6. Eenadu (4 January 2024). "కిసాన్‌ మోర్చా జాతీయ ఇన్‌ఛార్జిగా బండి సంజయ్‌". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  7. Desk, HT Telugu. "Bandi Sanjay : కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుస్తున్నా- బండి సంజయ్". Hindustantimes Telugu. Retrieved 2024-06-05.
  8. EENADU (9 June 2024). "కరీంనగర్‌ నుంచి కేంద్ర మంత్రి వరకూ.. బండి సంజయ్‌ ప్రస్థానమిదే". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.