Jump to content

బి.ఆర్. ఇషారా

వికీపీడియా నుండి
బి.ఆర్. ఇషారా
జననం
రోషన్ లాల్ శర్మ

(1934-09-07)1934 సెప్టెంబరు 7
మరణం2012 జూలై 25(2012-07-25) (వయసు 77)
క్రియాశీల సంవత్సరాలు1964-1996
జీవిత భాగస్వామిరెహనా సుల్తాన్

బాబు రామ్ ఇషారా (రోషన్ లాల్ శర్మ[1] 1934, సెప్టెంబరు 7 - 2012, జూలై 25 ) హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు. 1970లలోని సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగా ప్రసిద్ధి చెందాడు. 1964 - 1996 మధ్యకాలంలో 35 బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. చేతన, లోగ్ క్యా కహెంగే, మిలాప్, మన్ జైయే, ఘర్ కి లాజ్, వో ఫిర్ ఆయేగీ, సౌతేలా భాయ్, దూస్రా రూప్ 1982 వంటి సినిమాలతో బాగా ప్రాచుర్యం పొందాడు.[2]

జననం

[మార్చు]

ఇషారా 1934, సెప్టెంబరు 7న హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం, ఉనా జిల్లాలోని భర్వైన్[3]లో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1984లో బాలీవుడ్ నటి రెహానా సుల్తాన్‌ తో వివాహం జరిగింది.

సినిమారంగం

[మార్చు]

ఇతడు తీసిన ఇన్సాఫ్ కా మందిర్‌ సినిమాలో తరుణ్ బోస్, అరుణా ఇరానీ తదితరులు నటించారు. ఆ తరువాత చరిత్ర సినిమాతో క్రికెటర్ సలీం దుర్రానీని సినిమాల్లోకి తీసుకువచ్చాడు.పర్వీన్ బాబీ, స్వరకర్త బప్పి లాహిరిని కూడా సినిమారంగానికి పరిచయం చేశాడు. డానీ డెంగ్జోంగ్ప, రాకేష్ పాండే, విజయ్ అరోరా, జయ భాదురి, అమితాబ్ బచ్చన్, రీనా రాయ్, శతృఘ్న సిన్హా, రాజ్ కిరణ్, రజా మురాద్ వంటి అనేకమంది కొత్తవారితో కలిసి పనిచేశాడు. 1988లో రాజేష్ ఖన్నాతో తీసిన వో ఫిర్ అయేగీ సినిమా సిల్వర్ జూబ్లీ హిట్ కాగా, సౌతేలా భాయ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమాలు

[మార్చు]

దర్శకత్వం

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా ఇతర వివరాలు
1 1964 ఆవారా బాదల్
2 1969 ఇన్సాఫ్ కా మందిర్ కథా రచయిత
3 1970 గునా ఔర్ కానూన్
4 చేతన
5 1971 మన్ తేరా తన్ మేరా
6 1972 మనిషి జైయే
7 ఏక్ నాజర్
8 జరూరత్
9 మిలాప్
10 1973 నై దునియా నయే లాగ్
11 హాతీ కే దాంట్
12 ఏక్ నావో దో కినారే
13 దిల్ కి రహెన్
14 చరిత్ర
15 1974 ప్రేమ్ శాస్త్రం
16 దావత్
17 బజార్ బ్యాండ్ కరో
18 1975 కాగజ్ కి నావో
19 1978 రాహు కేతువులు
20 పాల్ దో పాల్ కా సాత్
21 1979 ఘర్ కీ లాజ్
22 1981 ఖరా ఖోటా
23 కరణ్
24 1982 లాగ్ క్యా కహెంగే
25 1983 జై బాబా అమర్‌నాథ్
26 1984 ఔరత్ కా ఇంతేకం
27 హమ్ దో హమారే దో బి. ఆర్ గా. ఇషార
28 1985 సౌతేల పతి
29 1986 ఔరత్
30 1987 బేసహారా
31 1988 వో ఫిర్ ఆయేగీ
32 సిల
33 1994 జనమ్ సే పెహ్లే
34 1996 సౌతేలా భాయ్
35 హుకుమ్నామా

మరణం

[మార్చు]

ఇషారా 77 సంవత్సరాల వయస్సులో క్షయవ్యాధితో[4] 2012, జూలై 24న ఉదయం 1:30 గంటలకు ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో మరణించాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]