Jump to content

మట్టి కుస్తీ

వికీపీడియా నుండి
మట్టి కుస్తీ
దర్శకత్వంచెల్ల అయ్యవు
రచనచెల్ల అయ్యవు
నిర్మాతరవితేజ
విష్ణు విశాల్
శుభ్ర
తారాగణంవిష్ణు విశాల్
ఐశ్వర్య లక్ష్మి
శ్రీజ రవి
ఆర్యన్ రమేష్
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం. నాథన్
కూర్పుప్రసన్న జీకే
సంగీతంజస్టిన్ ప్రభాకరన్
నిర్మాణ
సంస్థలు
ఆర్.టీ. టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
విడుదల తేదీs
2 డిసెంబరు 2022 (2022-12-02)(థియేటర్)
1 జనవరి 2023 (2023-01-01)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

మట్టి కుస్తీ తెలుగులో విడుదల కానున్న సినిమా. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై తమిళంలో గట్ట కుస్తీ పేరుతో, తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రవితేజ, విష్ణు విశాల్,[1] శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించిన ఈ సినిమాకు చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 20న విడుదల చేసి[2], సినిమా డిసెంబరు 2న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై[3],జనవరి 1న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[4]

వీర (విష్ణు విశాల్‌) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు, అతడిని చిన్న‌ప్ప‌టి నుంచి మామ‌య్య (క‌రుణాస్‌) పెంచి పెద్ద చేస్తాడు. ఎనిమిదో తరగతి చదివిన వీర తాతలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ, చిన్న చిన్న పంచాయితీలు తీరుస్తూ, కబడ్డీ ఆడుతూ కాలం గడుపుతూంటాడు. త‌ను పెళ్లి చేసుకోవాలంటే చ‌దువుకోని అమ్మాయి అయ్యుండాల‌ని, ఆమెకు పెద్ద జ‌డ ఉండాల‌నే షరతులు పెడతాడు. కీర్తి (ఐశ్వ‌ర్య ల‌క్ష్మి) తన ఇంట్లో ఇష్టం లేక‌పోయినా బాబాయ్ (మునీష్ కాంత్‌) సహకారంతో రెజ్ల‌ర్ అవుతుంది.ఆమె రెజ్ల‌ర్ కావ‌టంతో ఎవ‌రూ పెళ్లి చేసుకోవ‌టానికి ముందు రారు.

కీర్తి బాబాయ్ త‌న చిన్ననాటి స్నేహితుడైన వీరా మామ‌య్య క‌రుణాస్‌ని అనుకోకుండా క‌లుస్తాడు. ఈ క్రమంలో వీరాకి పెళ్లి కాలేద‌ని తెలుసుకొని తన కూతురు కీర్తి ఏడో త‌ర‌గ‌తి మాత్ర‌మే చ‌దువుకుంద‌ని, ఆమెకు పెద్ద జ‌డ ఉంద‌ని అబ‌ద్దాలు చెప్పి వీరాతో పెళ్లి జ‌రిపిస్తారు. కొన్నిరోజుల తరువాత వీరాకు కీర్తి రెజ్ల‌ర్ అనే నిజం తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
  • నిర్మాత: రవితేజ[8], విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చెల్ల అయ్యవు
  • సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
  • సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ఎం. నాథన్

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (26 November 2022). "'మట్టి కుస్తీ' ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో విష్ణు విశాల్". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NTV (20 November 2022). "ప్రేమ వర్సెస్‌ కుస్తీ.. విష్ణువిశాల్ మ‌ట్టి కుస్తీ ట్రైలర్‌". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  3. Eenadu (28 November 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022.
  4. Prajasakti (27 December 2022). "ఓటీటీలో 'మట్టి కుస్తీ'" (in ఇంగ్లీష్). Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  5. Eenadu. "రివ్యూ: మట్టికుస్తీ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  6. Eenadu (6 April 2022). "విష్ణు విశాల్‌.. 'మట్టి కుస్తీ'". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  7. Namasthe Telangana (30 November 2022). "కథల ఎంపికలో తొందర లేదు!". Archived from the original on 29 November 2022. Retrieved 29 November 2022.
  8. NTV Telugu (5 April 2022). "విష్ణు విశాల్ తో రవితేజ 'మట్టి కుస్తీ'". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.

బయటి లింకులు

[మార్చు]