అక్షాంశ రేఖాంశాలు: 16°51′57.492″N 81°56′54.564″E / 16.86597000°N 81.94849000°E / 16.86597000; 81.94849000

మారేడుబాక (మండపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారేడుబాక (మండపేట)
పటం
మారేడుబాక (మండపేట) is located in ఆంధ్రప్రదేశ్
మారేడుబాక (మండపేట)
మారేడుబాక (మండపేట)
అక్షాంశ రేఖాంశాలు: 16°51′57.492″N 81°56′54.564″E / 16.86597000°N 81.94849000°E / 16.86597000; 81.94849000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంమండపేట
విస్తీర్ణం3.43 కి.మీ2 (1.32 చ. మై)
జనాభా
 (2011)
1,846
 • జనసాంద్రత540/కి.మీ2 (1,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు929
 • స్త్రీలు917
 • లింగ నిష్పత్తి987
 • నివాసాలు510
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533308
2011 జనగణన కోడ్587583

మారేడుబాక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం.[2]

ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 4 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,855.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,936, మహిళల సంఖ్య 1919, గ్రామంలో నివాస గృహాలు 1,016 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 510 ఇళ్లతో, 1846 జనాభాతో 343 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 929, ఆడవారి సంఖ్య 917. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 445 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587583[4].

అందమైన గ్రామం

[మార్చు]

మండపేట మండలంలోని ఈ ఊరిలో మట్టి రహదారులు,కొబ్బరి చెట్లు,అరటి చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. రామంలో వరి ప్రధాన పంట. చెరకును కూడా ఎక్కువగానే పండిస్తారు. గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదే అధారపడి బ్రతుకుతున్నారు. పాడి పశువులు పెంచుతారు. కొంతమంది రైస్ మిల్లులలో, పేపర్ మిల్లులో పనిచేస్తుంటారు. ఊరిలో అధికంగా పెంకులతో నిర్మించిన ఇళ్ళు, తాటాకు ఇళ్ళు, డాబా ఇళ్ళు ఉన్నాయి.ఒక చెరువు కూడా ఉంది.

గ్రామ దేవాలయాలు

[మార్చు]

గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి. ఊరి జాతర జూన్ మాసంలో వస్తుంది. ఈ జాతర ఊరిలో జరిపే పెద్ద పండుగలలో ముఖ్యమైనది. గరగ నెత్తడం దగ్గరినుండి మొదలై అరిసెల పానుపు, గారెల పానుపులు వేయించుకుని జాగరం అయిన తరువాత భారీ ఎత్తున సంబరం జరిగిన తరువాత తిరునాళ్ళు చేస్తారు . అంతటితో ఆసంవత్సరం జాతర ముగుస్తుంది.ఊరిలో గల రెండు కుటుంబాలు వంతుల వారీగా గుడిని, ఈ జాతరను నిర్వహిస్తాయి. శివాలయం, జనార్ధన స్వామి ఆలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి.మూడు రామాలయాలు ఉన్నాయి. ఒక రామాలయంలోషిర్డీ సాయిబాబా పటాన్ని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు గ్రామస్థులు. ఒక వినాయకుని గుడి కూడా ఉంది. దీనిని గణేష్ సెంటర్ అని పిలుస్తారు. దేవీ నవరాత్రులకు దేవిని నిలబెట్టే కూడలిని దేవి సెంటర్ అని అంటారు.

ప్రధాన వీధులు

[మార్చు]

ఊరి మొత్తానికి మూడు పెద్ద కూడలులతో కలిసి నాలుగయిదు రహదారులు ఉన్నాయి. పెద్దవీధి, చాకలి పేట, మాల పేట. 2,3 పెద్ద కిరాణా షాపులు ఈ కూడళ్ళలో ఉన్నాయి. గ్రామ కూడలిలో ఒక దాన్ని గణేష్ సెంటర్ అని మరొక దాన్ని దేవీ సెంటర్ అనీ పిలుస్తారు.విద్య, వైద్యం, స్టేషనరీ, బట్టలు ఇతరత్రావాటి కొరకు 3 కిలోమీటర్లు దూరంలో ఉన్న మండపేట వెళ్ళాలి.

గ్రామంలో సౌకర్యాలు

[మార్చు]
మండపేట పబ్లిక్ స్కూల్, మారేడుబాక గ్రామం

ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. 2,3 కిరాణా షాపులు ఉన్నాయి. మండపేటలో ఉండే ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాభావం వల్ల ఈ ఊరికి మార్చబడింది. మండపేట పబ్లిక్ స్కూల్ ఈ ఊరిలో కెల్లా అతి పెద్ద స్కూల్. LKG నుండి పదవతరగతి వరకు సుమారు 1150 విద్యార్థులకు విద్యా సౌకర్యం కలిగిస్తున్నది. ఈ స్కూల్ కి హాస్టల్ వసతి ఉంది. ఊరి యొక్క మరొక ప్రత్యేకత పేపర్ మిల్లు. ఈ ఊరి యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగటానికి గుర్తింపు పొందటానికి ప్రధాన కారణం పేపరు మిల్లు.

సమస్యలు

[మార్చు]

పేపరుమిల్లు వలన ఊరి ప్రధాన కాలువ విపరీతంగా నష్టపోతున్నది. పేపర్ మిల్లు ద్వారా వదలబడు వ్యర్థపదార్ధాలు, శుద్ధి చేసిన వ్యర్ధాలే అయినా, కాలువలో కలువటం వలన ఆ నీరు పంటలకు వెళ్ళి పంటలు, చేపలు, వాటిని తినే ప్రజలు అందరూ నష్టపోతున్నారు. మరొక సమస్య బస్సు. ఈ ఊరికి బస్సు సర్వీసుకూడా సరిగా ఉండదు. ఒక ప్రయివేటు బస్సు ఉంది గానీ సరైన వేళలలో నడవదు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలో ఉంది. సమీప మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు రాజమండ్రిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మండపేటలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు రాజమండ్రిలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

మరేడుబాక (పాక్షిక)లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

మరేడుబాక (పాక్షిక)లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మరేడుబాక (పాక్షిక)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 46 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 296 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 296 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మరేడుబాక (పాక్షిక)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 236 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 60 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

మరేడుబాక (పాక్షిక)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

కాగితం, ఇటుకలు

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".