అక్షాంశ రేఖాంశాలు: 16°49′59″N 80°52′31″E / 16.83306°N 80.87528°E / 16.83306; 80.87528

ముక్కొల్లుపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్కొల్లుపాడు
పటం
ముక్కొల్లుపాడు is located in ఆంధ్రప్రదేశ్
ముక్కొల్లుపాడు
ముక్కొల్లుపాడు
అక్షాంశ రేఖాంశాలు: 16°49′59″N 80°52′31″E / 16.83306°N 80.87528°E / 16.83306; 80.87528
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంనూజివీడు
విస్తీర్ణం16.17 కి.మీ2 (6.24 చ. మై)
జనాభా
 (2011)
2,632
 • జనసాంద్రత160/కి.మీ2 (420/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,342
 • స్త్రీలు1,290
 • లింగ నిష్పత్తి961
 • నివాసాలు654
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521207
2011 జనగణన కోడ్589049

ముక్కొల్లుపాడు, ఏలూరు జిల్లా, నూజివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజివీడు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 654 ఇళ్లతో, 2632 జనాభాతో 1617 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1342, ఆడవారి సంఖ్య 1290. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 886 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589049[2].పిన్ కోడ్: 521201,

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[3]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నూజివీడు మండలం

[మార్చు]

నూజివీడు మండలంలోని అన్నవరం, ఎనమడాల, గొల్లపల్లె, జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, నూజివీడు, పల్లెర్లమూడి, పొలసనపల్లె, పోతురెడ్డిపల్లె, బాతులవారిగూడెం, బూరవంచ, మర్రిబందం, మీర్జాపురం, ముక్కొల్లుపాడు, మొర్సపూడి, మోక్షనరసన్న పాలెం, రామన్నగూడెం, రావిచెర్ల, వెంకాయపాలెం, వేంపాడు, సంకొల్లు, సీతారాంపురం, హనుమంతుని గూడెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 28 మీ.ఎత్తులో ఉంది.[4]

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కొర్లగుంట, తూర్పు దిగవల్లి, దిగవల్లి, వెంకటాయపాలెం, చింతలవల్లి గ్రామాలు ఉన్నాయి.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ముక్కొల్లుపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. నూజివీడు, ధర్మాజీగూడెం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 50 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు నూజివీడులో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నూజివీడులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ అన్నవరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాల వార్షికోత్సవం, 2017,మార్చి-10న ఘనంగా నిర్వహించారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కంచర్ల సాయిబాబు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం

[మార్చు]

ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-14వతేదీ మంగళవారంనాడు, స్వామివారి వార్షిక ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు, గ్రామస్థులు అధికసంఖ్యలో విచ్చేసిసి స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

శ్రీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు

[మార్చు]

ఈ గ్రామంలో పెరిగిన శ్రీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు, ప్రస్తుతం విజయవాడలో పోలీసు కమిషనరుగా పనిచేస్తున్నారు. వీరు రాష్ట్రపతి పతకానికి ఎంపికైనారు. వీరికి ఈ పతకాన్ని, 2015, జనవరి-26న అందజేయుదురు. ఐ.పి.ఎస్. అధికారైగా రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలలో, వివిధ హోదాలలో సేవలందించిన వీరు ఇప్పటికే అనేక బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. వీరు ఎం.టెక్. చదివి తరువాత ఆర్థికశాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించారు. 1990లో ఐ.పి.ఎస్.కి సెలెక్టు అయిన వీరు, అదనపు డి.జి.హోదాలో పనిచేస్తున్నారు. వీరు తను పెరిగిన గ్రామమైన ముక్కొల్లుపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి పరచడానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వీరి స్వగ్రామం మల్లవల్లి గ్రామం కాగా, వీరి పూర్వీకులు ఈ గ్రామానికి వచ్చి స్థిరపడినారు. స్టేట్ బ్యాంకులో ఉన్నతాధికారిగా పనిచేయుచున్న వీరి సోదరుడు మల్లవల్లి గ్రామాన్ని దత్తత తీసికున్నారు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ముక్కొల్లుపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ముక్కొల్లుపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 467 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 200 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 950 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 499 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 451 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ముక్కొల్లుపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 114 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 106 హెక్టార్లు
  • చెరువులు: 229 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ముక్కొల్లుపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు, పండ్లతోటలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం.వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2239. ఇందులో పురుషుల సంఖ్య 1124, స్త్రీల సంఖ్య 1115, గ్రామంలో నివాస గృహాలు 519 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1617 హెక్టారులు.

పట్టిక

[మార్చు]
వివరాలు మొత్తం మగ ఆడ
మొత్తం కుటుంబ గృహాలు సంఖ్య 654
మొత్తం జనాభా 2,632 1,342 1,290
వయస్సు 0-6 సంవత్సరాల లోపు వారు 307 165 142
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 886 458 428
షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 0 0 0
అక్షరాస్యులు 60.86 % 63.98 % 57.67 %
మొత్తం పనివారు 1,417 804 613
ప్రధాన పనివారు 1,405 10 0
మార్జినల్ పనివారు 12 6 6

అక్షరాస్యత

[మార్చు]

ముక్కొల్లుపాడు గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షరాస్యతా రేటుతో పోలిస్తే తక్కువగా ఉంది. 2011 సం.లో, ముక్కొల్లుపాడు గ్రామ అక్షరాస్యత రేటు ఆంధ్ర ప్రదేశ్ 67,02%తో పోలిస్తే60.86 గా ఉంది. ఈ గ్రామంలో పురుష అక్షరాస్యత 63.98% శాతం వద్ద ఉండగా, స్త్రీ అక్షరాస్యత రేటు 57.67% శాతం వద్ద ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-21.
  4. "ముక్కొల్లుపాడు". Retrieved 20 June 2016.

వెలుపలి లింకులు

[మార్చు]