మెట్ల సత్యనారాయణ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెట్ల సత్యనారాయణ రావు
మెట్ల సత్యనారాయణ రావు


తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు

వ్యక్తిగత వివరాలు

జననం (1942-01-04)1942 జనవరి 4
అల్లవరం మండలం కొమరగిరిపట్నం, తూర్పుగోదావరి జిల్లా
మరణం 2015 డిసెంబరు 25(2015-12-25) (వయసు 73)
హైదరాబాదులోని నిమ్స్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మతం హిందూ

మెట్ల సత్యనారాయణ రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి [1] ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం కమిటీలను ప్రకటించినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో 1942 జనవరి 4 న మెట్ల రామ్మూర్తి, సరస్వతి దంపతులకు జన్మించారు. 1974లో రంగరాయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన రాజకీయ జీవితం 1982లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైనది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.[3] 1982లో ఆయన అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. తరువాత 1994, 1999 లలో కూడా శాసనసభ్యునిగా ఎన్నికైనారు.[4]] 1996 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మెట్ల సత్యనారాయణ ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. కొంతకాలం పాటు ప్రజారాజ్యం పార్టీలోనికి చేరినా 2009 లో తిరిగి తెలుగుదేశం పార్టీలోనికి తిరిగి వచ్చి ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు.[5][6]

మరణం

[మార్చు]

ఆయన డిసెంబరు 25 2015 న ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మూలాలు

[మార్చు]
  1. "డీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల కన్నుమూత: సంతాపం తెలిపిన సీఎం". Archived from the original on 2015-12-28. Retrieved 2015-12-25.
  2. మాజీ మంత్రి మెట్ల మృతి [permanent dead link]
  3. మాజీమంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూత
  4. [http://eci.nic.in/archive/electionanalysis/AE/S01/partycomp55.htm Election Commission of India - State Elections 2004
  5. "TDP vice president Metla Satyanarayana passes away". Archived from the original on 2015-12-26. Retrieved 2015-12-25.
  6. "తెలుగుదేశం కమిటీలలో తూర్పు గోదావరికి పెద్ద పీట". Archived from the original on 2016-03-07. Retrieved 2015-12-25.

ఇతర లింకులు

[మార్చు]