మోసగాళ్లకు మోసగాడు (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోసగాళ్లకు మోసగాడు
మోసగాళ్లకు మోసగాడు సినిమా పోస్టర్
దర్శకత్వంనెల్లూరు బోస్
నిర్మాతచక్రి చిగురుపాటి
తారాగణంసుధీర్ బాబు,
నందిని రాయ్,
అభిమన్యు సింగ్,
చంద్రమోహన్,
జయప్రకాశ్ రెడ్డి
సంగీతంమణికాంత్ కద్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
22 మే 2015 (2015-05-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

మోసగాళ్లకు మోసగాడు 2015, మే 22న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మాణ సారథ్యంలో నెల్లూరు బోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, నందిని రాయ్, అభిమన్యు సింగ్, చంద్రమోహన్, జయప్రకాశ్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించగా, మణికాంత్ కద్రి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మంచు మనోజ్ అతిథి పాత్రలో నటించాడు.[1][2]

అయోధ్యకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం నుండి రాముడు, సీత విగ్రహాలు దొంగిలించబడతాయి. ఈ దోపిడీ వెనుక సూత్రధారి రుద్ర (అభిమన్యు సింగ్) విగ్రహాల కోసం రూ. 20 కోట్లు (200 మిలియన్లు) ఒప్పందం కుదుర్చుకుంటాడు. కృష్ణ (సుధీర్ బాబు) ఒక దొంగ, ఆర్టిస్ట్. అతను జానకి (నందిని రాయ్) తో ప్రేమలో పడతాడు, ఆమెను ప్రేమలోకి దింపడానికి ప్రయత్నిస్తుంటాడు. రామకృష్ణ విద్యాలయం వ్యవస్థాపకుడు మాస్టర్జీ రామచంద్ర (చంద్ర మోహన్) కు బ్యాంకు నుండి డిఫాల్ట్ నోటీసు వస్తుంది. దర్యాప్తు అధికారి ఒక హోటల్‌లో దొంగలను కనుగొంటారు. ఆ దొంగలు ఒక్కొక్కరు రాముడు, సీత విగ్రహాలతో పారిపోతారు. వారిలో ఒకరైన అమిత్, రుద్ర దగ్గరికి వెళ్తాడు. అతను గురూజీ (జయప్రకాష్ రెడ్డి) ఇంట్లో కొన్నిరోజులు దాచుకోమనిమ చెప్తాడు. ఇంకో వ్యక్తి సీత విగ్రహాన్ని రుద్రకు అప్పగిస్తాడు. అమిత్ నుండి రాముడి విగ్రహాన్ని దొంగిలించడానికి గురుజీ కృష్ణని పంపుతాడు. కృష్ణుడు విగ్రహంతో పారిపోగా, అమిత్ పోలీసు అధికారి చేతిలో చనిపోతాడు.

విగ్రహం దొంగిలించబడిందని తెలిసిన రుద్ర భారతదేశానికి వస్తాడు. కృష్ణ విగ్రహం విలువ గురించి ఆరా తీయగా, సీత విగ్రహం లేకుండా దాని విలువ లేదని తెలుస్తుంది. దాంతో కృష్ణ ఆ విగ్రహాన్ని రుద్రకు తిరిగి ఇచ్చేయాలనుకుంటాడు. గురుజీ అనుచరుడి వివాహం సందర్భంగా విగ్రహాన్ని అమ్మేయాలని రుద్ర ఆలోచిస్తుంటాడు. ఇంతలో, అప్పు తీర్చకపోవడంతో బ్యాంక్, పాఠశాల భూమిని వేలం వేస్తుంది. కృష్ణ, రుద్ర నుండి డబ్బును దొంగిలించి విగ్రహాలను పోలీసు అధికారికి అప్పగిస్తాడు. అతను తన స్నేహితుడు మంచు మనోజ్ ద్వారా డబ్బును మాస్టారుకు పంపిస్తాడు. రుద్ర, గురూజీ, స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేస్తారు. కృష్ణ డబ్బు దొంగిలించడం వెనుక గల కారణాన్ని నందిని అడుగుతుంది. తన చిన్నతనంలో ప్రమాదానికి గురైనప్పుడు మాస్టారు తన ప్రాణాలను రక్షించాడని చెబుతాడు. కృష్ణ, నందిని ఒకటై విగ్రహాలను ఆలయానికి తీసుకురావడంతో ఈ చిత్రం ముగుస్తుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి మణికాంత్ కద్రి సంగీతం అందించాడు.

సం.పాటగాయకులుపాట నిడివి
1."ఓహో సుందరీ"సూరజ్ సంతోష్ 
2."నావాడై"చిన్మయి, నకుల్ అభ్యంకర్ 
3."మోసగాళ్లకు మోసగాడు"బాబా సెహగల్ 
4."ఓహో సుందరీ" (రిమిక్స్)నవీన్ 
5."హోలో హలో"కార్తీక్, సుప్రియ లోహిత్ 
6."రామయ్య రామభద్ర"సూరజ్ సంతోష్ 
7."కాల్ ఫర్ మోసగాళ్లకు మోసగాడు"ఎంసి విక్కి 

స్పందన

[మార్చు]
  1. 123 తెలుగు: ఈ చిత్రం సుధీర్ బాబు కెరీర్‌కు మంచి ఫాలోయింగ్ ఇచ్చింది. దర్శకుడికి సాంకేతిక అంశాలపై పట్టు ఉంది, కాని అతను రాయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.[3]
  2. గ్రేట్ ఆంధ్రా: ఈ చిత్రాన్ని టైమ్-పాస్ మూవీగా పేర్కొంటూ, 2.75 రేటింగ్ ఇచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. "Mosagallaku Mosagadu Telugu Movie Review". www.123telegu.com. 24 మే 2015. Archived from the original on 5 ఫిబ్రవరి 2018. Retrieved 24 సెప్టెంబరు 2020.
  2. "Mosagallaku Mosagadu Telugu Review". Archived from the original on 3 జూలై 2018. Retrieved 24 సెప్టెంబరు 2020.
  3. admin (22 మే 2015). "Mosagallaku Mosagadu – Movie Review". Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 24 సెప్టెంబరు 2020.

ఇతర లంకెలు

[మార్చు]