రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
Appearance
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీనిని తమ్మారెడ్డి కృష్ణమూర్తి స్థాపించారు. విశ్వకవి రవీంద్రుని పట్ల గల అభిమానంతో అతడు రచించిన ‘గీతాంజలి’లోని ఓ గీత మకుటాన్ని ‘విశ్వవిజ్ఞాన చంద్రికలు వెలయుచోట, నిర్భయముగా స్వేచ్ఛాగీతి నిలుపుచోట, మానవుడు పరిపూర్ణుడై మలయుచోట, మాతృదేశమా అచటచే మనగదమ్మా’అని రచయిత నార్ల చిరంజీవిచే తర్జుమా చేయించి, దీనిని మోనోగ్రాఫ్‌పై బ్యాక్‌గ్రౌండ్‌గా, మాధవపెద్ది సత్యంచే పాడించి, విన్పించారు. చేతిలో పనిముట్టు ధరించిన కార్మికుని చిత్రం, ఈ చరణం, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రత్యేకతగా నిలిచాయి[1].
- లక్షాధికారి (1963)
- జమీందార్ (1965)
- బంగారు గాజులు (1968)
- ధర్మదాత (1970)
- దత్తపుత్రుడు (1972)
- డాక్టర్ బాబు (1973)
- సిసింద్రీ చిట్టిబాబు (1971)
- చిన్ననాటి కలలు (1975)
- లవ్ మారేజి
- ఇద్దరు కొడుకులు
- అమ్మానాన్న (1976)
మూలాలు
[మార్చు]- ↑ "బంగారు గాజులు - ఎస్.వి.రామారావు, సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 11-08-2018". Archived from the original on 2018-08-28. Retrieved 2018-10-30.
- ↑ రవీంద్రా ఆర్ట్స్ నిర్మించిన చిత్రాలు (అక్టోబరు 2008). నేనూ నా జ్ఞాపకాలు (ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ ed.). హైదరాబాదు: తమ్మారెడ్డి కృష్ణమూర్తి. p. 86.