రాబిన్ ఉత్తప్ప
1985 నవంబర్ 11 న కర్ణాటక లోని కొడగులో జన్మించిన రాబిన్ ఉత్తప్ప (Robin Venu Uthappa) (Kannada: ರಾಬಿನ್ ವೆನು ಉತ್ತಪ್ಪ) ప్రస్తుతం భారత వన్డే, ట్వంటీ-20 క్రికెట్ జట్టులో మెరుపులు మెరిపిస్తున్న యువ క్రికెట్ ఆటగాడు. అతని తండ్రి వేణు ఉత్తప్ప హకీ క్రీడకు అంతర్జాతీయ రెఫరీ. 2006లో ఇంగ్లాండుతో జరిగిన 7 వ, చివరి వన్డేలో మొదటిసారిగా జట్టులోకి ప్రవేశించాడు. తొలి వన్డేలోనే ఓపెనర్ గా బరిలోకి దిగి 86 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత తరఫున రంగప్రవేశం చేసిన మ్యాచ్ లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు.
రాబిన్ ఉతప్ప 2022 సెప్టెంబర్ 15న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించాడు.[1]
అంతర్జాతీయ క్రీడా జీవితం
[మార్చు]రాబిన్ ఉతప్ప 2006 ఏప్రిల్ 15న గౌహతిలో ఇంగ్లండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అరంగ్రేటం చేసి మొత్తం 46 వన్డేలు ఆడి 934 పరుగులు, 13 టీ20 మ్యాచ్ లు ఆడి 249 పరుగులు, ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 4,952 పరుగులు చేశాడు.
బయటి లింకులు
[మార్చు]- కర్ణాటక ప్రభుత్వం ఊతప్పకు నగదు అవార్డు ప్రకటన[permanent dead link]
- కేరళ ప్రభ్త్వం శ్రీశాంత్, ఊతప్పలకు నగదు అవార్డుల ప్రకటన Archived 2014-03-04 at the Wayback Machine
- 2006 లో రాబిన్ ఉత్తప్ప ఇంటర్వ్యూ
- అండర్-19 టీం లో ఉనప్పుడు రాబిన్ ఉత్తప్ప ఇచ్చిన ఇంటర్వ్యూ
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (14 September 2022). "రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప". Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
- Commons category link is on Wikidata
- All articles with dead external links
- 1985 జననాలు
- భారతీయ క్రీడాకారులు
- భారతీయ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ టెస్ట్ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ వన్డే క్రికెట్ క్రీడాకారులు
- కర్ణాటక క్రీడాకారులు
- కర్ణాటక క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ ట్వంటీ-20 క్రికెట్ క్రీడాకారులు
- జీవిస్తున్న ప్రజలు