Coordinates: 15°49′08″N 80°05′31″E / 15.819°N 80.092°E / 15.819; 80.092

రామకూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°49′08″N 80°05′31″E / 15.819°N 80.092°E / 15.819; 80.092
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంజే.పంగులూరు మండలం
Area
 • మొత్తం9.96 km2 (3.85 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం3,881
 • Density390/km2 (1,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి954
Area code+91 ( 08404 Edit this on Wikidata )
పిన్‌కోడ్523260 Edit this on Wikidata


రామకూరు బాపట్ల జిల్లా, జనకవరం పంగులూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జనకవరం పంగులూరు నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1071 ఇళ్లతో, 3881 జనాభాతో 996 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1986, ఆడవారి సంఖ్య 1895. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 103 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 377. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590744[2].పిన్ కోడ్: 523260.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల (శ్రీ రాజా రాజేశ్వరి ప్రాథమికోన్నత పాఠశాల, స్థాపితం: 01.01.1928) ఒకటి ఉన్నాయి. బాలబడి జనకవరం పంగులూరులోను, మాధ్యమిక పాఠశాల వలపర్లలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల జె.పంగులూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మార్టూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అద్దంకిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మార్టూరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఒంగోలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

రామకూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

రామకూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

రామకూరులోభూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 101 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 61 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 4 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 23 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 18 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 785 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 346 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 458 హెక్టార్లు]

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

రామకూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 108 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 240 హెక్టార్లు
  • చెరువులు: 108 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

రామకూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

సమీప గ్రామాలు[మార్చు]

వల్లపల్లి 5 కి.మీ, కోనంకి 5 కి.మీ, ఇసక దర్శి 6 కి.మీ, ధర్మవరం 6 కి.మీ, కొలలపూడి 6 కి.మీ.

గ్రంథాలయం[మార్చు]

గ్రామంలో 1964 ప్రాంతంలో, అప్పటి గ్రామ పెద్దలు శ్రీ మానం చినరామదాసు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు దాతల విరాళాలతో, గ్రామం నడిబొడ్డున గ్రంథాలయం నిర్మించారు. కాలక్రమేణా ఆ భవనం శిథిలావస్థకు చేరటంతో, గ్రామంలోని యువకులంతా ఏకమై, గ్రంథాలయ పునర్నిర్మాణానికి నిర్ణయించుకున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఈ గ్రామస్థుడైన శ్రీ జరుగుల సాయిబాబాను కలిసి, గ్రంథాలయ భవన నిర్మాణానికి సాయపడాలని కోరినారు. ఆయన సానుకూలంగా స్పందించి, తన తాత శ్రీ జరుగుల వెంకయ్య ఙాపకార్ధం, మొదటి విడతగా రు. 5 లక్షలను విరాళంగా అందజేసినారు. భవన నిర్మాణానికి కావలసిన మిగతా నిధులు గూడా తానే సమకూర్చెదనని హామీ ఇచ్చారు. త్వరలో గ్రంథాల భవన నిర్మాణం ప్రారంభించెదరు.

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామంలో 1.2 కోట్లరూపాయలవ్యయంతో, 33/11 కె.వి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మించారు. ఈ కేంద్రానికి కావలసిన భూమిని గ్రామానికి చెందిన యక్కల కుటుంబీకులు విరాళంగా అందజేసినారు. ఈ కేంద్ర వలన రామకూరు, ద్వారకంపాడు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయం సరఫరా అగును. ఈ గ్రామంలో ప్రస్తుతం 885 మంది గృహ వినియోగదారులు, 600 మంది బోర్ల వినియోగదారులు ఉన్నారు. [14]

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం[మార్చు]

శింగర చెరువు:- ఈ గ్రామంలో 22 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో, ఐదు లక్షల రూపాయల వ్యయంతో, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, పూడికతీత పనులు నిర్వహించారు. ఈ పనుల వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, సారవంతమైన పూడిక మట్టిని గ్రామంలోని పొలాలకు తరలించడతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలా వరకు తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [9]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పాలపర్తి త్రివేణి, సర్పంచిగా ఎన్నికైనారు.

దేవాలయాలు[మార్చు]

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు చురుకుగా సాగుచున్నవి. గ్రామంలోని పురాతన ఆలయం శిథిలం కావటంతో భక్తులు నూతన ఆలయ నిర్మాణానికి నడుం కట్టినారు. భక్తులతోపాటు గ్రామస్థులు అందించిన రు. 10 లక్షల రూపాయల విరాళంతో నూతన ఆలయ నిర్మాణం పనులు జరుగుచున్నవి. 2014 ఫిబ్రవరికి దేవాలయం పునహ్ ప్రారంభం కాగలదు.

కొండమీది శ్రీ బాలా త్రిపురసుందరీ గంగాదేవి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయం, ఏడాది పొడవునా వచ్చే పండుగలు, పర్వదినాలతోపాటు, కార్తీకమాసంలోనూ భక్తులతో కళకళలాడుతున్నది. భక్తులు నిత్యం స్వామికి, అబిషేకాలు, అర్చనలు జరిపించుచున్నారు. కార్తీకమాసమంతా కులమతాలకతీతంగా, వేలాదిమంది భక్తులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం, రామకూరు గ్రామస్తులకు తరతరాలుగా ఆనయాయితీగా వచ్చుచున్నది. తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులు, స్వామికి తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేటందుకు, జిల్లా నలుమూలలనుండి భక్తులు రామకూరుకు తరలి వచ్చెదరు. ఈ సంవత్సరం, 2014, జూలై-8, మంగళవారం నాడు, తిరునాళ్ళు నిర్వహించెదరు.

పురాణపుటలలో ఈ ఆలయం:- త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు వెళుతూ, బ్రహ్మ హత్యాపాతక నివారణార్ధం, దారిలోని కొండపై శివలింగ ప్రతిష్ఠ చేసి, మూడురోజులు స్వామికి అభిషేకాలు, అర్చనలు చేసినట్లు పురాణాలు చెబుచున్నవి. (శ్రీరామచంద్రుడు బ్రహ్మ హత్యాపాతక నివారణార్ధం పలుచోట్ల శివలింగాలు ప్రతిష్ఠించిననూ, కేవలం ఈ గ్రామంనకే తన పేరు మీదగా "రామకూరు" అని నామకరణం చేయడం ఇక్కడి విశిష్టత). శ్రీరాముడు ప్రతిష్ఠించినందున, స్వామి "శ్రీరామలింగేశ్వరుడు"గా ప్రసిద్ధుడైనాడు. ఇక్కడి అమ్మవారు సింహవాహిని దుర్గాదేవి. ఆలయాన్ని కుళోత్తుంగచోళుని కాలంలో, విపులచిదాండ్రి తిలక్ అను జాగీర్దారు నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి. తరువాతి కాలంలో రామకూరు గ్రామస్థుడు శ్రీ యక్కల రత్తయ్య అను భక్తుడు, కొండపాదం నుండి స్వామి సన్నిధి వరకు, 180 మెట్లు నిర్మించాడు. ఇంకా రామకూరు చరిత్ర నెల్లూరు పురావస్తు శాఖ వారి శాసనాల ద్వారా తెలుస్తుంది.

కొండపైకి ఘాటురోడ్డు:- కొండపై నుండి సన్నిధికి చేరేటందుకు, మెట్లదారితోపాటు, ఘాటురోడ్డు సౌకర్యంగూడా ఉంది. భక్తుల సౌకర్యార్ధం, కొండపైన రెండు గదుల సత్రం ఉంది. అలాగే వంటశాలలు, స్నానాల గదులు ఏర్పాటుచేస్తే భక్తుల అవసరాలు తీరగలవు. ఈ కొండమీద ఉన్న గణపతిస్వామి వారు, రామలింగేశ్వరస్వామి వారు, గంగాదేవి, బాలాత్రిపురసుందరి అమ్మవారు, వీరభద్రస్వామి వారు, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామివారు, ఒకే పానపట్టం పై ఉండటం ఈ క్షేత్ర మరో విశిష్టత. ఈ ఆలయానికి 60 ఎకరాల మాన్యం భూమి ఉంది. దీనిలో 34 ఎకరాలు ధూపదీపనైవేద్యాలు సమర్పించు అర్చకులకు, 24 ఎకరాలు ఆలయ అభివృద్ధికి అని నిర్ణయించారు. ఈ ఆలయం మూడు తరాల క్రితం నిర్మించారు. ఆలయ ప్రహరీగోడ హూద్ హూద్ తుఫాన్ సమయములో కూలినది. అప్పటి ఆలయాన్ని తొలగించి నూతనముగా రాతి ఆలయమును గ్రామస్తుల, దాతల సహాయముతో పునర్నిర్మాణం చేపట్టుచున్నారు.

కార్తీక మాసాంతాలలో (పోలి స్వర్గం), అరుద్ర నక్షత్రంలో, ఈ స్వామిసన్నిధానంలో వేలమంది వనభోజనాలు చేయడం, ఇక్కడ అనాదిగా వస్తున్నఆనవాయితీ. ఈ సందర్భంగా జే.పంగులూరు, మార్టూరు, బల్లికురవ, అద్దంకి మండలాలనుండి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చెదరు. తాజాగా 2020, డిసెంబరు-15వ తేదీ మంగళవారంనాడు ఈ వనభోజనల కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ నీలంపాటి అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ దశమ వార్షికోత్సవం 2014, మార్చి-16, ఆదివారంనాడు, ఫాల్గుణ పౌర్ణమి రోజున ఘనంగా జరిగింది.

శ్రీ రేణుకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు 2016, మే-8, ఆదివారం నుండి 13వతేదీ, శుక్రవారం వరకు నిర్వహించెదరు. ఆదివారం రాత్రికి అమ్మవారి సముద్రస్నాన ప్రయాణం, సోమవారం రాత్రికి తిరిగి స్వగ్రామానికి చేరిక, మంగళవారం గణాచారులచే అమ్మవారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు, బుధవారం రాత్రికి అమ్మవారి ఆలయ ప్రవేశం, గురువారం రామకూరు గ్రామస్థుల ఇంటి ఆడబడుచులచే అమ్మవారికి ప్రత్యేక పూజాధికాలు, మొక్కుల చెల్లింపులు, శుక్రవారం అమ్మవారికి గ్రామంలో వసంతసేవతో అమ్మవారి ఉత్సవాలు ముగింపుకి చేరుకుంటవి.

శ్రీ భేతాళ స్వామి విగ్రహం[మార్చు]

రామకూరు గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న నాగార్జునసాగర్ కాలువ కట్టలో శ్రీ భేతాళ స్వామి వారి విగ్రహం, శివలింగము ఉన్నాయి. ఇలాంటి విగ్రహం సమీప గ్రామాలలో ఎక్కడ చూడలేదని స్థానికులు చెబుతారు. ప్రతి సంవత్సరము నాగార్జున సాగర్ కాలువ నీరు విడుదల చేసిన తరువాత ఇచ్చట భక్తులు పూజ కార్యక్రమాలు నిర్వహించి తమను చల్లగా చూడమని, తమ ఊరిని, పంటలను కాపాడమని వేడుకుంటారు..

కొండమూరు (కొండపూరు) గ్రామం: జె. పంగులూరు మండలములోనే ఉన్న మరొక గ్రామం, ఒకప్పుడు "కొండపూరు"గా పిలువబడే నేటి "కొండమూరు" గ్రామం. సుమారు 5 శతాబ్దాల క్రితం, శ్రీ కొండపరెడ్డి అనే వ్యక్తి, రామకూరు కొండ నుండి మూరెడు రాయిని తెచ్చి ఈ గ్రామంలో ఉంచాడు. ఆ రాయికి "కొండమూరమ్మ" పేరుతో గ్రామస్థులు పూజలు జరిపేవారు. ఆ క్రమంలో ఊరుని "కొండపూరు" అని పిలిచెవారు. అదే కాలక్రమేణా "కొండమూరు" అయింది.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామంలో మంచాల గంగమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె తన 101వ ఏట, 2014, జూన్-23న ఎండతీవ్రత, వేడిగాలులకు అస్వస్తతకు గురియై, కాలం చేసారు.
  2. బాపట్ల ఎం.పి. శ్రీ శ్రీరాం మాల్యాద్రి, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయదనికై దత్తత తీసుకొన్నారు. ఈ గ్రామంలో 110 పక్కా గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది.
  3. రామకూరు ఛారిటబుల్ ట్రస్ట్. దీని ద్వారా ఈ గ్రామంలోనే కాక పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపడుచున్నారు.
  4. ఈ గ్రామానికి చెందిన ఉప్పతల మణికంఠ, జాతీయస్థాయి క్రికెట్టు జట్టుకు ఎంపికైనాడు. ఇతడు 2016, జనవరి-8 నుండి 13 వరకు గోవా రాష్ట్రంలో నిర్వహించు 19వ అఖిల భారత సూపర్ క్రికెట్ గోల్డ్ కప్-2016 లో అంధ్రప్రదేశ్ జట్టులో స్థానం సంపాదించాడు.

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,060. ఇందులో పురుషుల సంఖ్య 2,077, మహిళల సంఖ్య 1,983, గ్రామంలో నివాస గృహాలు 993 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 996 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రామకూరు&oldid=4166642" నుండి వెలికితీశారు