Jump to content

వికీపీడియా

వికీపీడియా నుండి
జిమ్మీ వేల్స్, వికీపీడియా సహ వ్యవస్థాపకుడు

వికీపీడియా, వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమష్టి కృషితో సులభంగా వెబ్ సైటును సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది[1]

చరిత్ర

[మార్చు]
లారీ సాంగర్, వికీపీడియా సహ వ్యవస్థాపకుడు

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియాలో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాస్తారు. వాటిని ఒక పద్ధతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరు జిమ్మీ వేల్స్,, దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డ్ స్టాల్​మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు.[2]

లారీ సాంగర్, జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు.[3] అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది.[4]

సాఫ్టువేరు , హార్డువేరు

[మార్చు]

వికీపీడియా ఓపెన్ సోర్సు, ఉచితంగా లభించే వికీమీడియా సాఫ్టువేరు ఆధారంగా నడుస్తుంది. ఇది పి హెచ్ పి (PHP) అనే భాషలో అభివృద్ధి చేయబడింది. దీనిలో వాడే డేటాబేసు పేరు మై ఎస్ క్యు ఎల్ (MySQL). ఇది జి ఎన్ యు జనరల్ పబ్లిక్ లైసెన్సు క్రింద రిజిస్టర్ చేయబడి ఉంది.

ఇతర భాషలు

[మార్చు]

ప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. డిసెంబరు 2007 గణాంకాలననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి, పోలిష్, జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.

ఎంతవరకూ ఆధారపడవచ్చు?

[మార్చు]

వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేవారు తప్పనిసరిగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నమోదు చేసుకోని సభ్యులు చేసే మార్పులు కూడా సభ్యత్వం ఉన్నవారు చేసే మార్పులతో సరిపోల్చగలవని 2007లో డార్ట్ మౌత్ అనే కాలేజీలో జరిగిన పరిశోధన ఆధారంగా తేలింది.

విమర్శ

[మార్చు]

వికీపీడియాలో వ్యాసాలను ఎవరైనా మార్పులు చేయవచ్చు కాబట్టి, ఈ సమాచారం మీద పూర్తిగా ఆధారపడలేమన్నది కొద్ది మంది విమర్శకుల వాదన. అంతేకాకుండా కొన్ని వ్యాసాలకు సరైన మూలాలు లేవని కూడా వారు భావిస్తున్నారు. కొద్ది మంది వ్యాఖ్యాతలు మాత్రం వికీపీడియా మొత్తంగా పోల్చుకుంటే ప్రమాణాలు కలిగిఉంది కానీ ఏదైనా ఒక్క వ్యాసాన్ని తీసుకుని దాని నాణ్యతను కచ్చితంగా అంచనా వేయలేమని భావిస్తున్నారు.

సోదర ప్రాజెక్టులు

[మార్చు]

వికీపీడియాతో బాటు అదే బాటలో నడిచే మరికొన్ని సోదర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. విక్షనరీ సమష్టి కృషితో రూపొందుతున్న బహుభాషా పదకోశం. వికీసోర్సు[permanent dead link] ఒక మూలాల (ఆధార రచనలు) భాండాగారం.

మూలాలు

[మార్చు]
  1. Wikipedia: వికీపీడియాలో భారత్‌ హవా.. | the most viewed wikipedia pages in 2023 https://www.eenadu.net/telugu-news/business/the-most-viewed-wikipedia-pages-in-2023/0101/123226412
  2. Stallman, Richard M. (2007-06-20). "The Free Encyclopedia Project". Free Software Foundation. Retrieved 2008-01-04.
  3. Meyers, peter (September 20, 2001). "Fact-Driven? Collegial? This Site Wants You". The New York Times. Retrieved 2007-11-22."I can start an article that will consist of one paragraph, and then a real expert will come along and add three paragraphs and clean up my one paragraph," said Larry Sanger of Las Vegas, who founded Wikipedia with Mr. Wales.
  4. "Wikipedia-l: LinkBacks?". Retrieved 2007-02-20.

ఇవి కూడా చూడండి

[మార్చు]