విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను
స్వరూపం
విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | శ్రీ ఖిల్లా మైసమ్మ ఆలయం దగ్గర, విక్టోరియా మెమోరియల్ హోం సమీపంలో, ఎల్.బి.నగర్, హైదరాబాదు, తెలంగాణ- 500060.[1] |
Coordinates | 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E |
యజమాన్యం | హైదరాబాదు మెట్రో |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Depth | 7.07 మీటర్లు |
Platform levels | 2 |
పార్కింగ్ | పార్కింగ్ ఉంది |
History | |
Opened | సెప్టెంబరు 24, 2018 |
విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని ఎల్.బి. నగర్ ప్రాంతంలో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోం సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2] మియాపూర్ నుండి ప్రారంభమయ్యే హైదరాబాద్ మెట్రోకు చెందిన కారిడార్ Iలో భాగంగా నిర్మించబడింది.
పద వివరణ
[మార్చు]1901లో నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జాహ్ VI నిర్మించిన విక్టోరియా మెమోరియల్ హోమ్ (సరూర్‌నగర్-ఎ-మహల్) పేరును ఈ మెట్రో స్టేషన్‌కు పెట్టారు.[2] ఇది శ్రీ ఖిల్లా మైసమ్మ ఆలయానికి సమీపంలో ఉంది.[3]
చరిత్ర
[మార్చు]2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
[మార్చు]విక్టోరియా మెమోరియల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[1]
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]
స్టేషన్ లేఅవుట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | → గమ్యస్థానం → ఎల్.బి. నగర్ వైపు | |
ఉత్తర దిశ | → వైపు ← మియాపూర్ ← దిల్సుఖ్నగర్ ← | |
సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 https://www.ltmetro.com/metro_stations/victoria-memorial/
- ↑ 2.0 2.1 "Heritage vantage point from Metro". The Times of India. Retrieved 2019-10-13.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Temple in a ruined fortress".
- ↑ https://www.ltmetro.com/metro-stations/
- ↑ 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.