శ్రీ వినాయక విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'శ్రీవినాయక విజయం' తెలుగు పౌరాణిక భక్తి చిత్రం.పౌరాణిక బ్రహ్మగా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం.ఉప్పలపాటి కృష్ణంరాజు, వాణీశ్రీ,రామకృష్ణ, ప్రభ, కె.ఆర్.విజయ మున్నగు వారు నటించారు.ఈ చిత్రం1979 డిసెంబర్ 22 న విడుదలైనది.ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు సమకూర్చారు .

శ్రీ వినాయక విజయము
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం కృష్ణంరాజు,
వాణిశ్రీ
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ జగన్మాత ఆర్ట్స్
భాష తెలుగు

పరమేశ్వరుడు త్రిపురాసురులను అంతమొందించిన తరువాత గజాసురుడు, మూషికాసురుడు అనే రాక్షసులు ముల్లోకాలను గజగజలాడించడం మొదలు పెట్టారు. శివభక్తుడైన గజాసురుడు తపశ్శక్తితో శివుని మెప్పించి శివుడు నిత్యం తనలోనే వుండేలా వరం పొందుతాడు. శివుని విరహం భరించలేని పార్వతి శివదీక్షావ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ బాలునికి ఉమాపుత్రుడని నామకరణం చేసి తన దీక్షకు భంగం కలగకుండా అతడిని కాపలా ఉంచుతుంది. మహావిష్ణువు ఆడిన నాటకం మూలాన శివుడు గజాసురుని గర్భంలోనుండి బయటకువచ్చి కైలాసంలో తన మందిరం లోనికి ప్రవేశించబోగా పార్వతీ మానసపుత్రుడైన బాలుడు అడ్డగించడంతో ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండించాడు. పార్వతి ఇది తెలుసుకుని కోపోద్రిక్తురాలవడంతో శివుడు బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు. ఈ బాలుడే మూషికాసురుని సంహరించడానికి అవతరించిన వినాయకుడు. ద్విరూపుడూ, ద్విజన్ముడూ, సర్వవిద్యాపారంగతుడూ అయిన వీరుని చేతిలో చావు వ్రాసిపెట్టి ఉన్న మూషికాసురుని వినాయకుడు సంహరించిన విధానమూ, మూషికాసురుని జన్మవృత్తాంతమూ, వినాయకుడు గణాధిపతి, విఘ్నేశ్వరుడు, సర్వ సిద్ధి ప్రదాత అయిన విధానమూ ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: బోణం ఆంజనేయులు
  • దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
  • సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  • నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి
  • నిర్మాణ సంస్థ: జగన్మాతఆర్ట్స్
  • సాహిత్యం: వేటూరి,దేవులపల్లి,ఆరుద్ర, వీటూరి,కొసరాజు, జి.వి.రంగాచార్యులు
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎస్ పి శైలజ, వాణి జయరాం, విజయలక్ష్మి శర్మ, మాధవపెద్ది, వి.రామకృష్ణ, ఎం.రమేష్, టి.ఆర్.జయదేవ్, రమోల, బి.వసంత, రేఖా, ఎస్.రాజేశ్వరరావు.
  • విడుదల:22:12:1979.

పాటలు

[మార్చు]
  1. అన్ని లోకాలనేలెడు కన్నతల్లి కామితము లెల్ల (పద్యం) - రచన: వేటూరి; గానం: ఎస్.జానకి
  2. ఎవరవయా ఎవరవయా ఏ దివ్య భువినుండి దిగి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం:పి.సుశీల
  3. ఒక వంక వరనీల కబరీ భరమ్ము (దండకం)- రచన: వేటూరి; గానం: ఎమ్.రమేష్, ఎస్.పి.శైలజ
  4. కిలకిల నగవుల జలకములాడగ జిలిబిలి పలుకుల - రచన: ఆరుద్ర; గానం: వాణీ జయరాం
  5. కోటి నదులందు మునిగిన మేటి ఫలము భూమి ముమ్మారు (పద్యం) - రచన: వేటూరి; గానం: ఎమ్.రమేష్
  6. కండ కావరమున కాంతల చెరబట్టి (పద్యం) - రచన: వేటూరి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  7. నమో నమో తాండవకేళీ లోలా నమో నమో ఆశ్రిత జనపాలా - రచన: వేటూరి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  8. బాలను లాలించరా గజానన మేలిమి నెరజాణరా - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
  9. మ్రోగి మ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణల తీగెలు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,విజయలక్ష్మి శర్మ, ఎస్.పి.శైలజ
  10. గంగాహృత్యుమబృంగా శోభిత శుభాంగా బస్మరాగాంగ (శ్లోకం ) - మాధవపెద్ది
  11. డూ డూ డూ బసవన్నాభళిరా అందెల బసవన్నా- రచన: కొసరాజు; గానం:రామకృష్ణ, రమోల బృందం
  12. ద్వేషము మీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి (పద్యం) -రచన: వీటూరి; గానం:మాధవపెద్ది
  13. పాహిమాం పాహిమాం హే జగన్మాతా సౌభాగ్య (స్తోత్రం) - రచన: వీటూరి; గానం:ఎస్.జానకి
  14. విలాసాల వేళ లాలించనీ సరాగాలతో మనోహర లీల -రచన: వీటూరి;గానం: ఎస్.జానకి
  15. శ్రీమన్మహా దేవదేవా అమేయప్రభావా భవా (స్తోత్రం) -రచన: వీటూరి;గానం: ఎస్.పి. శైలజ, ఎం. రమేష్
  16. హే పరమేశ్వరీ భక్త వశంకరి చంద్రకళాధరి - రచన: వీటూరి; గానం:టి.ఆర్.జయదేవ్, బి.వసంత బృందం
  17. వందేలోక హితం కరీమ్ శుభకరీమ్ సర్వార (శ్లోకం) - రచన: జి.వి. రంగాచార్యులు;గానం:ఎస్.పి. శైలజ
  18. వేద వేదాంత (శ్లోకం) - రచన: జి.వి. రంగాచార్యులు;గానం:ఎస్. రాజేశ్వరరావు,ఎస్.పి. శైలజ,రేఖ
  19. సర్వ విఘ్న హరం దేవం పార్వతీ ప్రియ(శ్లోకం) - రచన: జి.వి. రంగాచార్యులు;గానం:ఎస్. రాజేశ్వర రావు

మూలాలు

[మార్చు]
  1. రమణ (1 January 1980). "చిత్ర సమీక్ష: శ్రీవినాయకవిజయము" (PDF). ఆంధ్రపత్రిక. No. సంపుటి :66, సంచిక:270. Archived from the original (PDF) on 10 సెప్టెంబరు 2022. Retrieved 10 September 2022.

బయటిలింకులు

[మార్చు]