శ్రీరామ విలాస సభ, తెనాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీరామ విలాస సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలో 1921వ సంవత్సరంలో ప్రారంభించిన నాటక సంస్థ. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి అద్భుతమైన నాటకాలను ప్రదర్శంచిన ఈ నాటక సంస్థ తెలుగు నాటకరంగంలోని ఇతర నాటక సమాజాలకు మార్గదర్శిగా నిలిచింది.[1]

ప్రారంభం[మార్చు]

తెనాలి పట్టణ తొలిచైర్మన్ చిమిటిగంటి సుబ్రమణ్యం దగ్గర ప్లీడర్ గుమస్తాగా పనిచేసిన పెద్దిభొట్ల రామయ్య 1921లో సంగీత నేషనల్ మనోరంజని విలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించాడు. భాగవతుల రాజారాం ఈ నాటక సంస్థను కొనుగోలు చేసి రామయ్య షరతు ప్రకారం శ్రీరామ విలాస సభ అని పేరు పెట్టాడు.

కళాకారులు[మార్చు]

నటులు:

  1. మాధవపెద్ది వెంకటరామయ్య
  2. పెద్దిభొట్ల సుబ్బరామయ్య
  3. స్థానం నరసింహారావు

దర్శకులు:

  1. త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి
  2. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
  3. భాగవతుల రాజారాం

సంగీత దర్శకులు:

  1. భీమవరపు నరసింహరావు
  2. మారుతీ సీతారామయ్య
  3. చింతా వెంకటేశ్వర్లు
  4. బుద్దిరాజు శ్రీరామ్మూర్తి
  5. శనగవరపు శ్రీరామమూర్తి

ప్రదర్శించిన నాటకాలు[మార్చు]

  1. ప్రతాపరుద్రీయం
  2. బొబ్బిలి యుద్ధం
  3. శ్రీకృష్ణ తులాభారం
  4. రోషనార
  5. సతీ అనసూయ
  6. పాండవ ఉద్యోగ విజయాలు
  7. షోరాబ్ రుస్తుం
  8. కన్యాశుల్కం
  9. నరకాసురవధ
  10. రాణి సంయుక్త
  11. వీణరాజు
  12. సారంగధర
  13. సత్య హరిశ్చంద్ర
  14. చంద్రగుప్త

ఇతర వివరాలు[మార్చు]

  1. నటీనటులకు ఈ సంస్థ నెలవారి జీతాలను ఇచ్చేది.
  2. తొలిసారిగా ఈ సంస్థ మేకప్ లో మాములు రంగులకు బదులుగా గ్రీజు రంగులకు ఉపయోగించారు.
  3. సంవత్సరంలో మూడు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు చేసేవారు.
  4. 1935 వరకు విజయవంతంగా నిర్వహించబడిన ఈ నాటక సంస్థ, అగ్రనటులు మధ్య మనస్పర్ధల కారణంగా మూసివేయబడింది.

మూలాలు[మార్చు]

  1. నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14