Jump to content

సంజు శాంసన్

వికీపీడియా నుండి
సంజు శాంసన్
సంజు శాంసన్ (2017)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సంజు విశ్వనాథ్ శాంసన్
పుట్టిన తేదీ (1994-11-11) 1994 నవంబరు 11 (వయసు 29)
పుల్లువిలా, తిరువనంతపురం, కేరళ
ఎత్తు5 అ. 7 అం. (170 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్[2]
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 241)2021 జూలై 23 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 ఆగస్టు 1 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.9
తొలి T20I (క్యాప్ 55)2015 జూలై 19 - జింబాబ్వే తో
చివరి T20I2023 ఆగస్టు 13 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.9 (గతంలో 14)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–ప్రస్తుతంకేరళ (స్క్వాడ్ నం. 9)
2013–2015రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 8)
2016–2017ఢిల్లీ క్యాపిటల్స్ (స్క్వాడ్ నం. 8)
2018–ప్రస్తుతంరాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 11)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ట్వంటీ20 ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 12 16 55 226
చేసిన పరుగులు 391 296 3,162 5,612
బ్యాటింగు సగటు 55.71 21.14 37.64 28.63
100లు/50లు 0/3 0/1 10/12 3/35
అత్యుత్తమ స్కోరు 86* 77 211 119
క్యాచ్‌లు/స్టంపింగులు 7/2 7/2 73/7 118/22
మూలం: Cricinfo, 2023 జనవరి 3

సంజు శాంసన్, కేరళకు చెందిన క్రికెటర్. దేశీయ క్రికెట్‌లో కేరళకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

కుడిచేతి వాటం కలిగిన వికెట్-కీపర్-బ్యాటర్, 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత అండర్-19 జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. 2015 లో జింబాబ్వేతో జరిగిన అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు, 2021లో శ్రీలంకపై వన్డే అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశాడు.

ఢిల్లీలో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన సంజు, తరువాత కేరళకు వెళ్ళాడు. జూనియర్ క్రికెట్‌లో ప్రభావం చూపిన తర్వాత, 2011లో కేరళ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున తన ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకున్నాడు. 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో అజేయంగా 212 పరుగులు చేసాడు, లిస్ట్ ఎ క్రికెట్‌లో ఆరోసారి డబుల్ సెంచరీ చేశాడు, ఇది ఫార్మాట్‌లో రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీగా నమోదయింది.

తొలి జీవితం

[మార్చు]

సంజు 1994, నవంబరు 11న[3] కేరళ రాష్ట్రం, తిరువనంతపురం జిల్లాలోని విజింజం సమీపంలోని తీరప్రాంత గ్రామమైన పుల్లువిలాలో ఒక మలయాళీ కుటుంబంలో[4] జన్మించాడు.[5] తండ్రి శాంసన్ విశ్వనాథ్, గతంలో ఢిల్లీ పోలీస్‌లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. రిటైర్డ్ ఫుట్‌బాల్ ప్లేయర్ గా సంతోష్ ట్రోఫీ[6] లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. తల్లి లిజీ విశ్వనాథ్ గృహిణి.[7] అన్నయ్య సాలీ శాంసన్ జూనియర్ క్రికెట్[8][9] లో కేరళకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఏజీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.[10]

ఇండియన్ ప్రీమియర్ లీగ్

[మార్చు]
2014 ఐసిఎల్ సమయంలో శాంసన్
బుతువు జట్టు మ్యాచ్‌లు పరుగులు
2013 రాజస్థాన్ రాయల్స్ 11 206
2014 రాజస్థాన్ రాయల్స్ 13 339
2015 రాజస్థాన్ రాయల్స్ 14 204
2016 ఢిల్లీ డేర్ డెవిల్స్ 14 291
2017 ఢిల్లీ డేర్ డెవిల్స్ 14 386
2018 రాజస్థాన్ రాయల్స్ 15 441
2019 రాజస్థాన్ రాయల్స్ 12 342
2020 రాజస్థాన్ రాయల్స్ 14 375
2021 రాజస్థాన్ రాయల్స్ 14 484
2022 రాజస్థాన్ రాయల్స్ 17 458
2023 రాజస్థాన్ రాయల్స్ 14 362
మొత్తం 152 3888
ఈ నాటికి 30 May 2023 – Source: IPL T20[11]

క్రికెట్ వెలుపల

[మార్చు]

2016 నాటికి, సంజు తిరువనంతపురంలోని భారత్ పెట్రోలియం మేనేజర్‌గా పనిచేశాడు.[12] 2018లో తిరువనంతపురంలో యువ ఆటగాళ్ళకు క్రికెట్, ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చేందుకు "సిక్స్ గన్స్ స్పోర్ట్స్ అకాడమీ" అనే స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు.[13] 2021 కేరళ శాసనసభ ఎన్నికలకు ముందు కేరళ రాష్ట్ర ఎన్నికల చిహ్నంగా నియమించబడ్డాడు.[14] 2023 ఫిబ్రవరిలో ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్స్ ఎఫ్.సి. క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి సంజును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రకటించింది.[15]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తిరువనంతపురం నివాసి అయిన తన చిరకాల స్నేహితురాలు చారులత రమేష్‌తో తన వివాహం జరుగునున్నట్లు 2018, సెప్టెంబరు 8న సంజు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటించాడు.[16] వారు మార్ ఇవానియోస్ కాలేజీకి చెందిన కాలేజీ-మేట్స్.[17] 2018 డిసెంబరు 22న కోవలంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం జరిగింది.[18] సంజూ మాజీ కోచ్, మెంటర్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వివాహానికి హాజరయ్యాడు. వివాహ రిసెప్షన్ అదే రోజు నలంచిరలో జరిగింది.[19]

మూలాలు

[మార్చు]
  1. "Sanju Samson - India's next big thing?". Mobile Premier League. 6 September 2021. Archived from the original on 9 September 2021. Retrieved 2023-08-16.
  2. "Sanju Samson - Wisden profile". Wisden India. Archived from the original on 6 September 2021.
  3. "From Virat Kohli to David Miller, cricketers wish Sanju Samson happy birthday". DNA India. 11 November 2020. Retrieved 2023-08-16.
  4. "KRLCC Awards Announced". New Indian Express. 17 May 2014. Archived from the original on 2019-12-11. Retrieved 2023-08-16.
  5. Karhadkar, Amol (3 November 2011). "Sanju Samson - Cricinfo Profile". ESPN Cricinfo. Archived from the original on 9 September 2021.
  6. "IPL's new find Sanju Samson: a Viswanath in him?". Sportskeeda. 18 April 2013. Retrieved 2023-08-16.
  7. J Binduraj (6 August 2014). "How Kerala boy Sanju Samson made it to Team India". India Today. Retrieved 2023-08-16.
  8. Karhadkar, Amol (3 May 2013). "Sanju Samson grabs his biggest chance to shine". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
  9. "Saly Samson". Cricket Archive.
  10. "When Delhi's politics defeated Sanju Samson". The Times of India. 7 May 2021. Retrieved 2023-08-16.
  11. "Rajasthan Royals squad - Sanju Samson". IPL T20.
  12. Jayaprasad, R (4 August 2016). "സഞ്ജുവിന്റെ മനസ്സിൽ ലോകകപ്പ് സ്വപ്നമില്ലാത്തതിന്റെ കാരണം" [Here is the reason why Sanju Samson doesn't have a world cup dream]. Mathrubhumi (in మలయాళం). Archived from the original on 2021-04-24. Retrieved 2023-08-16.
  13. Tahir Ibn Manzoor (2 March 2018). "Sanju Samson opens new sports academy in Thiruvananthapuram". Cricket Addictor. Archived from the original on 2021-06-27. Retrieved 2023-08-16.
  14. "EC asks to remove E Sreedharan's photo from posters, Sanju Samson will replace him". Kerala Kaumudi. 8 March 2021. Archived from the original on 17 November 2021. Retrieved 2023-08-16.
  15. "Sanju Samson becomes Kerala Blasters' brand ambassador, remembers father's connection with football". English.Mathrubhumi (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  16. "Sanju Samson announce marriage with classmate Charulatha". India Today. 9 September 2018. Archived from the original on 2021-09-23. Retrieved 2023-08-16.
  17. U.R, Arya (11 September 2018). "Sanju is all set to open martial innings with Charu". Times of India. Archived from the original on 17 November 2021. Retrieved 2023-08-16.
  18. "Sanju Samson and Charulatha's breathtaking Kovalam wedding: See photos". India Today. 22 December 2018. Retrieved 2023-08-16.
  19. "PHOTOS: Kerala Chief Minister Pinarayi Vijayan, Rahul Dravid attend Sanju Samson's wedding reception". Indian Express (in ఇంగ్లీష్). 22 December 2018. Archived from the original on 17 November 2021. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు

[మార్చు]